- Home
- Entertainment
- Devatha: ఆదిత్య ముందే రాధ, మాధవ్ జంటని పొగుడుతున్న ఊరి ప్రజలు.. రుక్మిణి బతికే ఉందని తెలుసుకున్న దేవుడమ్మ!
Devatha: ఆదిత్య ముందే రాధ, మాధవ్ జంటని పొగుడుతున్న ఊరి ప్రజలు.. రుక్మిణి బతికే ఉందని తెలుసుకున్న దేవుడమ్మ!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 29వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. మాధవ్ పూజారితో మాట్లాడుతూ దేవికి ఏమైంది ఎందుకు కళ్ళు తెరవడం లేదు నా పాప బానే ఉన్నది కదా అని అడుగుతాడు. దానికి పూజారి, ఎండలో ఆకలి నిద్రాహారాలు లేకుండా తిరుగుతూ ఉండడం వల్ల పాపకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటారు. దానికి మాధవ్, ఒకవేళ మీ వల్ల అవ్వకపోతే నేను పట్నం తీసుకొని వెళ్తాను నాకు మా పాప ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు నా ప్రాణమిచ్చి అయిన దేవిని కాపాడండి అని అంటారు. దానికి పూజారి, ఇది ప్రాణం తీసే స్థలం కాదు బాబు ప్రాణమిచ్చే స్థలం నేను ఉన్నాను కదా పాపకి ఏమి అవ్వదు వైద్యం చేస్తాను అని పూజారి అంటారు.
అప్పుడు మాధవ్ మనసులో, ఈపాటికి ఆదిత్య గాడు రాధ రావాలి కదా ఇంకా రాలేదేంటి అని అనుకుంటాడు. అదే సమయంలో ఆదిత్య రుక్మిణి ఆ గూడెంలో ఉన్న వాళ్ళందరికీ దేవి ఫోటో చూపిస్తూ ఈ అమ్మాయిని చూశారా అని అడుగుతారు. అలాగా చాలామందిని అడిగిన తర్వాత ఒక వ్యక్తి ఈ అమ్మాయి గుడిలో పూజారి గారు దగ్గర ఉన్నది పాపం తను స్పృహ తప్పి ఉన్నది అని అనగా, ఏమైంది దేవి స్పృహ తప్పి ఉండడం ఏంటి? పూజారి గారి దగ్గర వైద్యం తీసుకోవడం ఏంటి ఏమైంది అని వాళ్ళు కంగారు పడతారు.అప్పుడు వాళ్ళు మీరేం భయపడొద్దు.
పూజారి గారి చేతిలో వైద్యం తీసుకుంటున్నదంటే ఆ పాప కచ్చితంగా కోరుకుంటుంది అని గుడి దగ్గరకు దారి చూపిస్తారు. మరోవైపు దేవుడమ్మ ఆదిత్య పుస్తకం లో రుక్మిణి ఫోటో చూసి, అలాగే ఊర్లో వాళ్ళందరూ రుక్మిణిని చూసాము అని చెప్పిన విషయం గుర్తుతెచ్చుకుంటూ ఆ పంతులు గారికి ఫోన్ చేసి పంతులుగారు నేను దేవుడమ్మని. నా కోడలు గురించి మీకు చెప్పాను కదా తను నిజంగానే బతికే ఉన్నదా అని అడగగా, తాను బతికే ఉన్నది మీ చుట్టూరా ఉన్నది కానీ రాలేకపోతుంది అని పూజారి అంటారు. నాకు కూడా ఇప్పుడు మీ మాటలు నమ్మాలి అనిపిస్తున్నది పరిస్థితులను చూస్తుంటే.
మరి తను ఇక్కడికి ఎందుకు రావడం లేదు అని దేవుడమ్మ అంటుంది. విధి అమ్మ పాండవులు అంతటి వాళ్లే అజ్ఞాతవానికి వెళ్లారు ఏం చేయలేము కానీ త్వరలోనే మీ దగ్గరికి వస్తుంది అని అంటారు. ఆ తర్వాత సీన్లో రుక్మిణి, ఆదిత్య గుడి దగ్గరకు వెళ్లేసరికి దేవిని చూసి రుక్మిణి ఏడుచుకుంటూ దేవికి ఏమైంది పంతులుగారు బానే ఉన్నదా అని అడుగుతుంది. దేవికి జరిగిన పరిస్థితి అంతా పంతులుగారు చెప్తారు. అప్పుడు పక్కనే ఉన్న ఊరి జనాలు మీ భర్త ఇందాకే వచ్చారమ్మా ఇప్పటివరకు దేవి గురించే పాపం ఎంతో బాధపడుతున్నారు అని అంటారు.
నా పెనిమిటి పక్కనే ఉన్నాడు కదా అనేలోగా ఒకలు మాధవ్ సార్ ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు అస్సలు దేవిని వదిలిపెట్టలేదు వీళ్ళ ప్రేమ గురించి తెలిసిందే కదా ఊర్లో అంతా మాధవ్ సార్, రాధమ్మని ఎంత బాగా చూసుకుంటారో అందరికీ తెలుసు అని అంటారు. అదే సమయంలో మాధవ్ అక్కడికి వస్తాడు. రాధ వచ్చావా మన బిడ్డ చూడు ఎలా ఉన్నాదో నేను నీకు ఫోన్ చేశాను కానీ నీకు ఫోన్ కలవలేదు. చూడు రాధ మన బిడ్డని అని అనగా ఆదిత్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రుక్మిణికి కూడా మాట కదలదు. అప్పుడు పక్కనున్న వాళ్ళు, ఈ ఊరిలో అన్యోన్యమైన జంట ఎవరైనా ఉన్నారంటే వాళ్లు రాధమ్మ మాధవ్ సర్లే.
రాబోయే తరాలకు ఆదర్శంగా ఉంటారు మాధవ సార్ లాంటి మంచి వ్యక్తి ఎవరు ఉండరు. భార్యని, కూతుర్ని బాగా చూసుకుంటారు అని అనగా, తెలుస్తుంది బిడ్డ కోసం బాగా తపన పడుతున్నారు అని పూజారి అంటారు. దేవుడా నా కూతురు అని కూడా నేను చెప్పలేని స్థితికి నన్ను తీసుకువచ్చేసావా అని ఆదిత్య మనసులో బాధపడతాడు. అప్పుడు మాధవ్, పూజారి గారు ఇంక మేము మా దేవిని తీసుకువెళ్లొచ్చా అని అనగా, ఒక అరగంట ఇక్కడ ఉంచండి నాయనా కొంచెంసేపు తను కోలుకున్న తర్వాత తీసుకువెళ్లండి అని అంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!