- Home
- Entertainment
- Guppedantha Manasu: జగతి, మహీంద్రలను మళ్లీ ఇరికించిన దేవయాని.. బాధతో కుమిలిపోతున్న రిషి!
Guppedantha Manasu: జగతి, మహీంద్రలను మళ్లీ ఇరికించిన దేవయాని.. బాధతో కుమిలిపోతున్న రిషి!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 20వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..రిషి, దేవయాని లు కార్ మీద వస్తూ ఉండగా దేవయాని రిషితో, చూసావా రిషి నేను నా పెద్దరికం పక్కనపెట్టి వసుదారని వెళ్లి బతిమిలాడను కానీ వసుధార నా మాట కూడా వినడం లేదు అని అనగా, మీరేమీ బాధపడొద్దు పెద్దమ్మ వసుధార ఎప్పటికైనా నా మాట వింటుంది. తనకి జగతి మేడం మీద ఉన్న అభిమానం కన్నా నా మీద ఉన్న ప్రేమ ఎక్కువ ఆ విషయం తప్ప మా మధ్య ఇంక ఏ గొడవలు లేవు అని అనగా, నా భయం అంతా మీ మీదే రిషి. జగతి, మహీంద్రలు నిన్ను ఎలాగా పట్టించుకోరు నేనే పట్టించుకోవాలి కదా.నీ జీవితం అన్యాయం అవ్వకూడదనే ఇలా చేస్తున్నాను అని అనగా, మీరు దీని గురించి ఆలోచించొద్దు పెద్దమ్మ నేను చూసుకుంటాను ఇంక వదిలేయండి అని రిషి దేవయానితో చెప్పి మనసులో, నేను ఇంత ధీమాగా ఆలోచిస్తున్నాను వసుదార కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుందా అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో జగతి, మహేంద్రలు కాలేజ్ దగ్గరికి వస్తారు. అప్పుడు గౌతమ్ తో, రిషి ఎక్కడున్నాడో తెలుసా అని అడగగా, నిన్నంతా ఇక్కడే ఉన్నారు అంకుల్. వసుధార ఫోన్ చేసిన వెంటనే పరిగెట్టుకొని వెళ్ళిపోయాడు అని అనగా అదే సమయంలో వసు అక్కడికి వస్తుంది.
రిషి ఎక్కడున్నాడు వసు అని జగతి అనగా, మా ఇంటికి వచ్చారు సర్ కానీ దేవయాని మేడం తో పాటు వెళ్లిపోయారు అని అంటుంది. దానికి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయి అక్క ఎందుకు అక్కడికి వచ్చింది అని వసుని అడుగుతుంది జగతి.అప్పుడు మహీంద్ర, ఏవైనా గొడవ పెట్టిందా అని అడగగా, ఏమీ లేదు మేడం ఏమీ లేదు సార్ బానే మాట్లాడారు నన్ను గురుదక్షిణ ఒప్పందం మానుకోమని ఇంటికి తీసుకెళ్ళిపోతానని చెప్పారు అని అంటుంది. దానికి మహేంద్ర, దేవయాని వదిన గురించి మీకు తెలీదు వసుధార మేమిద్దరం తనని 20 ఏళ్లుగా చూస్తున్నాము.మేము ఏమి ఆలోచింనా దానికన్నా ఒక మెట్టు పైనే ఉంటారు ఎప్పుడు తక్కువంచినా వేయలేము జాగ్రత్తగా ఉండాలి ఏ కొత్త ప్లాన్ తో వచ్చారో అని అంటాడు మహీంద్ర. దానికి జగతి, ఆఖరికి దేవయానికి అక్కయ్య దగ్గర కూడా నువ్వు గురుదక్షిణ గురించి చెప్పించుకుంటున్నావా ఇంకా నువ్వు తగ్గవా వసుధార అని అనగా, నేను తగ్గను మేడం రిషి సార్ ఎప్పటికైనా మారతారు అని నమ్మకం నాకున్నది అని అనగా, రిషి గురించి నీకు పూర్తిగా తెలీదు వసు నువ్వు ఈ మధ్యే రిషి ని చూస్తున్నావు నాకు రిషి గురించి తెలుసు మొండివాడు అని అంటుంది జగతి.
దానికి వసుధార, నేను నా మాట మీద నిలబడతాను అని అనగా ఇంక జగతికి కోపం వచ్చి అక్కడ నుంచి చిరాకుగా వెళ్ళిపోతుంది. అప్పుడు వసుధార, ఈ విషయం జరగాలంటే నాకు మీ సహకారం కావాలి అని అనగా గౌతమ్, నిజంగానే వసుధార. రిషి చిన్నప్పటినుంచి చాలా మొండివాడు నువ్వు వచ్చిన తర్వాత కొంచెం మారాడు గాని ఆ మొండితనం ఇంకా పోలేదు అని అనగా నేను మార్చుతాను సార్ నాకు సహాయం చేయండి అని అడుగుతుంది వసు. నేను ఈ విషయంలో ఎందుకు సహాయం చేయను అనుకుంటున్నావు అని గౌతమ్ అంటాడు. గౌతమ్ వెళ్లిపోయిన తర్వాత మహీంద్ర వసుతో, నా వల్లే కదా ఇదంతా వచ్చింది అనవసరంగా గురుదక్షిణ అడిగాను. అడగకుండా ఉండాల్సింది అని అనగా మీరు ఎందుకు సార్ అలా అనుకుంటున్నారు మీరు కూడా జగతి మేడం మంచి గురించే కదా ఆలోచిస్తున్నారు అని అంటుంది వసుధార. ఆ తర్వాత సీన్లో రిషి,దేవయాని లు ఒక గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దేవయానిరిషి తో, నువ్వు బాధపడొద్దు రిషి వసుధార నీ దగ్గరికి వస్తుందో రాదో నాకు ఇంకా భయంగానే ఉన్నది నీ గురించి నేనే ఆలోచించాలి. ఆ జగతి, మహీంద్రలు ఎలాగో ఆలోచించరు.
ఇప్పటికి వచ్చి ఇంటికి రాలేదు నీ భవిష్యత్తు మీద కూడా వాళ్ళకి ఎటువంటి శ్రద్ధ లేదు అని అనగా, శ్రద్ధ చూపించడానికి మీరు ఉన్నారు కదా పెద్దమ్మ. ఇంకొకల గురించి నాకెందుకు, నేను బాధపడను కూడా అని రిషి అంటాడు. మరోవైపు జగతి, మహీంద్ర లు కారులో వస్తూ, దేవయాని అక్కయ్య ఏం ప్లాన్ చేసి ఉంటారో జాగ్రత్తగా ఉండాలి అని అనగా మహేంద్ర, అసలుకే ఇంకా క్రూరంగా తయారవుతున్నారు దీన్ని ఆపడానికి ఇంకేమీ దారి లేదా జగతి. జరిగిన విషయం అంతా మనమే రీషికి వెళ్లి చెప్పేస్తే సరిపోతుంది కదా అని అనగా, అలా చెప్తే చాడీలా అవుతుంది మహేంద్ర. దేవయాని అక్కయ్య తనంతట తానే నిజం ఒప్పుకోవాలి అప్పుడే రిషి నమ్ముతాడు అప్పుడు రిషికి మన మీద పూర్తి నమ్మకం వస్తుంది అని అనుకుంటారు. ఆ తర్వాత సీన్లో రిషి ఒంటరిగా ఆలోచిస్తూ, వసుకి ఫోన్ చేద్దామా అసలు ఏంటో ఈమధ్య సంతోషం వచ్చినా బాధ వచ్చినా వసుధారే గుర్తొస్తుంది. అయినా వసుధార ఈ మధ్య చాలా మొండిగా తయారైపోతుంది ఆ చీర విషయంలో కూడా అలాగే జరిగింది అని అనుకుంటాడు. అదే సమయంలో వసు, ఏం చేస్తున్నారు సార్ అని మెసేజ్ పెడుతుంది. అప్పుడు రిషి వసుధార మెసేజ్ పెట్టింది.
నీ గురించి ఆలోచిస్తున్నాను అని చెబుదామా అని అనుకొని కలుద్దాము అని మెసేజ్ పెడతాడు. అప్పుడు వసుధార సరే అని అంటుంది. అప్పుడు రిషి వస్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత సీన్లో జగతి, మహీంద్రలు కారులో ఇంటికి వచ్చి రిషి గది దగ్గరికి వెళ్దాం అనుకుంటే దేవయాని ఆపి, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అని అనగా రిషి దగ్గరికి వెళ్తున్నాము అని మహీంద్ర అంటాడు. ఏంటి రిషి గురించి మీరు కూడా ఆలోచిస్తున్నారా అసలు మీకు బాధ్యత ఉన్నదా బయట అంతా తిరిగి వస్తున్నారు. రిషి గురించి మీకేం ఆలోచన లేదు అని తిడుతుంది. దానికి మహేంద్ర, రిషి మా కొడుకు వదిన గారు. నా కొడుకు గదిలోకి వెళ్ళడానికి మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అని అంటాడు మహేంద్ర. అదే సమయంలో రిషి తన గది తలుపులు తీస్తాడు. రిషి ని గమనించిన దేవయాని ఏడుపును నటిస్తూ, అంతేలే మహేంద్ర నీ కొడుకు అంటే నా కొడుకు కాదనే కదా ఈరోజు నుంచి రిషికి నాకు ఏ సంబంధం లేదనే కదా అంటున్నారు. నన్ను, రిషి ని వేరు చేద్దామనుకుంటున్నారు ఈరోజు నేను నా భర్తతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నాకేం అవసరం ఇంక రిషి నాతో మాట్లాడడు మీరే రిషితో సంతోషంగా ఉండండి అయినా చిన్నప్పుడే వదిలేసిన నువ్వు కూడా ఇలాగే అంటున్నావు జగతి.
నీకు ఏ బాధ్యత లేదు నేనే రిషి ని నాకు ప్రాణానికి ప్రాణంగా పెంచాను అని దేవయాని నటిస్తుంది. అప్పుడు రిషి దేవయానితో పెద్దమ్మ ప్లీజ్ ఏడకంది అని జగతి, మహేంద్రల వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్తున్నప్పుడు ఆగి,డాడ్ ఇలాంటి రోజు వస్తుందని నేను అసలు ఊహించలేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. రిషి వెళ్ళిపోయిన తర్వాత దేవయాని ని తిడదాం అనుకున్న మహేంద్ర తో జగతి, ఇప్పుడేం మాట్లాడొద్దు మహేంద్ర గొడవ ఇంకా పెద్దది అవుతుంది అని అనగా దేవయాని, ఇప్పుడు కూడా మీకు గొడవలాగే అనిపిస్తుంది చూశారా నేనే గొడవ చేశాను అంటున్నారు కానీ మీరే కదా రిషి జీవితాన్ని నాశనం చేశారు. రిషి మీ కొడుకే కదా తన్ని అంత అపురూపంగా చూసుకోవాలి రిషి అంత బాధ పడుతున్నాడు అని తెలిసి కూడా ఎప్పుడైనా తన గురించి శ్రద్ధగా చూసుకున్నావా మహేంద్ర. ఇంక జగతి నీ విషయానికి వస్తే అసలు నీ కొడుకు ఎక్కడున్నా నీకు అనవసరం తన బాల్యమంతా చెడిపోయింది నీ వల్లే.
అసలు రిషి సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా రిషికి ఏం కావాలో మీకు తెలీదు, రిషికి ఏంది ఇష్టమో మీకు తెలీదు. అసలు మీకు ఏం తెలుసని అయిన ఇదంతా మీ వల్లే వచ్చింది గురుదక్షిణ అని చెప్పి వసుధార ను రిషి దగ్గర నుంచి దూరం చేశారు. ఇప్పుడు వారిద్దరి మధ్య గొడవలు వస్తున్నాయంటే దానికి కారణం మీరే. రిషి ఒకప్పుడు ఎంత ఆనందంగా ఉండేవాడో తన బాల్యం పోగొట్టుకున్నా సరే ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండేది ఎప్పుడైతే ఈ మహాతల్లి కాలు ఇంట్లో పడిందో అప్పుడు నుంచి అదంతా నాశనం అయిపోతుంది. రిషి ప్రేమకి, రిషి జీవితానికి మీరే అడ్డంకి అని దేవయాని కోపంగా అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!