MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devatha: ఆదిత్యతో పాండిచెర్రీ ట్రిప్ ప్లాన్ చేసిన సత్య!.. జానకమ్మ వాళ్లతో, ప్రకృతి వైద్యశాలకు వస్తాను అన్న ఆది

Devatha: ఆదిత్యతో పాండిచెర్రీ ట్రిప్ ప్లాన్ చేసిన సత్య!.. జానకమ్మ వాళ్లతో, ప్రకృతి వైద్యశాలకు వస్తాను అన్న ఆది

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 3వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Oct 03 2022, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ఆదిత్య రుక్మిణి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రుక్మిణి ఆదిత్యతో,సడన్గా డాక్టర్ గారికి ఏమైంది అని అడగగా, ఏమో తెలీదు రుక్మిణి, ఆవిడ ఉంటే జానకమ్మ గారికి త్వరగా నయమవుతుంది అనుకున్నాము. కానీ ఇప్పుడు ఆవిడ వైద్యం చేసే పరిస్థితుల్లో లేరు అని అంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాము ఇంకేం అవకాశం లేదా?ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు అని రుక్మిణి అనగా, నాకు తెలిసిన ఒక ప్రకృతి వైద్యశాల ఉంది. అక్కడికి వెళ్లి వైద్యం చేపిస్తే నయమవుతుంది అని ఆదిత్య అనగా సరే  అంటుంది రుక్మిణి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ తర్వాత సీన్లో సత్య జరిగిన విషయం గురించి బాధపడుతూ ఉండగా దేవుడమ్మ వచ్చి, నువ్వు ప్రతి విషయాన్ని  మనసు వరకు తీసుకోవద్దు సత్య. అయితే ఒక పని చెయ్యు నువ్వు, ఆదిత్య ఇద్దరు అలా బయటకు వెళ్ళండి. రెండు రోజులు తిరిగి రండి అప్పుడైనా మీ ఇద్దరు మనసులు మళ్ళీ కలుస్తాయి కదా. నేను ఆదిత్య ని ఎలాగైనా ఒప్పిస్తాను అని అంటుంది. సరే అలాగే ఆంటీ అని సత్య అంటుంది. అప్పుడు దేవుడమ్మ, మీకు పాండిచెర్రీ అంటే ఇష్టం కదా ఒకప్పుడు వెళ్లారు మళ్ళీ అక్కడికి వెళ్ళండి. ఆదిత్యా  వచ్చిన తర్వాత నేను చెప్తాను అని అంటుంది దేవుడమ్మ.

36

ఆ తర్వాత సీన్ లో జానకమ్మ కుర్చీలో కూర్చుని బాధపడుతూ ఉండగా. దేవి,చిన్మయి లు అక్కడికి వచ్చి డాన్స్ చేస్తూ, కరాటే చేస్తూ జానకమ్మని టైం పాస్ చేపిస్తూ ఉంటారు. ఇంతలో ఆదిత్య, రుక్మిణి అక్కడికి వస్తారు.రాధ ఆదిత్య దగ్గరికి వెళ్లిందా అని మాధవ్ అనుకుంటాడు. ఇంతలో ఆదిత్య, డాక్టర్ గారికి యాక్సిడెంట్ అయింది తను వైద్యం చేయడం కుదరదు అని అనగా అందరూ బాధపడి, ఇంకేమి దారి లేదా!వైద్యం చేస్తే త్వరగా నయమవుతుంది అనుకున్నాం కదా అని అనగా ఆదిత్య, నాకు తెలిసిన ఒక ప్రకృతి వైద్యశాల ఉంది. అక్కడికి తీసుకువెళ్తే కచ్చితంగా నయమవుతుంది అని అంటాడు.
 

46

దానికి రామ్మూర్తి, సరే బాబు నాకన్నా మీకు ఎక్కువ తెలుసు కదా.మీరు ఎక్కడికి అంటే అక్కడికి తీసుకెళ్తాము,జానకి కి నాయమవ్వడం ముఖ్యం అని అంటాడు.అప్పుడు మాధవ్ కావాలని,అయితే మీరు కూడా రండి అని ఆదిత్య తో అంటాడు. అప్పుడు దేవి, రండి ఆఫీసర్ సార్ మాకు ధైర్యం గా ఉంటాది అని అనగా,ఆదిత్య సరే అంటాడు. తర్వాత సీన్లో సత్య పాండిచ్చేరికి టికెట్లు బుక్ చేసి అంతా సర్దుకుని,కాలేజ్ డేస్ లో మనం ఎంత బాగా గడిపే వాళ్ళమో! మళ్లీ అంతే మధుర క్షణాలు ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి.
 

56

ఆదిత్య తో బాగా సమయం గడపాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో మాధవ్ గిటార్ వాయిస్తూ,రాధ జోలికి వస్తేనే ఊరుకోలేదు ఇప్పుడు మా అమ్మ వరకు వచ్చావు ఎలా ఊరుకుంటాను. అయినా అక్కడికి వస్తావు కదా నిన్ను రమ్మన్నాను అంటే నా దగ్గర ఏదో ఒక ఆలోచన ఉండే ఉంటుంది.అక్కడ  నీ పని చెప్తాను. ఓటమిని ఒప్పుకుంటే వాడు మాధవ్ ఎందుకు అవుతాడు అని నవ్వుకుంటూ ఉంటాడు మాధవ్. ఆ తర్వాత సీన్లో సత్య బట్టలు సద్దడం చూసిన ఆదిత్య ఎక్కడికి అని అనగా, ఫ్లైట్ టైం అవుతుంది పదా ఆదిత్య అని సత్య అంటుంది.

66

ఎక్కడికి అని ఆదిత్య అడగగా,ఇంతలో దేవుడమ్మ అక్కడికి వచ్చి, సత్య  నీకోసం పాండిచ్చేరి వెళ్లడానికి ప్లాన్ వేసింది ఆదిత్య అని దేవుమ్మ అంటుంది. అప్పుడు ఆదిత్య, నేను ఆఫీసర్ అనుకుంటున్నారా లేదా ప్యూన్ అనుకుంటున్నారా! నాకు పనులు ఉంటాయి కదా అని అరుస్తాడు.ఇప్పుడు అంత పని ఏమీ ఉంది అని దేవుడమ్మ అడగగా,నాకు ఒక క్యాంప్ ఉంది,తప్పని సరిగా వెళ్ళాలి కనుక నేను ఎక్కడికీ రావడం కుదరదు అని ఆదిత్య అంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Recommended image2
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image3
Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved