MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Taapsee Pannu: హీరో పెళ్ళానికి నచ్చలేదని తాప్సీని సినిమా నుంచి తీసేశారు.. స్టార్‌ హీరోయిన్‌ ఆవేదన

Taapsee Pannu: హీరో పెళ్ళానికి నచ్చలేదని తాప్సీని సినిమా నుంచి తీసేశారు.. స్టార్‌ హీరోయిన్‌ ఆవేదన

Taapsee Pannu: ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఎదురైన షాకింగ్‌ ఇన్సిడెంట్స్ ని పంచుకున్నారు తాప్సీ. హీరో పెళ్లానికి తాను నచ్చలేదని సినిమా నుంచి తీసేశారట. తాజాగా ఈ విషయం చెప్పి షాకిచ్చింది తాప్సీ.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 25 2026, 08:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోని అనుభవాలను పంచుకున్న తాప్సీ
Image Credit : Insatgram

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోని అనుభవాలను పంచుకున్న తాప్సీ

బాలీవుడ్ నటి తాప్సీ పన్ను తన సినీ ప్రయాణంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను తాజాగా పంచుకున్నారు. ఇండస్ట్రీలో అవకాశాలు రావడం ఎంత కష్టమో, వచ్చిన ఛాన్స్‌ను చివరి వరకు నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టమని ఆమె మాటలు మరోసారి నిరూపిస్తున్నాయి. డేట్స్ అన్నీ లాక్ చేసిన తర్వాత కూడా ఒక సినిమా నుంచి తనను తీసేశారని తాప్సీ చెప్పారు. అయితే, దానికి వాళ్లు చెప్పిన కారణం విని ఆమె షాక్ అయ్యారట. నయన్‌దీప్ రక్షిత్‌తో జరిగిన తాజా ఇంటర్వ్యూలో తాప్సీ తన బాలీవుడ్ అనుభవాల గురించి మాట్లాడారు తాప్సీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎలాంటి కారణం చెప్పకుండానే సినిమా నుంచి తీసేశారు
Image Credit : Instagram

ఎలాంటి కారణం చెప్పకుండానే సినిమా నుంచి తీసేశారు

తాను నటించాల్సిన ఒక సినిమాకు ముందే డేట్స్ ఇచ్చేశారట తాప్సీ. కానీ, తర్వాత ఎలాంటి కారణం చెప్పకుండానే ఆ ప్రాజెక్ట్ నుంచి తనను తప్పించారని చెప్పారు. ఇలా ఎందుకు జరిగి ఉంటుందా అని అప్పట్లో తనకు చాలా అనుమానాలు వచ్చాయన్నారు. తనను సినిమా నుంచి తీసేయడానికి హీరోనే కారణం అని ఆమెకు తెలిసింది. కానీ, అసలు రీజన్ ఏంటనేది మాత్రం ఎవరూ చెప్పలేదు. ఆ టైమ్‌లో తన మదిలో చాలా ప్రశ్నలు మెదిలాయని తాప్సీ గుర్తుచేసుకున్నారు. బహుశా హీరోకి తన ప్లేస్‌లో వేరే హీరోయిన్ కావాలేమో, లేక వేరే వాళ్లతో అతనికి ఎక్కువ చనువు ఉందేమో అని రకరకాలుగా ఊహించుకున్నారట.

34
హీరో పెళ్లానికి నచ్చలేదని తాప్సీని తీసేశారట
Image Credit : Asianet News

హీరో పెళ్లానికి నచ్చలేదని తాప్సీని తీసేశారట

అయితే, ఈ విషయానికి సంబంధించి తాప్సీ చెప్పిన మరో మాట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తనను సినిమా నుంచి తీసేయడానికి వాళ్లు చెప్పిన కారణాల్లో ఒకటైతే మరీ చెత్తగా ఉందని ఆమె అన్నారు. "హీరో భార్యకు నువ్వంటే ఇష్టం లేదట" అని తనకు చెప్పారని తాప్సీ రివీల్ చేశారు. అసలు ఆమెకు తానెందుకు నచ్చాలో ఇప్పటికీ తనకు అర్థం కాలేదని తాప్సీ అన్నారు. అయితే ఇది ఏ సినిమా, ఆ హీరో ఎవరనేది తాప్సీ వెల్లడించలేదు.

ఈ సందర్భంగా ఆమె ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన రోజుల్లో ఎదురైన మరో అనుభవాన్ని కూడా పంచుకున్నారు. కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు, అవి తెరపై అవసరానికి మించి శృంగారభరితంగా కనిపిస్తాయని అప్పట్లో తనకు తెలియదన్నారు. షూటింగ్ టైమ్‌లో ఆ సీన్‌ను చాలా అందంగా తీస్తున్నారని అనుకున్నా, ఫైనల్ ఔట్‌పుట్ చూశాక మాత్రం దాన్ని అనవసరంగా వల్గర్‌గా చూపించారని తనకు అనిపించిందని తాప్సీ వివరించారు.

44
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అన్నీ గుడ్డిగా నమ్మేదాన్ని
Image Credit : Insatgram

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అన్నీ గుడ్డిగా నమ్మేదాన్ని

ఇండస్ట్రీ గురించి పెద్దగా అనుభవం లేకపోవడం వల్ల, చుట్టుపక్కల వాళ్లు చెప్పిందే కరెక్ట్ అని నమ్మేదాన్ని అని ఆమె చెప్పారు. "అందరూ ఇలాగే చేస్తారు" అని వాళ్లు అన్నప్పుడు, తాను వేరే బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి బహుశా తనకే ఈ విషయాలు తెలియవేమో అని సరిపెట్టుకునేదాన్ని అని తాప్సీ అన్నారు. కానీ, కొన్ని విషయాలు సినిమాలో కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదని ఆ తర్వాత తనకు అర్థమైందని చెప్పారు. గ్లామర్‌గా కనిపించడం, మితిమీరిన శృంగారం.. ఈ రెండూ ఒకటే కాదని తాప్సీ స్పష్టం చేశారు. సినిమాలో గ్లామరస్‌గా కనిపించినంత మాత్రాన, సీన్స్‌ను అనవసరంగా వల్గర్‌గా చూపించాల్సిన పనిలేదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇక కెరీర్ విషయానికొస్తే, తాప్సీ పన్ను రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన 'గాంధారి' సినిమాలో కనిపించారు. ఒకప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్‌కి దూరంగా ఉంటోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shruti Haasan: తల్లి కావడానికి చాలా మార్గాలు ఉన్నాయి, పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు.. షాకింగ్ కామెంట్స్
Recommended image2
Alia Bhatt: మోస్ట్ గ్లామర్‌ లుక్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీ.. లవ్‌ అండ్ వార్‌ నుంచి అలియాభట్‌ లుక్‌
Recommended image3
Srikanth Odela: తేడా కొట్టిన 'ది ప్యారడైజ్', శ్రీకాంత్ ఓదెల వాట్ నెక్స్ట్ ? చిరంజీవితో మూవీ ఉంటుందా
Related Stories
Recommended image1
Krishnudu: బిగ్‌ బాస్‌ తెలుగు 10 విన్నర్‌ అతనే, తేల్చేసిన కృష్ణుడు.. అతనే ట్రోల్‌ చేయించడంటూ సంచలన కామెంట్‌
Recommended image2
Alia Bhatt: మోస్ట్ గ్లామర్‌ లుక్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీ.. లవ్‌ అండ్ వార్‌ నుంచి అలియాభట్‌ లుక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved