MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: కార్తీక్ కి గతం గుర్తొస్తుందన్న ఆశతో దీప.. మోనితని చూసిన దుర్గ?

Karthika Deepam: కార్తీక్ కి గతం గుర్తొస్తుందన్న ఆశతో దీప.. మోనితని చూసిన దుర్గ?

Karthika Deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 29వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం... 

4 Min read
Author : Navya G
Published : Sep 29 2022, 08:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. దీప, కార్తీక్ ని కంగారుగా హాస్పిటల్ కి తీసుకువస్తుంది. అక్కడ డాక్టర్ ఏమైంది అని అనగా, ఈయన నా భర్త. గతం మర్చిపోయారు, గతం గుర్తు చేయడానికి ప్రయత్నించగా కళ్ళు తిరిగి పడిపోయారు బానే ఉంటుంది కదా డాక్టర్ అని అంటుంది. అప్పుడు వాళ్లు వెళ్లి ట్రీట్మెంట్ చేస్తారు. అప్పుడు దీప బయట నుంచి ట్రీట్మెంట్ ని చూస్తూ, డాక్టర్ బాబు మీరు ఎలాగైనా గతం గుర్తు తెచ్చుకోవాలి  నేను ఇంక ఏ ప్రయత్నం చేయలేను, నా ప్రయత్నం ముగిసిపోయాయి అని ఏడుస్తూ ఉంటుంది. మారవైపు మోనిత ఫంక్షన్ హాల్ కి వెళ్లి చూసేసరికి అక్కడ ఎవరూ ఉండరు. అప్పుడు అక్కడ ఉన్న ఒక అతన్ని,ఇక్కడ ఒక ఆవిడ నాటకం వేసింది ఆవిడేది అని అనగా, అందరూ ఆవిడ గురించే మాట్లాడుకుంటున్నారు మేడం చాలా బాగా నాటకం వేసింది అని జరిగిన కథేంటో చెప్తాడు. 

28

అప్పుడు మోనిత ఆశ్చర్య పోతుంది.అప్పుడు అతను, అంతా బానే ఉంది కానీ చివర్లో ఒక మనిషి కళ్ళు తిరిగి పడిపోయినందు వల్ల సగంలోనే కదా ఆగిపోయింది లేకపోతే ఇంకా బాగుండేది అని అనగా కార్తీక్ కళ్ళు తిరిగి పడిపోయాడని మోనిత కంగారుపడి ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లారు అని అడుగుతుంది.ఏమో మేడం తెలియదు అని అతను వెళ్ళిపోతాడు.అప్పుడు మోనిత, కార్తీక్ కళ్ళు తిరిగి పడిపోయాడు, గతం గుర్తొచ్చి అవకాశం ఉంటుందా! ఏ హాస్పిటల్ కి వెళ్ళుంటాడు? ఫోన్ చేద్దాము అని అనుకుంటుంది కానీ నా ఫోన్ తో ఫోన్ చేస్తే అది ఎత్తుతుందా అని అనుకుని తన వర్కర్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తుంది.ఎక్కడున్నావు కార్తీక్ ఏడి అని మోనిత అడగగా,నా భర్త ఎక్కడున్నాడో చెప్పాల్సిన అవసరం నాకేంటే చిరాకు పెట్టొద్దు అని దీప తిరిగి చెప్తుంది దానికి మోనిత కోప్పడి, చాలా కోపంగా ఉన్నాను కార్తీక్ ఎక్కడున్నాడో చెప్పు అని అంటుంది.

38

 నేను చెప్పను నా భర్త గురించి చెప్పడానికి నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చేదేంటే ఫోన్ పెట్టు అని ఫోన్ పెట్టేస్తుంది దీప. మరోవైపు దీప ఏడుస్తూ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్లి, ఇప్పుడు మోనిత, వార్నింగ్ ఇచ్చింది అన్నయ్య. నాకు ఇన్ని రోజులు ఇంత మానసిక శోభకు గురిచేసింది ఇప్పుడు డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చి మోనితకి తిరిగి అదే శోభ కలిగేలా చేయాలి అని అంటుంది. ఇంతలో ట్రీట్మెంట్ అయిపోయింది అని డాక్టర్ లోపలికి తీసుకువచ్చి చూసేసరికి దీప, అసలు ఎందుకు ఇలా అయింది డాక్టర్ అని అడుగుతుంది.దానికి డాక్టర్, బలవంతంగా గతం గుర్తొచ్చే ప్రయత్నం చేసేసరికి తన మెదడు తట్టుకోలేకపోయింది. ఇంకోసారి ఇలా చేస్తే మెదడు చిట్లి పోయి ప్రాణానికి ప్రమాదం అవుతుంది అని అనగా దీప బాధపడుతుంది. మరి గతం గుర్తుడానికి ప్రయత్నాలు చేయకూడదా అని అడగగా, ప్రయత్నాలు చేయొచ్చు కానీ సడన్గా ప్రయత్నాలు చేయాలి కానీ బలవంతంగా ప్రయత్నించడానికి చూడకూడదు అని అంటాడు డాక్టర్.

48

అప్పుడు దీప మరి ఇప్పుడు గతం గుర్తొచ్చినట్టేనా అని అనగా గుర్తు రావచ్చు, రాకపోవచ్చు వస్తే మీ అదృష్టమే అని అంటాడు.ఇంతలో మోనిత అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడు దీప హాస్పిటల్ లో ఉన్నాం కదా సైలెంట్ గా ఉండు అని చెప్తుంది.వెళ్లి కార్తీక్ ని దీప లేపేసరికి,డాక్టర్ బాబు నన్ను గుర్తుపట్టారా! మీకు గతం గుర్తొచ్చిందా నేను దీపని అని అంటుంది దీప. అప్పుడు కార్తీక్ మోనిత అని అంటాడు.వెంటనే మోనిత, దీప ను పక్కకు తోసి డాక్టర్ డిశ్చార్జ్ ఎప్పుడు అని అడగగా ఇప్పుడు తీసుకెళ్లి పోవచ్చు అని డాక్టర్ అంటాడు. అప్పుడు మోనిత కార్తీక్ నీ తీసుకెళ్తూ ఉండగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడుగుతాడు కార్తిక్. వంటలక్క కి ఒంట్లో బాగోకపోతే వచ్చాము కార్తీక్ అని చెప్పి తీసుకువెళ్లిపోతుంది.దీప అక్కడే ఉండిపోతుంది. ఎందుకు అన్నయ్య నాకే ఇప్పుడు ఇలా జరుగుతుంది?.

58

ఉన్న దారులన్నీ మూసిపోయాయి.ఇప్పుడు నేను ఏం చేయాలి అని బాధపడుతూ ఉండగా దీప వాళ్ళ అన్నయ్య, నువ్వు ఇలా ప్రయత్నాలు మానేయకూడదమ్మ. దీనివల్ల మనకు మంచే జరిగింది. నీ వంటల వల్ల, నువ్వు చేసే ప్రయత్నాలు వల్ల, కార్తీక్  కి గతం గుర్తొచ్చే అవకాశం లేదు అని తెలిసింది కదా ఇప్పుడు కొత్త మార్గంలో ప్రయత్నిద్దాము అంతేకానీ ఇలాగ నిరాశ పడొద్దు అని చెప్తాడు. ఆ తర్వాత సీన్లో,మోనిత కారులో వస్తూ, దీప కార్తీక్  కి గతం గుర్తు చేస్తుంది ఏమో అని భయపడ్డాను కానీ అలా జరగలేదు. 
 

68

నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి దాని నీడ కూడా కార్తీక్ మీద పడకూడదు అనుకుని, వెనకాతల సీట్లో పడుకొని ఉన్న కార్తీక్ ని చూసి నవ్వేలోప ఒక బండి వచ్చి ఢీ కొంటుంది.అప్పుడు మోనిత కోపంతో చూసుకో అక్కర్లేద అనేసరికి అక్కడ దుర్గ ఉంటాడు. వీడెంటి ఇక్కడున్నాడు అని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మోనిత. దుర్గా మోనితని గుర్తుపట్టి వెనకాతల వెళ్తాడు కానీ మోనిత వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో సౌర్య ఆటో వెనకాతల అమ్మానాన్నలు ఎక్కడున్నారు అనే అక్షరాలను చూస్తూ మోనిత చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని నేను చాలా ప్రదేశాలు తిరిగాను.
 

78

ఇంక అమ్మానాన్నలు ఎక్కడా దొరకలేదు.అమ్మానాన్న ఎక్కడున్నా నా దగ్గరికి రండి అని బాధపడుతూ ఉంటుంది. మరోవైపు దీప ఏడుచుకుంటూ ఉంటుంది.దీప వాళ్ళ అమ్మ భోజనం చెయ్యమ్మా అని అనగా వద్దమ్మా నాకు ఆకలిగా లేదు అని బాధపడుతూ ఉంటుంది దీప.అప్పుడు వాళ్ళ అమ్మ, నేను వెళ్లి ఆ దాని బుద్ధి చెప్పి వస్తాను.పరాయి మగవాడి మీద ఆశపడుతుందే అని గట్టిగా అడుగుతాను అని అంటుంది. అప్పుడు దీప,మీరు అడిగిన ఇక్కడ ఏం ప్రయోజనం ఉండదమ్మా!దాన్ని ఎన్ని మంది కొట్టిన సరే దాని బుద్ధి మారదు.
 

88

 డాక్టర్ బాబు కోసం దాని ప్రయత్నాలు మారవు. కొన్ని మనుషులకి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు అని అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ, మరి ఇలాగ మౌనంగా కూర్చుంటే నీ భర్తని తనకిచ్చినట్టు అవుతుంది కదా అని అనగా దీప,ఇప్పుడు అక్కడికి వెళ్లి మీరు మాట్లాడితే డాక్టర్ బాబుకి గతం గుర్తు వచ్చే ప్రయత్నం చేసినట్టు అవుతుంది,మళ్లీ డాక్టర్ బాబుకే ప్రమాదం కదా అని అడగా నువ్విలా నిస్సాయ స్థితిలో ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అమ్మ అని వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు దీప వాళ్ళ అమ్మ భుజం మీదకు వెళ్లి జారబడి బాధపడుతూ ఉంటుంది.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved