MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: భర్త ప్రవర్తనను తట్టుకోలేకపోతున్న ధరణి.. జగతికి వార్నింగ్ ఇచ్చిన దేవయాని!

Guppedantha Manasu: భర్త ప్రవర్తనను తట్టుకోలేకపోతున్న ధరణి.. జగతికి వార్నింగ్ ఇచ్చిన దేవయాని!

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తను పెద్దరికం నిలబడటం కోసం కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెడుతున్న ఒక అత్తగారి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 28 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
| Updated : Apr 28 2023, 10:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఎపిసోడ్ ప్రారంభంలో శైలేంద్ర దగ్గరికి వచ్చి భోజనానికి రమ్మంటున్నారు అని చెప్తుంది ధరణి. నువ్వు వసుధారకి బాగా క్లోజ్ అయినట్లుగా ఉన్నావు నిన్ను గిఫ్ట్లు అడగమంటుంది.అయినా నీకోసం ఏం గిఫ్ట్లు తీసుకు వస్తాను ఏం తీసుకువచ్చినా నీకు వాడటం చేతకాదు, నువ్వు ఒక అప్పలమ్మవి అంటూ ధరణి బాధపడేలాగా మాట్లాడుతాడు. సరే భోజనానికి రండి అంటూ ధరణి వెళ్ళిపోతుంది. అందరూ భోజనాల దగ్గర కూర్చుంటే ధరణి వడ్డిస్తుంది. మీరూ కూర్చోండి మేడం అంటుంది వసు. తన భర్తకి తను వడ్డించుకుంటుంటే మధ్యలో నీకేంటి ప్రాబ్లం, అయినా అందరూ తినేసాక తను తినడం అలవాటు అంటుంది దేవయాని. అలా కాదు వదిన వాళ్లాయన కోసం స్పెషల్స్ వండింది అంటాడు రిషి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మీ ఆయనకేనా మాకు ఏమీ లేవా అంటూ ఆటపట్టిస్తాడు మహేంద్ర. ధరణి బెండకాయ కూర వడ్డిస్తుంటే నాకు ఆ కూర నచ్చదు అంటూ చిరాగ్గా చెప్పాడు శైలేంద్ర. వదిన నీకోసం ప్రత్యేకంగా చేసింది అన్నయ్య అలా అంటావేంటి అంటాడు రిషి. నాకు ఆ కూర అసలు ఇష్టం లేదు అంటాడు శైలేంద్ర. నువ్వు తినకపోతే తను చాలా బాధపడుతుంది కొంచెం వడ్డించుకో అని మహేంద్ర చెప్తాడు. సరే అంటూ కూర వడ్డించుకుంటాడు కానీ తినకుండా పక్కన వదిలేస్తాడు. మరోవైపు గిన్నెలు సర్దుతూ మీకు సార్ ఏం గిఫ్ట్ ఇచ్చారు అని ధరణిని అడుగుతుంది వసు.
 

38

ఎవరికీ చెప్పుకోలేనిది, ఎవరికీ చూపించుకోలేనిది అంటూ బాధగా చెప్తుంది ధరణి. ఈ లోపు శైలేంద్ర రావడం గమనించి నాప్కిన్ పట్టుకొని వెళ్తుంది ధరణి. చేయి కడుక్కుంటూ నువ్వు ఏది వండితే అది తినాలా, నాక్కూడా ఇష్టాలు ఉంటాయి నీ ఇష్టాలు నా మీద రుద్దకు అంటూ ఆ నాప్కిన్ ధరణి మొహానికి కొడతాడు శైలేంద్ర. అప్పుడే చేయి కడుక్కోడానికి వచ్చిన ధరణి ఏమంటున్నాడు శైలేంద్ర, నీ వంటని మెచ్చుకుంటున్నాడా అంటుంది. మాట దాటవేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ధరణి. ఏంటో నా ఇష్టం అంటూ మేడం తో చాలా సీరియస్ గా మాట్లాడుతున్నారు అని జగతికి చెప్తుంది వసు. ఆ మాటలు విన్న దేవయాని  లాక్కొని వెళ్లి నా కొడుకు మీదే చాడీలు చెప్తున్నావా, అనవసరంగా నా కొడుకు కోడలు మధ్య జోక్యం చేసుకోకు. 

48

మూసుకొని నీ పని నువ్వు చూసుకో, అయినా రోడ్డుమీద నా కొడుకుని అన్ని మాటలు అంటావా నీకు ఎంత ధైర్యం అంటూ నిలదీస్తుంది. మీ కొడుకు తప్పు చేశాడు అందుకే నిలదీశాను దీనికి ధైర్యం అక్కర్లేదు అయినా మీ కొడుకు కదా అని మీ బుద్ధులే వచ్చాయి అంటుంది వసు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు అంటూ గట్టిగా మాట్లాడుకుంది దేవయాని. మీ గురించి మాకు బాగా తెలుసు తెలుసుకోవలసిన వాళ్లే మీ గురించి తెలుసుకోవడం లేదు తెలుసుకున్న రోజున మీ ఆటలు సాగవు అంటూ రిషి పిలవడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసు.

58

వసు కోసం వెయిట్ చేస్తున్న రిషి దగ్గరికి వచ్చి పదా కబుర్లు చెప్పుకుందాం అంటూ తీసుకెళ్తాడు శైలేంద్ర. మీ ప్రేమ గురించి అమ్మ చెప్పింది మీది నిజంగా అడ్వెంచరస్ లవ్ అంటాడు శైలేంద్ర. ప్రేమే ఒక అడ్వెంచర్ అంటాడు రిషి. నువ్వు బాగా మారిపోయావు, ప్రేమ నిన్ను మార్చేసింది అంటూ త్వరలోనే ఒక ఇంటి వాడివి కాబోతున్నావన్నమాట అంటాడు శైలేంద్ర. మన ఇంటి వాడనే కాబోతున్నాను అంటూ నవ్వుతాడు రిషి.
 

68

మరోవైపు తన దగ్గరికి వచ్చిన రిషి తో శైలేంద్ర గురించి ఏదో చెప్పాలనుకుంటుంది వసు. కానీ రిషి మా అన్నయ్య చాలా మంచివాడు, చిన్నప్పుడు ఇద్దరం కలిసే పెరిగాము అన్నిట్లోనూ నాకే ప్రయారిటీ ఇచ్చేవాడు. ఇన్నాళ్లు తను దగ్గర లేడు అని బాధపడేవాడిని ఇప్పుడు ఆ లోటు కూడా లేదు. నేను చాలా లక్కీ నా అనుకునే వాళ్ళందరూ నా చుట్టూనే ఉన్నారు అంటూ ఆనందపడతాడు. దాంతో ఇంకేమి మాట్లాడలేక పోతుంది వసు.
 

78

మరోవైపు వంటగదిలో ఉన్న ధరణి దగ్గరికి వచ్చి నీకు ఎప్పుడూ ఇదే పనా, భర్త గురించి ఆలోచించవా, అయినా నాదే తప్పు నా కొడుక్కి తగిన పిల్లని తేలేకపోయాను అంటూ పుల్లవిరుపుగా మాట్లాడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జగతి తనలో తప్పు ఉంటే నేర్పించండి అంతేగాని తను బాధపడేలాగా మాట్లాడడం తప్పు అంటుంది. అన్నిటిలోని దూరిపోయి సలహాలు ఇవ్వకు.

88

నీ హద్దుల్లో నువ్వు ఉండు అని జగతికి చెప్పి ధరణిని టీ పెట్టమంటుంది దేవయాని. ఇప్పుడు టీ ఎందుకు అంటుంది జగతి. ఇప్పుడు తాగడమే నా కొడుక్కి అలవాటు అని ధరణి టీ పెడితే తనే ఆ టీ పట్టుకొని వెళ్తుంది దేవయాని. ఆ టీ ఏదో నీ చేతే పంపించవచ్చు కదా ఏంటో ఆవిడ ప్రవర్తన అంటూ విసుక్కుంటుంది  జగతి. బాధతో జగతిని పట్టుకొని ఏడుస్తుంది ధరణి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Agnipariksha: సంచాలక్ గా అపూర్వ పరువు పాయే, ఫిట్టింగ్ పెట్టిన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల
Recommended image2
Top 10 Heroines: రష్మికకి నయనతార బిగ్‌ షాక్‌, శ్రీలీల ఔట్‌.. సమంత, కాజల్‌, సాయిపల్లవి స్థానాలివే.. టాప్ ఎవరంటే?
Recommended image3
Irumudi Day 1 Collections: ఇరుముడి బాక్సాఫీసు వద్ద ఊచకోత, రవితేజ కెరీర్‌లోనే హైయ్యెస్ట్.. చిరంజీవి రికార్డు బ్రేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved