- Home
- Entertainment
- Karthika deepam: మార్చురీ రూమ్లో డాక్టర్ బాబు షూస్.. వంటలక్కకు డాక్టర్ అన్నయ్య సాయం!
Karthika deepam: మార్చురీ రూమ్లో డాక్టర్ బాబు షూస్.. వంటలక్కకు డాక్టర్ అన్నయ్య సాయం!
Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 16వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...

ఎపిసోడ్ ప్రారంభంలోనే.... దీప జరిగిన గతమంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. నేను దొరికినట్టే డాక్టర్ బాబు కూడా ఎవరికైనా దొరుకుతారా?. డాక్టర్ బాబు కూడా నా కోసం ఇంతే ఎదురుచూస్తూ ఉంటారా? అని బాధపడుతూ ఉండగా అక్కడున్న డాక్టర్ నీ పేరేంటి అమ్మ? అసలు ఎవరి డాక్టర్ బాబు? అని అడుగుతాడు. అప్పుడు దీప, తను ఒక పెద్ద డాక్టర్ అని, తన భర్తని ఇలా జరిగిన కథంతా చెప్తాది. దీపా డాక్టర్ని అన్నయ్య అని పిలుస్తుంది. అప్పుడు ఆ డాక్టర్ నేను డాక్టర్ గా చేయవలసినంత చేశాను. నో రారా నువ్వు అన్నయ్య అని పిలిచావు. నీ భర్తని ఎలాగైనా మనం వెతుకుదాము.
డాక్టర్లైనా ఏజెన్సీలైనా ముందు చావు గురించి ప్రస్తావించి తర్వాత బతుకు గురించి భరోసా ఇస్తారు. అందుకే మనం కూడా ఒకసారి మార్చురీకి వెళ్లి వెతుకుదాము అక్కడ లేకపోతే సగం భయం తీరిపోయినట్టే కదా అని అంటాడు. అప్పుడు దీప కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. లేదు నా డాక్టర్ బాబు బతికే ఉన్నాడు అని అంటుంది. నాకు నమ్మకం ఉంది కానీ ఒకసారి చూస్తే భయం పోతుంది కదా అని అంటాడు డాక్టర్. మార్చురీ గదిలోకి ఇద్దరు వెళ్తారు. మీకు యాక్సిడెంట్ అయిన రోజు ఒక శవం అక్కడికి వచ్చింది అని డాక్టర్ అంటాడు. అక్కడ ఆ శవం పైన ఉన్న చెప్పులు చూసి ఆశ్చర్య పోతుంది దీప. అవి కార్తీక్ ప్రమాదం జరిగిన రోజు వేసుకున్న చెప్పులు. దీప ఏడి చేస్తూ ఉంటుంది.
ఈ లోగా అక్కడ డాక్టర్ ఒక్కసారి తీసి చూద్దాము అని పైనున్న ముసుగు తీస్తాడు. దీప చాలా భయం గా చూస్తూ ఉంటుంది కానీ అక్కడ కార్తీక్ ఉండడు ఇంకా ఏదో శవం ఉంటుంది. ఊపిరి పీల్చుకుంటుంది దీప అప్పుడు ఆ డాక్టర్ దీప ని గది బయటకు తీసుకువెళ్లి ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా తిరిగి తీసుకొచ్చేది హాస్పటల్ కెనమ్మా నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు.అయితే కార్తీక్ కూడా కచ్చితంగా బతికే ఉండుంటారు. దాక్కొనే వాళ్ళని పట్టుకోవడం కష్టం కానీ కనబడాలి అనుకునే వాళ్ళని పట్టుకోవడం అంత కష్టమేమి కాదు అని ధైర్యం ఇస్తాడు డాక్టర్. ఆ తర్వాత సీన్లో సౌందర్య, హిమ ఆనందరావు ఇంట్లో కూర్చుని ఉంటారు. సౌందర్య ఏడుస్తూ మనము ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాము.
అసలు మనకు ఏది అచ్చు రావట్లేదు ముందు పెద్దోడు పెళ్లి చేసుకో అన్నాడు దాని తర్వాత ఈ కథంతా జరిగింది. ఇప్పుడు చిన్నోడు అమెరికా వెళ్ళిపోయాడు.మనం కూడా వెళ్ళిపోదాము అని అంటుంది. అప్పుడు హిమ, మనం కూడా వెళ్ళిపోతే అప్పుడు శౌర్య ఇక్కడికి వస్తే మనం లేనప్పుడు శౌర్య కు ఎవరు ఉంటారు నానమ్మ అని అంటుంది. అప్పుడు మనం శౌర్యను కూడా తీసుకెళ్లి పోదాము అని సౌందర్య అనగా శౌర్య ఒప్పుకోదు నానమ్మ అని హిమ అంటుంది. ఇంటికి దూరమైన శౌర్యం మన కుటుంబానికి దగ్గరవుతుంది కనీసం ఇళ్లయిన మనం మారిపోదాము అని నిర్ణయించుకుంటారు.
ఆ తర్వాత సీన్లో దీప కు వైద్యం చేసిన డాక్టర్ దీపని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ అమ్మకి పరిచయం చేపిస్తాడు. అమ్మ నీకు కూతుర్ని తెస్తాను అన్నాను కదా తెచ్చాను అని అంటాడు. వాళ్ళ అమ్మ మీ గురించి ప్రమాదమైనప్పుడు నుంచి నా కొడుకు చెపుతున్నాడమ్మా మీకు మేలు జరగాలని దేవుడ్ని కోరుకున్నాను ఆఖరికి మీరు క్షేమంగా బయటపడ్డారు. ఆ దేవుడు మనతో ఉన్నాడమ్మా మీకు కావాల్సిన వాళ్ళని కూడా దగ్గర చేస్తాడు అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!!