- Home
- Entertainment
- Karthika Deepam: అసలు నిజం చెప్పిన కార్తీక్.. నా పిల్లలు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న వంటలక్క!
Karthika Deepam: అసలు నిజం చెప్పిన కార్తీక్.. నా పిల్లలు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న వంటలక్క!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీక దీపం (karthika deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో తెలుసుకుందాం.

కార్తీక్ (Karthik) ఒక దగ్గర కూర్చుని రుద్రాణి పెట్టె తలనొప్పి గురించి ఆలోచిస్తూ ఉండగా దీప (Deepa) అక్కడికి వస్తుంది. ఎందుకు ఆలోచిస్తున్నారు.. మీ చేతిలోని వైద్యం పసివాడిని బాగు చేసింది.. మీ బలం ఏంటో మీ గొప్పతనం ఏంటో మీకు తెలియడం లేదు అంటూ మోటివేట్ చేస్తుంది.
ఎందుకండీ.. పదేపదే ఆలోచిస్తున్నారు. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. మీరు రుద్రాణి (Rudrani) అప్పు గురించి ఎక్కువగా ఆలోచించకండి. త్వరలోనే దానిని తీర్చేస్తాం అంటూ ధైర్యం చెబుతుంది దీప (Deepa). కానీ కార్తీక్ అప్పు చెల్లించకపోతే పిల్లలను తీసుకెళ్తా అని రుద్రాణి అన్న మాట గురించి మనసులో ఆలోచిస్తాడు.
ఇక దీప (Deepa) మీరు ఎందుకు మనసులో బాధపడుతున్నారు. ఎందుకు ఇంతలా నలిగిపోతున్నారు.. చెప్పండి అని అడిగి చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు అన్నటు తన తలపై కార్తీక్ చేయి పెట్టుకుంటుంది. దాంతో కార్తీక్ నిజం చెప్తాడు. గడువులోగా అప్పు కట్టకపోతే రుద్రాణి (Rudrani) పిల్లలలో ఒకరిని తీసుకువెళుతుందన్న మాట చెప్పాడు దానికి దీప బాగా షాక్ అవుతూ బాగా ఏడుస్తుంది.
ఆ తర్వాత కార్తీక్ (Karthik).. రుద్రాణి ఇంటికి కోపంగా వెళ్ళిపోతాడు. నా పిల్లలు నా ఫ్యామిలీ జోలికి రావద్దు అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. నీ అప్పు నేను ఎలాగోలా కట్టేస్తా.. అంతేగాని నా పిల్లల గురించి ఆలోచిస్తే సహించేదే లేదన్నట్టు మాట్లాడతాడు. కానీ రుద్రాణి (Rudrani) ఆ మాటలు ఏమాత్రం పట్టించుకోదు.
తర్వాత కార్తీక్ (Karthik) ఇంటికి వచ్చి అప్పు చెల్లించకపోతే పిల్లలను తీసుకువెళ్లడానికి అంగీకరించినట్టు సంతకం పెట్టినందుకు బాధపడతాడు. ఇలా సంతకం పెట్టిన విషయం పిల్లలకు తెలిస్తే వాళ్ళు ఇంకెంత బాధ పడతారు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత దీప (Deepa) సహనాన్ని గురించి మెచ్చుకుంటాడు.
ఆ తర్వాత దీప (Deepa) నవ్వుతూ డాక్టర్ బాబు మీరు తెలిసి ఎలాంటి తప్పు చేయరు. ఆ విషయం నాకు తెలుసు అంటూ వంటలక్క డాక్టర్ బాబు ఎద పైకి చేరుతుంది. దానికి కార్తీక్ (Karthik) మనసులో ఆనందం వ్యక్తం చేసుకుంటాడు.
ఆ తర్వాత దీప (Deepa) పిండివంటలు అమ్మడానికి ఒక షాప్ దగ్గరికి వెళుతుంది. కానీ అక్కడ ఎవరు తీసుకోరు. ఎందుకంటే రుద్రాణీ అంతకంటే ముందే కార్తీక్ మీద కుట్రపన్ని రుద్రాణి పిండివంటలు అనే పేరుతో పిండివంటలు అమ్ముతుంది. తరువాయి భాగంలో కార్తీక్ (Karthik) గట్టిగా అరుస్తాడు. వెంటనే దీప కార్తీక్ దగ్గరికి వెళుతుంది.