MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: కార్తీక్ ని నిలదీసిన దీప.. రివర్స్ డ్రామా మొదలుపెట్టిన కార్తీక్?

Karthika Deepam: కార్తీక్ ని నిలదీసిన దీప.. రివర్స్ డ్రామా మొదలుపెట్టిన కార్తీక్?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 23వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

4 Min read
Author : Navya G
Published : Dec 23 2022, 09:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లో శౌర్య చదువుకుంటుండగా ఇంతలో చంద్రమ్మ అక్కడికి వచ్చి స్కూల్ కి వెళ్లి చదువుకోవచ్చు కదా బంగారం అనడంతో లేదు పిన్ని నేను స్కూల్ కి వెళ్తే అమ్మానాన్నలను ఎవరు వెతుకుతారు. మొన్న నువ్వు స్కూల్ కి వెళ్ళమని చెప్పినప్పుడు నేను బాబా ఇద్దరమూ వెళ్లి స్కూల్ ప్రిన్సిపాల్ తో మాట్లాడి వచ్చాము. ఇంటి దగ్గరే చదువుకొని పరీక్షలు ఒకటి రాస్తే సరిపోతుంది పిన్ని అని అంటుంది. అప్పుడు చంద్రమ్మ పెద్ద పెద్ద స్కూల్లో చదువుకోవాల్సిన నువ్వు అని అంటుండగా సౌర్య కోప్పడి పదేపదే మీరు వేరు నేను వేరు అని మాట్లాడకండి పిన్ని అని అంటుంది.
 

27

ఇంతలో ఇంద్రుడు అక్కడికి వచ్చి బంగారం నీకు దెబ్బ తగిలింది కదా వెళ్లి ఈ టెస్ట్ లు చేయించుకోవాలి వెళ్దాం పద అని అనగా ఆ పరీక్షలు తర్వాత ముందు నాకు ఈ పరీక్షలు దగ్గరవుతున్నాయి బాబాయ్ నేను చదువుకోవాలి అని అంటుంది. అప్పుడు శౌర్య ఆ చీటీ చూసి కార్తీక్ హ్యాండ్ రైటింగ్ అని గుర్తు పడుతుంది. అప్పుడు ఈ చీటీ ఎవరు రాసారు చెప్పు బాబాయ్ అంటుండగా ఇంద్రుడు ఆలోచనలో పడడంతో మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు బాబాయ్ చెప్పు బాబాయ్ ఎవరు ఇది రాశారు అని అంటుంది. ఏమైంది బంగారం అని అనడంతో నా పేరు బదులు ఇక్కడ రౌడీ అని రాశారు అని అంటుంది శౌర్య. ఈ ప్రపంచంలో నన్ను రౌడీ అని పిలిచేది ఒక్క మా నాన్న మాత్రమే చెప్పు బాబాయ్ అని నిలదీస్తుంది.
 

37

 అప్పుడు చంద్రుడు తప్పించుకోవాలని చూస్తాడు. అప్పుడు ఇంద్రుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు. మరొకవైపు దీప కార్తీక్ చేసిన పనిని తలుచుకొని బాధతో కుమిలిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు నేను వెతుకుతుంటే నన్ను వెతకనివ్వకుండా అడ్డుకున్నారా అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పండరీ అక్కడికి వచ్చి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అని అడగగా ఇంతలోనే చారుశీల, కార్తీక్ ఇద్దరు నవ్వుకుంటూ అక్కడికి వస్తారు. ఇప్పుడు దీప చాలా సంతోషంగా ఉన్నట్లు ఉన్నారు డాక్టర్ బాబు అనడంతో దీప అని అంటాడు. అప్పుడు దీప మూడు చేంజ్ చేయాలి అనుకున్న కార్తీక్ నిన్న ఇంద్రుడు కనిపించాడు చారుశీల పట్టుకుందాం అనుకునే లోపే తప్పించుకొని వెళ్ళిపోయాడు అని అంటాడు.

47

అప్పుడు కార్తీక్ ఏమి జరిగినట్టుగా నాటకాలు ఆడుతుండడంతో దీప కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎక్కడెక్కడ వెతికారు డాక్టర్ బాబు ఇంద్రుడు కోసం నిన్న మనం హోటల్ దగ్గరికి వెళ్ళాము కదా అక్కడ కూడా వెతికారా అనగా అవును దీప అని అంటాడు కార్తీక్. నేను కూడా హోటల్ దగ్గరికి వెళ్లాను డాక్టర్ బాబు ఎదురుగా నా డాక్టర్ బాబు వాడికి డబ్బులు ఇస్తూ కనిపించాడు అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఒకటి రెండు సార్లు నేను కూడా చెక్ చేసుకున్నాను నా కళ్ళు ఏమన్నా మోసం చేస్తున్నాయా అని అనుకున్నాను అంటుంది దీప. నా డాక్టర్ బాబే నన్ను మోసం చేస్తున్నాడని నాకు అర్థం అయింది అని అంటుంది దీప. అప్పుడు దీప కార్తీక్ మీద సీరియస్ అవుతూ మాట్లాడకండి నా బిడ్డను ఎందుకు నాకు దూరం చేస్తున్నారు ఎందుకు నన్ను అందరికి దూరం చేయాలని చూస్తున్నారు అని నిలదీస్తుంది.
 

57

ఎందుకు ఇంద్రుడు తెలిసి కూడా తెలియనట్టుగా వాడు ఎక్కడున్నారో వెతుకునట్టుగా నటిస్తున్నారు అని నిలదీస్తుంది దీప. నన్ను నా కూతురిని విడదీయాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది అని ఏడుస్తూ మాట్లాడుతుంది దీప. నా బిడ్డ కోసం నేను అంతలా ఏడుస్తూ తాపత్రయపడుతుంటే మీకు సంతోషంగా ఉందా అని అంటుంది. కార్తీక్ మౌనంగా ఉండడంతో కాలర్ పట్టుకుని నిలదీస్తుంది దీప. అప్పుడు అవును అని అంటాడు కార్తీక్. దాంతో దీప షాక్ అవుతుంది. నీకు ఇంద్రుడు కనిపించకుండా నేనే వాడిని దాచి పెడుతూ మీకు అబద్ధం చెప్పాను. నువ్వే కాదు నేను కూడా అందరికీ దూరంగా ఉంటున్నాను అని అనగా వెంటనే దీప ఎందుకు డాక్టర్ బాబు నేను మీకు ఏమి అన్యాయం చేశాను అని అంటుంది. ఎందుకు అని నిలదీయడంతో ఎందుకంటే నేను ఎంతో కాలం బతకను కాబట్టి అని అబద్ధం చెబుతాడు కార్తీక్.
 

67

దాంతో అక్కడున్న వారందరూ షాక్ అవుతారు. ఏంటి కార్తీక్ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది చారుశీల. అప్పుడు దీప ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ బాబు మీకు ఏమయ్యింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంది. అప్పుడు నేను ఎంతో కాలం బతకను అని తెలిసింది దీప అందుకే నిన్ను ఎవరి దగ్గరికి తీసుకెళ్లలేదు అని బాధతో మాట్లాడుతాడు కార్తీక్. అందుకే నేను లేను అన్న ఆలోచనతోనే వాళ్ళందరిని బతకనివ్వాలి అని నేను నిన్ను ఎవరి దగ్గరికి తీసుకెళ్లలేదు అని అంటాడు. నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవని నేను చెప్పలేదు దీప గుండె బరువెక్కిలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ దీపకి మరిన్ని అబద్ధాలు చెప్పి దీపని నమ్మించాలని చూస్తాడు. అప్పుడు దీప ఏడుస్తూ చారుశీల ఏదో ఒకటి చేయండి డాక్టర్ బాబును బతికించండి ఆయన లేకపోతే నేను బతకలేను అని ఏడుస్తూ మాట్లాడుతుంది.

77

మరొకవైపు సౌందర్య జరిగిన విషయాలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అంజి అక్కడికి రావడంతో మనం రేపు ఊరికి వెళ్తున్నాము రెడీగా ఉండు అని అంటుంది సౌందర్య. అక్కడ వెతికాం కదా మేడం అనడంతో హాస్పిటల్స్ గుళ్ళు మాత్రమే కాదు ఇంకా ఊరు చాలా ఉంది వెళ్లి వెతుకుదాము అని అంటుంది. ఇప్పుడు ఆనంద్ రావు నా మనవరాలు అక్కడ నెలల కొద్ది వెతుకుతూనే ఉంది దానికి కనిపించలేదు కానీ మీ మేడంకి రెండు రోజుల్లోనే కనిపిస్తారా అని అంటాడు. నీకు ఆ వూరు బాగా తెలుసు అని చెప్పావు కదా ఆ ఊర్లో ఒక మంచి ఇల్లు చూడు ఈసారి అక్కడ నుంచి రావడం అంటూ ఉంటే దీప వాళ్ళని పిలుచుకొని వస్తాను అని అంటుంది సౌందర్య.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు వేడుక'లో విజయ్, రష్మిక సందడి..రాంచరణ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, వైరల్ ఫోటోస్
Recommended image2
Ramayana Trailer: 4000 కోట్ల 'రామాయణ' ట్రైలర్.. ఎక్కడ రిలీజో తెలుసా? ప్లాన్ ఇదే!
Recommended image3
Dubai Homes: దుబాయ్‌లో మన స్టార్ల ఇంద్రభవనాలు.. షారుఖ్, సల్మాన్, ఐశ్వర్య ఇళ్ల ఖరీదెంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved