MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వరుసగా 6 ఫ్లాపులతో డిప్రెషన్, సినిమాలు వదిలేద్దాం అనుకున్న స్టార్ హీరో..పిలిచి మరీ క్లాస్ పీకిన చిరంజీవి

వరుసగా 6 ఫ్లాపులతో డిప్రెషన్, సినిమాలు వదిలేద్దాం అనుకున్న స్టార్ హీరో..పిలిచి మరీ క్లాస్ పీకిన చిరంజీవి

వరుసగా 6 ఫ్లాపుల తర్వాత ఒక స్టార్ హీరో ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్నారు. అతడికి మెగాస్టార్ చిరంజీవి క్లాస్ పీకిన సంఘటన గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 13 2025, 09:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉన్నత స్థాయికి చేరుకున్నారు. చాలామంది యువతకు, సినిమాల్లో రాణించాలనుకునే ఎంతోమంది నటీనటులకు చిరంజీవి ఆదర్శంగా నిలిచారు. టాలీవుడ్ లో చిరంజీవి ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టామని ఇప్పటికీ కొంతమంది నటీనటులు చెబుతుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Chiranjeevi

Chiranjeevi

హీరో శ్రీకాంత్ అయితే.. చిరంజీవిపై పిచ్చి అభిమానంతోనే హీరో కావాలనుకున్నట్లు చాలా ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పారు. చిరంజీవిపై తనకున్న అభిమానం గురించి శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. శ్రీకాంత్ కుటుంబం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నుంచి కర్ణాటకలోని గంగావతి అనే ఊరికి వలస వెళ్లారు. శ్రీకాంత్ తండ్రి వ్యాపార నిమిత్తం కర్ణాటకకు వెళ్లాల్సి వచ్చింది.

37
srikanth

srikanth

అప్పట్లో తనకి చిరంజీవిపై విపరీతమైన అభిమానం ఉండేది అని శ్రీకాంత్ తెలిపారు. ఆయన నటించిన సినిమాల పోస్టర్లు పేపర్లలో వస్తే వాటిని కట్ చేసుకుని దాచుకునే వాడిని. చిరంజీవి గారి పేపర్ కటింగ్ చాలానే నా దగ్గర ఉండేవి. కానీ ఒకసారి మా ఊర్లో అగ్నిప్రమాదం జరగడం వల్ల ఇల్లు తగలబడిపోయింది. ఆ మంటల్లోనే చిరంజీవి పేపర్ కటింగ్స్ కూడా కాలిపోయాయి. అది కనుక ఉండి ఉంటే తప్పకుండా చిరంజీవి గారికి చూపించేవాడిని.
 

47

సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయనపై అభిమానం కొనసాగింది. నటుడిగా నాకు మంచి గుర్తింపు వచ్చింది. సందర్భం వచ్చిన ప్రతిసారి వెళ్లి చిరంజీవి గారిని కలిసే వాడిని. నా బర్త్ డే వచ్చినప్పుడు ఆయన బిజీగా ఉంటే ఎందుకు ఇబ్బంది పెట్టడంలే అని పిలిచే వాడిని కాదు. ఆయన వెంటనే ఎందుకు పిలవలేదు అడిగేవాడు. చాలా సరదాగా ఉండేవారు. ప్రేయసి రావే చిత్రానికి ముందు నాకు వరుసగా 6 ఫ్లాపులు ఎదురయ్యాయి. అప్పట్లో ఫ్లాప్ మూవీ అంటే చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యే వాడిని. ఇండస్ట్రీలో కూడా ఫ్లాప్ అంటే ఏదో తప్పు జరిగిపోయింది అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఏకంగా ఆరు ఫ్లాపులు ఎదురు కావడంతో కొన్ని నెలల పాటు ఇంట్లో నుంచి బయటికి రాలేదు.
 

57

చిరంజీవి గారికి కూడా ఫోన్ చేయలేదు. డిప్రెషన్ వల్ల ఇక  సినిమాలు మానేసి కర్ణాటక కు వెళ్లి వ్యవసాయం చేసుకుందాం అని ఆలోచన కూడా వచ్చింది. చాలా రోజులుగా చిరంజీవి గారికి ఫోన్ చేయకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చింది. ఏంటి శ్రీకాంత్ నుంచి ఫోన్ కాల్ కానీ, కబురు కానీ లేదు అని అనుకున్నారు. వెంటనే బ్రహ్మానందం గారికి చెప్పి తనని కలవమని కబురు చేశారు.
 

67

ఆయన ఆ టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ లో ఉన్నారు. నేను వెళ్ళగానే గంటసేపు షూటింగ్ ఆపేసి నాతో కూర్చున్నారు. ఏంటి ఏమైంది అని అన్ని వివరాలు ఆరా తీశారు. ఈ విధంగా ఆరు సినిమాలు పోయాయి.. ఊరికి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నాను అన్నయ్య అని చెప్పాను. దీంతో నాకు గంటసేపు క్లాస్ పీకారు. తన జీవితంలో, కెరీర్ లో ఎదురైన సంఘటనలన్నీ నాకు చెప్పారు. జయాపజయాలు అనేవి మన చేతుల్లో ఉండేవి కాదు. బాధ్యతగా కష్టపడి పనిచేయడం మాత్రమే మనం చేయాలి. హిట్లు ఫ్లాపులు గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదు అని హితబోధ చేశారు.
 

77

చిరంజీవి గారు చెప్పిన ఆ మాటలు తర్వాత నా కెరీర్లో నేనెప్పుడూ ప్లాపుల గురించి భయపడలేదు. ఆ తర్వాత నటించిన ప్రేయసి రావే చిత్రం సూపర్ హిట్ అయింది అని శ్రీకాంత్ గుర్తు చేసుకున్నారు. చిరంజీవితో శ్రీకాంత్ శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Related Stories
Recommended image1
ఆ సాంగ్ కి చిరంజీవి, బాలయ్య కలసి డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది..జూ.ఎన్టీఆర్ కామెంట్స్ తో మోత మోగిపోయిందిగా
Recommended image2
హీరోయిన్ ని కాలేకపోయినందుకు చాలా బాధపడ్డా.. కాస్టింగ్ కౌచ్, ట్రోలింగ్ పై అనసూయ కామెంట్స్ 
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved