Guppedantha manasu: దేవయాని ప్లాన్.. జగతి వ్యక్తిత్వాన్ని అవమానించేలా ప్రశ్నలు?
Guppedantha manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు(Guppedantha manasu) ఇక ఈ సీరియల్ లో ఈరోజు మార్చ్ 1వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం..

సీరియల్ ప్రారంభంలోని సూ..చ..న.. కాన్సెప్ట్ గురించి షార్ట్ ఫిలింలో వసుధార చెబుతూ ఉంటుంది. చదువు నేర్చుకోవడం వల్ల కలిగే లాభం, చదువు ప్రాముఖ్యత గురించి చెబుతుంది. అలాగే భూమి మీద అన్నిటికన్నా గొప్పది చదువు అని చెబుతుంది. దీంతో అందరూ చప్పట్లు కొడతారు. గౌతమ్ మాత్రం మనసులో రిషిని తిట్టుకుంటూ ఉంటాడు.
షార్ట్ ఫిలిం ని చూసిన మినిస్టర్ మెచ్చుకుంటూ ఈ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ ఎవరిది అని అడగగా జగతి అని చెప్తారు దాంతో మినిస్టర్ జగతిని మెచ్చుకుంటాడు. మహేంద్ర కూడా అభినందనలు తెలుపుతాడు. రిషి కూడా జగతికి షేకండ్ ఇచ్చి అభినందనలు తెలపడంతో జగతి సంతోషంతో ఉంటుంది. దేవయాని షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది.
రిషి గౌతమ్ దగ్గరికి వెళ్లి సారీ(sorry) చెప్తాడు. దాంతో గౌతమ్, రిషిని హగ్ చేసుకుని నా కన్నా నువ్వే బాగా చేశావని చెప్తాడు. ఇక అందరూ ప్రెస్ మీట్ కోసం కూర్చుంటారు మినిస్టర్ మాట్లాడుతూ డి బి ఎస్ టి కాలేజ్ కు అభినందనలు అని చెప్తాడు దేవయాని మాత్రం జగతిని అవమానించేలా ప్లాన్ చేస్తూ ఉంటుంది.
ఇక వసుధారా గౌతమ్ ను షార్ట్ ఫిలింలో మీరు కనిపించనందుకు బాధపడుతున్నారా సార్ అని అడిగితే లేదు నాకన్నా వాడే బాగా నటించాడు. అయినా ఏదో ఒక రోజు ఇంత కింత పగ తీర్చుకుంటానులే అని సరదాగా చెబుతుంటాడు. ఈ లోపు దేవయాని సెట్ చేసిన ఒక జర్నలిస్ట్ షార్ట్ ఫిలిం గురించి మేము ప్రశ్నలు అడగవచ్చు అని అడుగుతాడు.
మినిస్టర్ ఈ షార్ట్ ఫిలిం గురించి అందరికీ తెలియాలి మీరు ఎలాంటి ప్రశ్నలు అయినా ఈ షార్ట్ ఫిలిం గురించి అడగవచ్చు అంటాడు. ఇక జర్నలిస్ట్ అడుగుతున్న ప్రశ్నలకి మహేంద్ర, రిషి, ఫణీంద్ర భూషణ్, సమాధానాలు చెబుతారు. ఇక ఫణీంద్ర జగతినే షార్ట్ ఫిలిం రూపకర్త అని చెప్తాడు. అందరూ చప్పట్లతో అభినందనలు తెలుపుతారు జగతికి.
ఇక దేవయాని ఏర్పాటుచేసిన జర్నలిస్ట్ మీరు రావడం తోనే కాలేజ్ ప్రతిష్ట పెరిగింది కదా అని అడుగుతాడు దానికి జగతి అలాంటిది ఏమీ లేదు ఈ కాలేజ్ గొప్ప విద్యా సంస్థ ఇందులో చేరటం నా అదృష్టం అంటుంది. దేవయాని మా దురదృష్టం అని తిట్టుకుంటూ ఉంటుంది జగతిని. ఇక జర్నలిస్ట్ జగతి వ్యక్తిగత విషయాలను అడుగుతూ మీ విజయం వెనుక పురుషుడు లేడు అంట కదా, మీరు ఒంటరి కదా, మీ కుటుంబం వివరాలు ఎక్కడా చెప్పలేదు ఎందుకని అడుగుతాడు..
దాంతో జగతి మిషన్ ఎడ్యుకేషన్ గురించి అడగండి నా లైఫ్ గురించి కాదు అంటుంది. అయినా కూడా జర్నలిస్ట్ జగతిని అవమానించే కరంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు జగతిని మీరు మీ వారిని వదిలేశారా లేక మిమ్మల్ని మీ వారు వదిలేశారు అనడంతో మహేంద్ర చాలా కోపడతాడు రిషి మాత్రం మహేంద్ర ను ఆపుతాడు.
జర్నలిస్ట్ మళ్లీ ఎందుకు మీరు పెళ్లి చేసుకోలేదు, మీకు ఒక సంతానం కూడా ఉంది కదా అనడంతో మహేంద్ర ఎందుకు ఇలా అడుగుతున్నారు అని కోపడతాడు. దాంతో జర్నలిస్ట్ మీకు ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి సార్ ఇది మా డ్యూటీ అంటాడు. దేవయాని మాత్రం జగతిని అవమానిస్తున్నందుకు చాలా సంతోష పడిపోతూ ఉంటుంది.
జగతి ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్లిపోతుంది మహేంద్ర జగతి ని ఆపి వెనక్కి తీసుకు వచ్చి అందరి ముందు జగతి నా భార్య, మా ఇద్దరి కొడుకు రిషి అని చెప్తాడు. దీంతో దేవయాని షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. రిషి మాత్రం కోపంతో స్పీడ్ గా కార్ డ్రైవింగ్ చేస్తుంటాడు. అప్పుడే వసుధర రావడంతో రిషి ఆగిపోతాడు మరి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం.