Krithi Shetty: సినిమాల్లోకి రాకముందు అలాంటి యాడ్స్ లో నటించిన కృతి శెట్టి... ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు!
ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కెరీర్ చిన్నప్పుడే మొదలైంది. ఆమె పలు రకాల కమర్షియల్స్ లో నటించింది. సినిమాల్లోకి రాక ముందు కృతి శెట్టి నటించిన యాడ్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.
Krithi Shetty
కన్నడ భామ కృతి శెట్టి పుట్టి పెరిగింది మాత్రం ముంబైలో. ఆమె తండ్రి బిజినెస్ మ్యాన్ కాగా ముంబైలోనే చదువుకుంది. చదువుకునే రోజుల్లో కృతి శెట్టి మోడలింగ్ చేసింది. పలు కమర్షియల్ యాడ్స్ లో నటించింది. తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
కృతి శెట్టి మొదటి చిత్రం సూపర్ 30. హ్రితిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ఈ బయోపిక్ లో కృతి స్టూడెంట్ రోల్ చేసింది. ఉప్పెన మూవీతో పూర్తి స్థాయి హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ మూవీతో కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.
Actress Krithi Shetty
కాగా సినిమాల్లోకి రాకముందు కృతి శెట్టిని మనం పలు యాడ్స్ లో చూశాం. ఇప్పుడు ఆ యాడ్స్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ యాడ్ లో నటించిన అమ్మాయి కృతి శెట్టా అనుకుంటారు. మరి కృతి శెట్టి చేసిన కమర్షియల్స్ ఏమిటో చూద్దాం.
Krithi Shetty
ఇండియాకు చెందిన బిస్కెట్ కంపెనీ పార్లీ యాడ్ లో కూడా కృతి శెట్టి నటించడం విశేషం. పార్లీ కంపెనీకి ఇండియా వైడ్ మార్కెట్ ఉంది.
Krithi Shetty
దేశంలోని లీడింగ్ నెట్వర్క్ కంపెనీల్లో ఐడియా ఒకటి. ఆదిత్య బిర్లా సంస్థకు చెందిన ఐడియా నెట్వర్క్ యాడ్ లో కృతి శెట్టి నటించింది.
Krithi Shetty
అలాగే లైఫ్ బాయ్ సోప్ యాడ్ లో కూడా కృతి శెట్టి నటించింది. బాక్సింగ్ గర్ల్ గా ఆ యాడ్ లో కృతి లుక్ ఫెరోషియస్ గా ఉంటుంది.
Krithi Shetty
ఫ్యాషన్ బ్రాండ్ 'అన్ లిమిటెడ్' యాడ్ లో కృతి శెట్టి నటించారు. ఈ యాడ్ లో కృతి శెట్టి చాలా క్యూట్ గా ఉంటుంది. ఇలా పలు కమర్షియల్స్ లో కృతి శెట్టి నటించింది. పసితనంలోనే డబ్బులు సంపాదించింది.
Krithi Shetty
ఉప్పెన అనంతరం కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు సూపర్ హిట్ కొట్టాయి. అయితే మరలా కృతి హిట్ పడలేదు. ఈ మధ్య కాలంలో కృతి శెట్టి నటించిన చిత్రాలన్నీ పరాజయం పొందాయి.
ప్రస్తుతం కృతి శెట్టి తెలుగులో శర్వానంద్ కి జంటగా ఓ చిత్రం చేస్తుంది. అలాగే ఓ తమిళ్, మరో మలయాళ చిత్రం చేస్తుంది. కృతి శెట్టికి ఒక సాలిడ్ హిట్ కావాలి. అప్పుడే మరలా ట్రాక్ లో పడుతుంది.
పరువాలు దగ్గరగా చూపిస్తూ ఊపిరి ఆపేసిన శ్రీముఖి... చోళీ లెహంగాలో సాలిడ్ గ్లామర్ ట్రీట్!