Guppedantha Manasu: దేవయాని ప్లాన్ అట్టర్ ప్లాప్.. మరింత దగ్గరైన వసుధార, రిషి?
Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఏప్రిల్ 7వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి ధార ఇక దీన్ని పొడిగించడం కరెక్ట్ కాదు. నేను బాధపడుతూ వసుధారని బాధ పెట్టడం పద్దతి కాదు. మా మధ్య ఉన్న దూరానికి ముగింపు పలకాలి. ఎస్ నేను వసుధారని నా భార్యగా అంగీకరిస్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు వసుధార జయచంద్ర అన్న మాట తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ తాలిని నేను అనవసరంగా తొందరపాటు నిర్ణయంతో వేసుకున్నానా ఈ తాళిని తీసివేసి నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇది తీసేయాలి ఈ తాళి వల్ల రిషి సార్ ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటూ ఉంటుంది వసుధార.
మరోవైపు దేవయాని మీరు ఎన్నిసార్లు చెప్పినారు ఎన్ని చెప్పినా వసుధారది అసలు పెళ్లే కాదు అనడంతో అదేంటి అక్కయ్య తన భర్తగా ఊహించుకొని మెడలో తాళి వేసుకుంది కదా అని అంటుంది జగతి. ఎవరు పడితే వాళ్ళు ఎవర్ని పడితే వాళ్ళు ఊహించుకుని మెడలో తాళి వేసుకుంటే పెళ్లి అయిపోయినట్లేనా అని అరుస్తూ ఉంటుంది దేవయాని. అసలు నేను దీనికి అంగీకరించను అనడంతో అంగీకరించాల్సిన నువ్వు కాదు నేను అనగా ఓహో వ్యవహారం అంతవరకు వచ్చిందా అని అంటుంది దేవయాని. అయితే అదంతా కలకంటూ ఉంటుంది వసుధార. మరుసటి రోజు ఉదయం దేవయాని ఆలోచిస్తూ అందరూ ఏదోదో అంటున్నారు జయచంద్ర గారు ఎందుకు వచ్చారో కానీ నాకు ప్రశాంతత లేకుండా చేశారు అనుకుంటూ ఉంటుంది.
ఆ పెద్దమనిషి వీళ్ళ పెళ్లి గురించి ఎందుకు మాట్లాడాలి ఆయన ఏం మాట్లాడారో మీరు ఏం విన్నారో నాకేం అర్థం కావడం లేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పటికే వసుధార నా మీద పెత్తనం చలా ఇస్తోంది ఇక రిషి భార్యగా అంగీకరిస్తే ఇంకా ఏమైనా ఉందా నా మీద పెత్తనం చలా ఇస్తుంది అనుకుంటూ ఉంటుంది. ఎలా అయినా ఏం జరిగిందో తెలుసుకోవాలి వసుధార చర్చ కొడితే వసుధార నిజం చెబుతుంది అని అక్కడికి నుంచి బయలుదేరుతుంది. మరోవైపు రిషి, వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత దేవయాని వసుధర గదికి వెళ్ళగా అక్కడ వసుధార లేకపోవడంతో బాత్రూంలో ఉన్నట్టుంది వచ్చేవరకు వెయిట్ చేద్దాం అని అక్కడే నిల్చుని ఉంటుంది.
అప్పుడు వసుధార తాళి తెగిపోయి అక్కడ కనిపించడంతో అది చూసి షాక్ అవుతుంది. ఎలా అయినా ఈ తాళిని అడ్డుపెట్టుకుని వసుధార ఒక ఆట ఆడుకోవాలి అని ఆ తాళిబొట్టుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవయాని. మరోవైపు రిషి వసుధార ఈరోజుతో మన మధ్య ఉన్న దూరానికి ముగింపు పలకబోతున్నాను అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. నీతో చాలా చెప్పాలి నీతో చాలా మాట్లాడాలి. నీకు స్వారీ చెప్పాలి. నా దగ్గర ఎటువంటి ప్రశ్నలు లేవు. అన్నింటికి సమాధానాలు దొరికాయి అనుకుంటూ ఉంటాడు రిషి. నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అనడంతో ఇంతలో దేవయాని అక్కడికి రాగా వచ్చింది వసుధార అనుకుని రా వసుధార నీకోసమే ఎదురుచూస్తున్నాను అని అంటాడు రిషి.
అప్పుడు దేవయాని ఏం మాట్లాడకుండా తాళిని తీసి అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ వసుధార లేకపోవడంతో ఆ తాళిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు రిషి. మరోవైపు వసుధార ఫ్రెష్ అయ్యి వచ్చి మొబైల్ కోసం గది మొత్తం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు రిషి హాల్లో వసుధార అని గట్టిగా పిలవడంతో అందరూ అక్కడికి వస్తారు. ఏదో మంచి వార్త చెప్తారని అనుకున్నాను ఇదేంటి సార్ గట్టిగా అరుస్తున్నారు అనంత నువ్వు గట్టిగానే చెప్పావు కదా నేనుండడం అని అంటాడు రిషి. నీ నిర్ణయం కరెక్టే అని నేను అనుకున్నాను కానీ నువ్వు దాన్ని తుడిచేసావు అనడంతో అందరూ షాక్ అవుతారు. నా పంతం పక్కనపెట్టి నీ ప్రేమకు విలువ ఇవ్వడానికి సిద్ధపడ్డాను,కానీ నువ్వు నీ పొగరు చూపించావు అని అంటారు రిషి.
మన ప్రేమకి అడ్డుగా ఉన్న దూరాన్ని తగ్గించాలని అనుకున్నాను. కానీ నువ్వు ఆ దూరాన్ని మరింత పెంచావు అని అంటాడు రిషి. ఇప్పుడు నేనేం చేశాను సార్ అనడంతో రిషి తన చేతిలో ఉన్న తాళిబొట్టును చూపించడంతో అందరూ షాక్ అవుతారు. మరి ఇదేంటి నాకోసం వేసుకుని తాళినీ ఎందుకు తెంచావు అని అంటాడు రిషి. ఆడది మెడలో నుంచి తాళి తీసేసింది అంటే అర్థం ఏంటి నువ్వు నన్ను భర్తగా అంగీకరించినప్పుడు నేను బ్రతికుండగానే ఎందుకు తాళి తీసేసావు అని అంటాడు రిషి. చెప్పు వసుధార నామీద నమ్మకం పోయిందా లేకపోతే మన బంధానికి ముగింపు పలకాలనుకున్నావా అంటాడు రిషి. సర్ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏంటి సార్ ఇది అనగా మన మధ్య దాపరికాలు ఉండకూడదు అనుకున్నాము.
కానీ ఎన్నో విషయాలు దాచి పెట్టావు. నిన్ను రైట్ అనుకున్నాను ప్రేమ కోసం నా కోసం ఈ ఆడపిల్ల చేయని సాహసం చేసిందని గర్వంగా ఫీల్ అయ్యాను. కానీ నువ్వు ఇలా మారిపోతావ్ అని ఊహించలేదు అంటూ వసుధార మాట్లాడే అవకాశం లేకుండా రిషి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వసు అసలు విషయం చెప్పగా మరి తాళి తెగిపోతే నీ గదిలో ఉండాలి కదా మరి నా గదిలోకి ఎందుకు వచ్చింది అనగా నేను అసలు మీ గదికి రాలేదు సార్ అనగా వచ్చావు అని అంటాడు రిషి. అప్పుడు జగతి రాలేదంటుంది కదా రిషి అనడంతో లేదు మేడం ఇందాక తాను వచ్చింది నాకు అడుగులు శబ్దం కూడా వినిపించింది. అక్కడికి వచ్చి ఈ తాళిబొట్టుని అక్కడ పెట్టేసి వెళ్లిపోయింది అని అంటాడు రిషి. దేవయాని ఇందాక నువ్వు రిషి గదికి వెళ్లావు కదా అనగా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
నిజం చెప్పు దేవయాని నువ్వు రిషి గదికి వెళ్ళావా లేదా ఆ మంగళసూత్రం నువ్వు అక్కడ పెట్టావు కదా అని పనింద్ర గట్టిగా నిలదీయడంతో అవును నేనే ఆ పని చేశాను అనడంతో అందరూ షాక్ అవుతారు. ఎందుకు అలా చేశావు అనడంతో నేను వసుధార గదికి వెళ్లాను అక్కడ వసుధార తాళి పడిపోయి ఉండడంతో అది తీసుకొని వెళ్లి రిషికి ఇచ్చి ఆ తాళి వేస్తే మనస్పూర్తిగా ఉంటుందేమో అని అలా చేశాను అని కవరింగ్ ఇస్తూ ఉంటుంది దేవయాని. అప్పుడు దేవయాని మాటలకు అందరూ ఆశ్చర్యపోతారు. దేవయాని మాటలకు జగతి, మహేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటారు.
సార్ ఇంత చిన్న విషయంలో ఎంత అపార్థం చేసుకున్నారు అనడంతో వెంటనే రిషి,వసుధార చేతులు పట్టుకుంటాడు. ఇది అపార్థం కాదు వసుధార నా బాధ అని అంటాడు రిషి. నువ్వు ఎక్కడ దూరమవుతావేమో అన్న ఆవేదన. ఆ మాటలకు జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. సార్ మీకు వసు దూరమైన ఆ క్షణం అదే వసుధారకి ఆఖరి శ్వాస సార్ అని అంటుంది. ఇప్పటివరకు జరిగింది చాలు ఇప్పటినుంచి ఒకరు విభేదించుకోకండి అని అంటుంది జగతి. మీ భవిష్యత్తు ఏంటి అనేది మీరే నిర్ణయించుకోండి అనడంతో, మా భవిష్యత్తు ఏంటి అనేది రిషి సార్ నిర్ణయమే మేడం అని అంటుంది.