MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: మోనిత చంప చెల్లుమనిపించిన దీప..వారణాసి కోసం ఇంద్రుడు ఇంటికి వెళ్లిన కార్తీక్..?

Karthika Deepam: మోనిత చంప చెల్లుమనిపించిన దీప..వారణాసి కోసం ఇంద్రుడు ఇంటికి వెళ్లిన కార్తీక్..?

Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 2వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Nov 02 2022, 07:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ లో నాకెందుకు అనుమానంగా ఉంది దీప నువ్వేమో సౌర్యని ఇతనితో చూసావు నేను ఆ వారణాసితో చూశాను అయినా నీకోసం నేను మళ్ళీ వెతుకుతాను అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్.. అప్పుడు దీపా ఇలా జరుగుతుంది అనుకోలేదు డాక్టర్ బాబు ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది శౌర్య అసలు ఇక్కడ ఉందా అనడంతో కార్తీక్ ఉంది ఇక్కడే ఉంది అని అంటాడు. అప్పుడు దీప మీరు ఎలా చెప్తారు డాక్టర్ బాబు అనడంతో ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకుంటాడు కార్తీక్. మరొకవైపు శౌర్యకి ఇంద్రమ్మ వాళ్ళు దిష్టి తీస్తూ ఉంటారు.
 

28

ఆ తర్వాత సౌర్య డబ్బులు ఎక్కడివి ఇంత ఘనంగా ఫంక్షన్ చేశారు అని అడగగా వాళ్ళు అబద్ధాలు చెప్పడంతో శౌర్య వాళ్ళ పై బాధ్యత లేదు అని అరుస్తుంది. ఇంత గ్రాండ్ గా చేయమని నేను అడిగానా అని కోప్పడుతుంది సౌర్య. అప్పుడు దొంగతనం చేశారా అని సౌర్య అడగగా లేదు అని అంటుంది ఇంద్రమ్మ. మరి మీకు ఇన్ని డబ్బులు ఎక్కడివి అని సౌర్య నిలదీయడంతో ఆ రోజు వాటర్ బాటిల్ కొనిచ్చింది కదా ఆ అమ్మలాగే వేరే తల్లిదండ్రులు ఇలా సహాయం చేశారు అమ్మ అని చెప్పి కవర్ చేస్తాడు ఇంద్రుడు.
 

38

అప్పుడు సౌర్య నేను ఇక్కడ ఉండడం వల్ల మీకు ఇబ్బంది ఉంటుంది అని అనగా అలా అనొద్దు బంగారం అని అంటుంది ఇంద్రమ్మ. నీకే ఇలా ఉంటే మా అమ్మానాన్నలు ఇంకా ఎంత సంతోషించే వారో అని బాధపడుతుంది సౌర్య. ఈరోజు నాకు మా అమ్మ నాన్న వచ్చినట్టు అనిపించింది బాబాయ్ ఏ ఆడపిల్ల అయినా ఎటువంటి సమయంలో అమ్మానాన్న పక్కన ఉండాలి అని కోరుకుంటుంది కదా కానీ నేనేం పాపం చేశాను బాబాయ్ అని బాధపడుతూ ఉండగా అది చూసి ఇంద్రమ్మ దంపతులు కూడా బాధపడుతూ ఉంటారు.
 

48

మరొకవైపు దీప ఎమోషనల్ అవుతూ ఉండగా పక్కనే దుర్గ కూర్చుని మాట్లాడిస్తూ ఉంటాడు. దీప నా జీవితంలో ఏది అనుకున్నట్టుగా జరగలేదు అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సౌర్య ఉంటుంది అనుకొని వెళ్తే అక్కడ శౌర్య లేదు అంటూ ఎమోషనల్ అవుతూ ఉండగా దుర్గ ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడు దీప ఆ వాల్తేరు వాణి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళింది అని అడగగా మీరు పొద్దున వెళ్తున్నారు అని చెప్పలేదు దీపమ్మ అని జరిగిన విషయం మొత్తం వివరిస్తాడు దుర్గ.
 

58

అప్పుడు అసలు విషయం తెలుసుకుని దీప షాక్ అవుతుంది. ఆ మోనిత ఇంతకు తెగిస్తుందని అనుకోలేదు రగిలిపోతూ మోనిత ఇంటికి వెళుతుంది దీప. మరొకవైపు మోనిత అని చూసి శివ భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు శివ ఆకలేస్తుంది తినండి మేడం అని అడగగా ఆకలిగా లేదు అన్నాను కదా ఎందుకు విసిగిస్తావు అని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోమని తిడుతుంది. ఇంతలోనే దీప అక్కడికి వస్తుంది. మోనిత చెంపలు చల్లు మనిపిస్తుంది దీప. నా ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేస్తావా అంటూ వాల్తేరు వాని గురించి చెప్పడంతో మోనిత షాక్ అవుతుంది.
 

68

అప్పుడు అవును నేను నిన్ను చంపడానికే వాల్తేరు వాని ని రప్పించాను కానీ నువ్వు తప్పించుకున్నావు కానీ నిన్ను అంత ఈజీగా వదలను దీప అని వార్నింగ్ ఇస్తుంది మోనిత. అప్పుడు మోనిత కార్తీక్ నా వాడు నా సొంతం అనడంతో దీప చీదరించుకుంటూ ఇద్దరు పిల్లలు గల తండ్రిని ఇష్టపడుతున్నావు దానిని మరొక లాగా పిలుస్తారు అని అంటుంది. ఇప్పుడు దీప సరేలే డాక్టర్ బాబు ఎక్కడున్నారు చెప్పు వాల్తేరు వాణి గురించి చెప్పి బండారం మొత్తం బయట పెడతాను అని అంటుంది దీప.
 

78

ఇప్పుడు నేను నిన్ను చంపేస్తాను అని మోనిత అనగా దీప గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు ఇంద్రుడు అక్కడ పని వాళ్లకు డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి కార్తీక్ మళ్ళీ వస్తాడు. అది చూసి ఇంద్రుడు ఏంటి సార్ మళ్లీ వచ్చాడు అని షాక్ అవుతారు. ఏంటి సార్ మళ్లీ వచ్చారు అని అనడంతో కొన్ని నిజాలు తెలుసుకుందామని అని చెప్పి వారణాసి ఫోటో చూపిస్తాడు కార్తీక్. వారణాసి ఫోటో చూసి ఇంద్రుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు.
 

88

కావాలనే అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు ఇంద్రుడు. అప్పుడు శౌర్య కార్తీక్ వైపు చూస్తూ ఉండగా కావాలని ఇంద్రమ్మ అక్కడి నుంచి పక్కకు లాక్కొని వెళ్తుంది. ఆ తర్వాత ఇంద్రుడు కార్తిక్ కి అబద్ధాలు చెప్పి అక్కడ నుంచి పంపించేస్తాడు.  అప్పుడు సౌర్యకి ఇంద్రమ్మ భోజనం తినిపిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఇంద్రుడు వస్తాడు. అప్పుడు సౌర్య ఎవరితో మాట్లాడుతున్నావు బాబాయ్ అని అనగా నీకు నగలు కొనిచ్చారు అని చెప్పాను కదా అమ్మ అని అనడంతో చెప్తే థాంక్స్ చెప్పేదాన్ని కదా బాబాయ్ అని అంటుంది శౌర్య.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Movies: 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 మూవీస్.. `బూత్‌ బంగ్లా` రచ్చ, నెంబర్‌ 1 ఇదే
Recommended image2
Star Kids: తల్లిదండ్రులు సినిమాల్లో కోట్లు సంపాదిస్తుంటే.. వేరే జాబ్స్ చేస్తున్న స్టార్ కిడ్స్
Recommended image3
Kajal: బాలయ్యకి హ్యాండిచ్చిన నయనతార, లైన్‌లోకి వచ్చిన కాజల్‌.. `ఎన్బీకే111`లో ఏం జరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved