Karthika Deepam: మోనిత కారు డిక్కీలో శౌర్య.. డాక్టర్ బాబు కోసం వంటలక్క నాటకం!
Karthika Deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 26వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... దీప, కాలనీ అసోసియేషన్ వార్షికోత్సవం అని వంట చేయడానికి ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు వాళ్లు,నీకోసమే ఎదురు చూస్తున్నాము అమ్మ, వంట వెనకాతల చెయ్యాలి, చెప్పినవన్నీ జాగ్రత్తగా చేయు అని అంటారు. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ, ఏ నాటకం వేద్దాము అని ఆలోచించుకుంటూ ఉంటారు. అన్ని చాలాసార్లు వేసేసిన నాటకాలు ఉన్నాయి కొత్తగా ఏవైనా నాటకం ఉంటే బాగుండు అని అనేలోగ దీప, నా దగ్గర ఒక కథ ఉన్నదమ్మా వింటారా అని అంటుంది. అప్పుడు వాళ్ళు, కొత్త కథ అంటే సాయంత్రానికల్లా నాటకం వేయాలి అమ్మ అన్ని గుర్తు ఉంటాయో ఉండవో అని అనగా, ఒకసారి వినండి అమ్మ నచ్చితే చేద్దామని దీప ఒక కథ చెప్తుంది.అప్పుడు ఆ కథ విన్నా అందరూ ఏడుస్తూ ఈ కథ చేద్దాం అమ్మ.
వంటలు చేసే దానివి అంటే నీకేం కథలు ఉంటాయి అనుకున్నాను,కానీ ఇంత బాధ ఉంటుందని నేను అనుకోలేదు. అలాగే ఆ ముఖ్య పాత్ర నువ్వే చెయ్యమ్మా, నిన్ను తప్ప ఇంకా అవన్నీ అందులో ఊహించుకోలేము అని అంటారు. అలాగేనండి వంట చేసి వచ్చి రిహార్సల్స్ చేస్తాను అని అంటుంది దీప. ఆ తర్వాత సీన్లో మోనిత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి, నా దగ్గర ఒక గతం మర్చిపోయిన పేషంట్ ఉన్నాడు. నేను డాక్టర్ని తనకి పెళ్లయింది. తన భార్య తన పెళ్లైన సంఘటనలు అన్నీ గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నారు తనకి గతం గుర్తొచ్చే అవకాశం ఉందా అని వెళ్లి అడుగుతుంది. అప్పుడు ఆ డాక్టర్, అవకాశాలు తక్కువ ఉన్నాయి కానీ ప్రయత్నం చేయడం మంచిదే. నా దగ్గర ఇలాగే ఒక పేషెంట్ ఉన్నాడు తను గతంలో మర్చిపోయాడు కానీ తన కూతురు ప్రతిరోజూ జరిగిన సంఘటనలు అన్నీ గుర్తు చేస్తూ ఉంటే ఒక రోజు తనకి గతం గుర్తొచ్చేసింది.
అలాగే ఆ పేషెంట్ వాళ్ళ భార్యను కూడా అలా గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేయడానికి ప్రయత్నించమనండి అని అంటాడు ఆ డాక్టర్. అప్పుడు మోనిత మనసులో, గాడిద గుడ్డేం కాదు, ఇక నుంచి అది అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాను అని మనసులో అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మోనిత.ఆ తర్వాత సీన్లో హిమ ,శౌర్యలు షెడ్ దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడు సౌర్య, హిమా నీ వెళ్ళిపోమని ఎంత చెప్పినా సరే హిమ వెళ్ళను అని అంటుంది. ఇంతలో సౌందర్య అటువైపు వచ్చి పిల్లలు కోసం వెతుకుతూ ఫోటో చూపింస్తూ,అందర్నీ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఒకరు పిల్లలు అటువైపు ఉన్నారు అని చెప్పగా అక్కడికి వెళుతుంది సౌందర్య.
అప్పటికే శౌర్య, సౌందర్యన్ని చూసి ఇప్పుడే వస్తాను అని వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని హిమా అడగగా, వాష్ రూమ్ కి వెళ్తున్నాను ఇప్పుడే వస్తాను అని వెళ్తుంది. ఇంతలో సౌందర్య హిమని చూస్తుంది. వెళ్లి హద్దుకుంటుంది నానమ్మ శౌర్య కూడా వస్తుంది అని అనగా,వాళ్ళు చాలా సేపు ఎదురుచూస్తారు. అప్పుడు సౌందర్య, అది నన్ను చూసినట్టు ఉన్నది అందుకే వెళ్ళింది అది ఇంకా ఎక్కడ దొరకదు అని అంటుంది. అప్పుడు హిమ ఏడుస్తూ, వాష్రూమ్ అంటేనే నాకు అనుమానం రావాల్సింది నానమ్మ. మళ్ళీ శౌర్య ని నేను వదులుకున్నాను అని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత సీన్లో దీప,కార్తీక్ ఇంటికి వెళ్ళి, నాకో సహాయం చేయాలి అని అనగా, ఏంటి? నేనెందుకు నీకు సహాయం చేయాలి అయినా నీ భర్త నిన్ను వదిలేసాడట కదా పాపం మన ఊర్లో వాళ్ళు చెప్పారు. నిన్ను చూస్తే జాలేస్తుంది, కోపం కూడా వేస్తుంది.మొఖం చూస్తే తిట్టాలి అనిపించట్లేదు అని అంటాడు.
అప్పుడు దీప,మన కాలనీ అసోసియేషన్ వార్షికోత్సవం అని నేను ఒక నాటకం వేస్తున్నాను డాక్టర్ బాబు మీరు అది చూడాలి అని అనగా,నువ్వు ఇంట్లో వేసేవన్ని నాటకాలే కదా! కొత్తగా అక్కడ ఎందుకు వేయడం అని అంటాడు కార్తీక్. అప్పుడు దీప, అక్కడికి వస్తే నా భర్త గురించి మీకు చెప్తాను అని అనగా కార్తీక్ నిజంగా చెప్తావా అనీ, శివతో, ఒకవేళ మీ మేడం వస్తే నేను ఇక్కడికి నాటకాలు చూడడానికి వెళ్లాను అని చెప్పు అని శివతో చెప్పి వెళ్తాడు కార్తీక్. ఆ తర్వాత సీన్లో నాటకం వేయడానికి అందరూ తయారవుతారు.
ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు అప్పుడు ఆ కాలనీ ప్రెసిడెంట్ వచ్చి ఈ నాటకం కథ చాలా బాగున్నది మీరందరూ ఖచ్చితంగా ఉండాల్సిందే అని అంటారు. ఆ తర్వాత సీన్లో సౌర్య, సౌందర్య దగ్గర నుంచి పారిపోవడానికి అని ఒక కారు డిక్కీలో వెళ్లి కూర్చుంటుంది. ఆ కారు మోనితది. డిక్కీలో సౌర్యను చూడలేని మోనిత కార్ని నడుపుకుంటూ వెళ్లిపోతుంది. మనసులో ఇలాగుంటే ఇంక కార్తీక్ గతం గుర్తొచ్చే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి కనుక వీలైనంత త్వరగా కార్తిక్ ని అమెరికాకి తీసుకువెళ్లాలి అని అనుకుంటుంది.
డిక్కీలో ఉన్న శౌర్య మనసులో, నన్ను క్షమించండి నానమ్మ! మీరు చాలా బాధపడతారు అని తెలుసు కానీ అమ్మానాన్నలు లేకుండా ఇంట్లో నేను ఉండలేను, అమ్మానాన్నలు చావు కి కారణమైన హిమను చూస్తూ అస్సలు ఉండలేను,అయిన ఈ కార్ ఎక్కడికి వెళ్తుందో అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో దీప వాళ్ళ అన్నయ్య అక్కడికి వస్తాడు. ఎందుకని ఇంత లేట్ అయింది అని దీప అనగా, ఈరోజు పేషెంట్లు ఎక్కువ ఉన్నారమ్మ అని అంటాడు. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి, నీకు తెలుసు కదా నాకు ఈ నాటకాలు అన్న, నాటకాలు చేసే వాళ్ళ అన్న నచ్చరు.
అయినా ఇంతసేపు నేను ఉన్నది,నీ భర్త ఎవరో చెప్తావని, లేకపోతే ఇప్పుడే వెళ్లిపోతాను. అయినా వీళ్ళు ఎవరు అని అనగా, చెప్పాను కదా డాక్టర్ బాబు ఈయన మా అన్నయ్య, గుర్తులేదా అని అంటుంది దీప.నేను మర్చిపోతాను అని నీకు తెలుసు కదా! అయినా మీ అన్నయ్య అయినప్పుడు నీ భర్త గురించి తనకు తెలుసు కదా మీరే చెప్పండి అని అంటాడు కార్తీక్. అప్పుడు దీప వాళ్ళ అన్నయ్య, అది చెప్పడం కన్నా చూస్తేనే చాలా ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి, కొంచెం సేపు ఓపిక తెచ్చుకోండి అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!