- Home
- Entertainment
- Guppedantha Manasu: పేపర్‌లో వచ్చిన వసు, రిషీ పూలదండ సీన్.. కోపంతో రగిలిపోతున్న సాక్షి!
Guppedantha Manasu: పేపర్‌లో వచ్చిన వసు, రిషీ పూలదండ సీన్.. కోపంతో రగిలిపోతున్న సాక్షి!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 4వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. దేవయాని ఇంట్లో కూర్చొని ఉండగా అప్పుడే మహేంద్ర, జగతి వాళ్ళు వస్తారు. అయిపోయిందా సన్మానాలు, సత్కారాలు అని అడిగితే మీరు అక్కడినుంచే వచ్చారు కదా మీకు ఆ మాత్రం తెలియదా అని దేవయానిపై మహేంద్ర సెటైర్ వేస్తాడు. దీంతో వెంటనే ఆ వసుధార ఏంటి రిషి మేడలో అలా పూలదండ వేసింది అని జగతిని అంటే.. మీకు ఏదైనా డౌట్ ఉంటే రిషిని, వసును వెళ్లి అడగండి అంటుంది..
ఆ మాటలకూ దేవయాని సీరీయస్ ఉన్నప్పుడే గౌతమ్ రాగ అతన్ని అలానే వసు, రిషీ గురించి ప్రశ్నిస్తుంది. వెంటనే రిషి రావడం చుసిన గౌతమ్ నీ గురించే మాట్లాడుతున్నారు అని చెప్తే.. దేవయాని రిషి దగ్గరకు వెళ్లి వెంటనే మాట మారుస్తుంది. చూడు నాన్న వీళ్ళు వసుధార నీకు దండ వేసిన దాని గురించి మాట్లాడుతున్నారు అంటూ మాట మార్చేస్తుంది. ఆ మాటలు విన్నీ రిషి నిజానిజాలు తెలుసుకోకుండా మహేంద్ర, జగతిపై అరిచి వెళ్తాడు.
ఇక ఆతర్వాత సీన్ లో మహేంద్ర రిషీ కారు దగ్గరకు వెళ్లి వసు వేసిన దండ గురించి చూస్తాడు.. ఆతర్వాత సీన్ లో వసుకు ఫోన్ చేసి గౌతమ్ ఓ రేంజ్ లో పొగుడుతుంటాడు. రిషి ఎవరు రా ఫోన్ లో అంతగా పొగుడుతున్నావ్ ఏంటి అని గౌతమ్ ని అడిగితే ఎవరో మాట్లాడు అని ఫోన్ చేతిలో పెడితే రిషి ఎవరు అని అడిగితే నేనే సర్ వసుని అనగానే ఫోన్ కట్ చేసి గౌతమ్ ను తిడుతాడు. ఏంటి రా ఎందుకు ఇలా చేశావ్ అని అడుగుతాడు.
ఇక అందుకు గౌతమ్ మాట్లాడుతూ.. నీ మేడలో దండ ఎందుకు వేసింది అనే విషయం గురించి అడుగుదాం అని కాల్ చేశా అని రిషికి గౌతమ్ చెప్తాడు. అవన్నీ నీకు ఎందుకు రా బాబు నోరుమూసుకుని వేళ్ళు అని తిడుతాడు. ఇక మరో సీన్ లో దండ ఎందుకు వేసాను.. తప్పు చేసిన అని తనని తాను ప్రశ్నించుకుంటుంది. నేనేం తప్పు చెయ్యలేదు నా మనసుకు అనిపించింది చేసేశాను అని అనుకుంటుంది.
ఇక మరో సీన్ లో డ్రైవర్ పులా దండ తీసుకోని వచ్చి ఇది సార్ కారులో ఉంది మేడమ్ అని చెప్తే దేవయాని తెగ సీరియస్ అవుతూ చెత్తను ఇంట్లోకి తీసుకొచ్చావ్ ఏంటి పోయి డేస్ బిన్ లో వెయ్యు అని చెప్తుంది. జగతి వచ్చి డ్రైవర్ అపి పులా దండను తీసుకుంటే దేవయాని సీరియస్ అవుతుంది. అప్పుడు జగతి మాట్లాడుతూ ఈ పులా దండ విలువ మీకు తెలియదు అని అంటుంది. చెప్తే తెలియనిది ఏం ఉంటుందని దేవయాని ప్రశ్నిస్తుంది.
ఇక దేవయానిని పట్టించుకోకుండా వెళ్తున్నప్పుడు సీన్ లోకి రిషీ ఎంట్రీ ఇస్తాడు. మేడమ్ ఎక్కడకు తీసుకెళ్తున్నారు అని రిషి అడగ్గా దేవయానిని చూస్తూ చెత్త కుప్పలోకి అని చెప్తుంటే రిషి సీరియస్ అయ్యి చెత్తలోకి వేసేస్తారు.. మనుషులపై కోపాన్ని పులాపై చూపిస్తారా అని సీరియస్ అవుతాడు. ఆతర్వాత ఆ దండ తీసుకోని తెగ ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఆ దండ తీసుకెళ్తాడు. ఇక ఆ సీన్ చుసిన దేవయాని షాక్ లో ఉండిపోతుంది.
ఇక జగతి, మహేంద్ర ఓ రేంజ్ లో దేవయానితో ఆడుకుంటారు. నువ్వు ఎప్పుడు మారుతావ్ అక్కయ్య అని అనుకుంటేనే వెళ్ళిపోతే.. దేవయాని మాత్రం రిషీని మళ్లీ అదుపులోకి తెచ్చుకోవాలి అనుకుంటాడు.. ఇక తర్వాత సీన్ లో వసుధార కాలేజ్ కు ఆలోచించుకుంటు వస్తుంటే వెనకాల సాక్షి కారులో వచ్చి హార్న్ కొడుతుంది. ఎంతకీ తప్పుకోకపోవడంతో కారు పక్కకు పెట్టి వసుతో గొడవకు సిద్ధం అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరి రేపటి ఎపిసోడ్ లో వసు, రిషీ పూలదండ సీన్ పేపర్ లో వచ్చి ఉంటుంది.. అది చుసిన రిషి ఎలా స్పందించాడు అనేది చూడాలి..