Devata: దేవి చేతుల మీదగా పూజ జరిపించిన దేవుడమ్మ.. రుక్మిణి మీద సత్యకు అనుమానం!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 9వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. చిన్మయి దేవి మద్య అన్యోన్యత చూసి దేవుడమ్మ కుటుంబం అంతా మురిసిపోతారు. అప్పుడు దేవి చిన్నయి తో బట్టలు బాగున్నాయా దేవుడమ్మ అవ్వ నా కోసం కుట్టింది. అలాగే రేపు పూజను కూడా నన్నే స్వయంగా నా చేతుల మీద చేయమన్నది అని అంటుంది. దానికి చిన్మయి ఎంత మురిసిపోతుంది.ఆ తర్వాత సీన్లో రుక్మిణి పూజ చేసిన తర్వాత అందరికీ హారతి ఇస్తుంది. అలాగే మాధవ్ కి కూడా హారతి ఇస్తున్నప్పుడు, మాధవ్ రుక్మిణి వంక చాలా కోపంగా చూస్తాడు.
అదే సమయంలో జానకమ్మకి వాళ్ల భర్త,చేతిలో నవధాన్యాలు మూట పెడతాడు. అప్పుడు భాగ్యమ్మ ఆ ధాన్యాలు ఏంటయ్యా అని అడుగుతుంది.ప్రతి వినాయక చవితి రోజు ఈ ధాన్యాలను మన పొలంలో మీ అమ్మ గారి చేత జల్లిస్తాను అని అంటాడు. ఆ తర్వాత సీన్లో దేవి చిన్నయి అందరూ వినాయక చవితి పూజని చేస్తూ ఉంటారు అప్పుడు పంతులుగారు వినాయకుడు కథ అంతా చెప్తారు. అప్పుడు దేవి, కమల పెద్దమ్మ మీ చెల్లి నీ పక్కనున్నది కదా.
అలాగే నా చెల్లి కూడా నా పక్కనే ఉండాలి అని రుక్మిణి నీ తన ఒడిలో కూర్చోబెట్టుకుని కథ అంతా వింటుంది. నేను మా చెల్లిని ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని దేవి అంటుంది. అప్పుడు దేవుడమ్మ నువ్వే మాతో పాటు ఇక్కడ ఉండిపో అని అంటుంది. అప్పుడు చిన్నయి కొన్ని రోజులు మేము మీ ఇంటికి వస్తాము, కొన్ని రోజులు రుక్మిణి నీ మా ఇంటికి పంపండి అని అంటుంది.అప్పుడు దేవుడమ్మ చిన్మయితో,నువ్వు కూడా మా ఇంటికి వచ్చి చేయొచ్చు కదా ముగ్గురు ఇక్కడే ఉంటారు అని అంటుంది.
అలా కాదు అందరూ మా ఇంటికి వచ్చేయండి నాలుగు రోజులు ఉండాలండి అని చిన్మయి అంటుంది.అప్పుడు ఆదిత్య మీరెవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు దేవియే కొన్ని రోజుల్లో మన ఇంటికి శాశ్వతంగా వచ్చేస్తుంది అని మనసులో అనుకుంటాడు.ఆ తర్వాత సీన్లో జానకమ్మ కుటుంబం పొలాలకు వెళ్లి దాన్యాలు వేస్తూ ఉండగా అక్కడ ఉన్న పాలేరులో రుక్మిణి పొగుడుతూ ఉంటారు.ఇలాంటి కోడలు దొరకడం మీ అదృష్టం, చాలా పద్ధతిగా ఉంటారు,అసలు బయటకు కూడా రారు.
ఇంత సంస్కారమైన కోడలు దొరకడం మీ అదృష్టం, భార్యగా దొరకడం మాధవ సార్ అదృష్టం అని అంటారు.అప్పుడు మాధవ్,ఇంటికి పద అని రుక్మిణి తో అంటాడు. అందరి మధ్య ఉన్నది కనుక రుక్మిణి కుదరదు అని చెప్పలేదు. అప్పుడు భాగ్యమ్మ, నేను వస్తాను అని అనగా మాధవ్ కోపంగా చూస్తూ మేమిద్దరం వెళ్తాము అని రాధ నీ తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత సీన్లో దేవి ఇంట్లో వాళ్ళందరికీ ప్రసాదం పంచుతూ అందర్నీ వరుసలు పెట్టి పిలుస్తుంది. అప్పుడు వాళ్ళందరికీ రుక్మినీ గుర్తొస్తుంది.
అప్పుడు సత్య అందరిని వరుసలు పెట్టి పిలవడం అక్క అలవాటు దేవి కూడా వచ్చిందా.లేకపోతే అక్కే దేవి కి నేర్పించిందా. అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటుంది.ఆ తర్వాత సీన్లో రాదా ఒక్కతే ఇంట్లో కూరగాయలు కోస్తున్నప్పుడు మాధవ్ రాధ దగ్గరికి వెళ్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!