MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ramayana: రెండు భాగాలుగా రామాయణ్‌ వెనుకున్న అసలు కథ ఇదే.. అది సాధ్యం కాదంటూ దర్శకుడు కామెంట్‌

Ramayana: రెండు భాగాలుగా రామాయణ్‌ వెనుకున్న అసలు కథ ఇదే.. అది సాధ్యం కాదంటూ దర్శకుడు కామెంట్‌

Ramayana: యశ్, రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తున్న 'రామాయణం' సినిమాను రెండు భాగాలుగా ఎందుకు తీస్తున్నారో మేకర్స్ అసలు రహస్యం బయటపెట్టారు. మొదటి భాగం చూశాక, రెండో భాగం కోసం ప్రేక్షకులు కచ్చితంగా ఎదురుచూసేలా కథను అల్లినట్లు టీమ్ చెబుతోంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 27 2026, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రామాయణ్‌ రెండు భాగాలు ఎందుకంటే?
Image Credit : others

రామాయణ్‌ రెండు భాగాలు ఎందుకంటే?

'రామాయణం' సినిమాను రెండు భాగాలుగా ఎందుకు తీస్తున్నారు? ఈ పెద్ద సీక్రెట్‌ను శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) 2026 స్టేజ్‌పై చిత్ర బృందం బయటపెట్టింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత  ప్రస్టీజియస్‌  సినిమాపై గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారనే ప్రశ్నకు డైరెక్టర్ నితేష్ తివారీ, టీమ్ సమాధానం ఇచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రామాయణం కథ చాలా పెద్దది
Image Credit : Instagram

రామాయణం కథ చాలా పెద్దది

ఈ ఇతిహాసం చాలా పెద్దది! శాన్ డియాగో కామిక్-కాన్‌లో జరిగిన ఈవెంట్‌లో రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్, నిర్మాత నమిత్ మల్హోత్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నితేష్ తివారీ మాట్లాడుతూ.. 'రామాయణం కథ చాలా విస్తృతమైంది. దాన్ని కేవలం 3 గంటల సినిమాలో ఇమడ్చడం అసాధ్యం' అని అన్నారు.
36
ఆత్మ దెబ్బతింటుంది
Image Credit : Asianet News

ఆత్మ దెబ్బతింటుంది

ఈ ఇతిహాసంలోని ప్రతి పాత్రకు, ప్రతి సన్నివేశానికి న్యాయం చేయాలన్నదే మా ఉద్దేశం. కథను కట్ చేసి ఒకే భాగానికి పరిమితం చేస్తే దాని ఆత్మ దెబ్బతింటుంది. అందుకే దీన్ని రెండు భాగాలుగా చెప్పాలని నిర్ణయించుకున్నాం' అని వివరించారు. అంతేకాదు, మొదటి భాగం చూశాక.. తర్వాత ఏం జరుగుతుందా? అనే క్యూరియాసిటీ పీక్స్‌కి వెళ్తుంది. పార్ట్ 1 ముగియగానే, పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూసేలా కథను అద్భుతంగా అల్లినట్లు టీమ్ చెప్పింది.
46
రామయణ్‌ విజువల్స్ లీక్‌
Image Credit : Asianet News

రామయణ్‌ విజువల్స్ లీక్‌

లీకైన విజువల్స్, వైరల్ అయిన టీజర్! చిత్ర బృందం ఇంకా అధికారికంగా ట్రైలర్‌ను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయలేదు. కానీ న్యూఢిల్లీ, ముంబై, ఇప్పుడు శాన్ డియాగోలో జరిగిన ప్రదర్శనలప్పుడు కొందరు సీక్రెట్‌గా తీసిన వీడియో క్లిప్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ విజువల్స్ చూసిన అభిమానులు సినిమా గ్రాండియర్‌కు ఫిదా అయిపోతున్నారు. పైరసీని అడ్డుకోవడానికి నిర్మాత నమిత్ మల్హోత్రా లీగల్ టీమ్ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సోషల్ మీడియాలో 'రామాయణం' హవా మాత్రం తగ్గడం లేదు.

56
రామాయణ్ భారీ తారాగణం
Image Credit : Asianet News

రామాయణ్ భారీ తారాగణం

ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, సాయి పల్లవి సీతగా, మన రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా గర్జించబోతున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దుబేతో పాటు అరుణ్ గోవిల్, లారా దత్తా వంటి దిగ్గజ నటులు ఈ చిత్రంలో ఉన్నారు. ఇక మ్యూజిక్ లెజెండ్స్ హన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ కలిసి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

66
దీపావళికి రామాయణ్‌ రిలీజ్‌
Image Credit : Asianet News

దీపావళికి రామాయణ్‌ రిలీజ్‌

మొత్తం మీద, నవంబర్ 2026లో ఈ విజువల్ వండర్ థియేటర్లలోకి రానుంది. ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చూపించడానికి చిత్ర బృందం సిద్ధమైంది. రణ్‌బీర్, యశ్ మధ్య ఫేస్-ఆఫ్ చూడటానికి అభిమానులు ఇప్పటి నుంచే కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
సాయి పల్లవి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix: ఓటీటీలో చిరంజీవి సంచలన పాడ్ కాస్ట్, ఇది కూతురి ప్లాన్.. సినిమాలు, రాజకీయాల్లో తెరవెనుక ఏం జరిగింది
Recommended image2
Bigg Boss Telugu 10: ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వే.. రోహిత్ పై రెచ్చిపోయిన త్రిగుణ్
Recommended image3
Taapsee Marriage: 13 ఏళ్ల సీక్రెట్ రిలేషన్‌షిప్‌పై నోరువిప్పిన తాప్సీ..నా పార్ట్నర్ ని నేనే ఎంచుకున్నా
Related Stories
Recommended image1
Jana Nayagan 4 Days Collections: ఆదివారం తన రేంజ్‌ చూపించిన విజయ్‌.. జన నాయకుడుకి అదిరిపోయే వసూళ్లు
Recommended image2
Chennai Love Story 3 Days Collections: దుమ్ములేపుతున్న చెన్నై లవ్‌ స్టోరీ.. కిరణ్‌ సినిమాకి 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved