టీవీ సీరియల్ నుంచి హిట్ 3 మూవీలో ఆ సీన్ కాపీ చేశారా ? సోషల్ మీడియాలో ట్రోలింగ్
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3. మే 1న ఈ చిత్రం కార్మికుల దినోత్సవం సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది.

Nani Hit 3
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3. మే 1న ఈ చిత్రం కార్మికుల దినోత్సవం సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. హిట్ సిరీస్ ఫ్రాంచైజీలో డైరెక్టర్ శైలేష్ కొలను మూడవ చిత్రంగా దీనిని రూపొందించారు.
Actor Nanis
ఈ చిత్రంలో నానికి జోడిగా కేజిఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటించింది. ఈ చిత్రంలో శ్రీనిధికి కూడా బలమైన పాత్ర దొరికింది. నాని అయితే తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా రూత్ లెస్ పోలీస్ అధికారిగా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో అయితే నాని సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.
మూవీ రిలీజ్ కి ముందే ఈ చిత్రానికి ఆడవాళ్లు, పిల్లలు దూరంగా ఉండాలని నాని తెలిపారు. అయినప్పటికీ హిట్ 3 చిత్రం బాక్సాఫీస్ వద్ద 60 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం నెటిజన్లు సోషల్ మీడియాని విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఈ సమయంలో సినిమాలో చిన్న లోపం కనిపించినా, కాపీ చేసినట్లు అనిపించినా వెంటనే ట్రోల్ చేసేస్తున్నారు.
హిట్ 3 చిత్రానికి కూడా కాపీ విమర్శలు తప్పడం లేదు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు మీట్ అయ్యే ఒక సన్నివేశాన్ని టీవీ సీరియల్ నుంచి కాపీ చేశారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. తెలుగులో బాగా పాపులర్ అయిన గుప్పెడంత మనసు అనే టీవీ సీరియల్ నుంచి హిట్ 3 చిత్రంలోని ఒక సన్నివేశాన్ని కాపీ చేసినట్లు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
Hit 3 Movie
హీరో నాని, శ్రీనిధి శెట్టి ఒక రెస్టారెంట్ లో కాఫీకి మీట్ అయ్యే సన్నివేశం, ఆ తర్వాత సాంగ్ లో వచ్చే కొన్ని దృశ్యాలని గుప్పెడంత మనసు టీవీ సీరియల్ లో లీడ్ పెయిర్ మధ్య వచ్చే సీన్స్ నుంచి కాపీ చేసినట్లు ట్రోలింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి టీవీ సీరియల్ నుంచి కాపీ చేయడం ఏంటి అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే నిజంగానే ఆ సీన్ కాపీ చేశారా లేక నెటిజన్లు ఎడిటింగ్ ద్వారా క్రియేట్ చేశారా అనేది క్లారిటీ లేదు.