MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ANR: నా బర్త్ డేకి చిరంజీవి సినిమా రిలీజ్ చేయొద్దు, అతడిని పట్టుకోవడం కష్టం.. ఏఎన్నార్ ఎందుకు అలా అన్నారు

ANR: నా బర్త్ డేకి చిరంజీవి సినిమా రిలీజ్ చేయొద్దు, అతడిని పట్టుకోవడం కష్టం.. ఏఎన్నార్ ఎందుకు అలా అన్నారు

తన పుట్టిన రోజున చిరంజీవి సినిమా రిలిజ్ చేయొద్దు అని ఏఎన్నార్ అన్నారు. అసలు ఏఎన్నార్ ఎందుకు అలా అన్నారు, చిరంజీవి నటించిన ఆ సినిమా ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 25 2026, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ చాలా స్లోగా ప్రారంభం అయింది. వరుసగా సినిమాలు చేసేవారు కానీ క్రేజ్ అంత ఈజీగా రాలేదు. ఒక్కో సినిమా చేస్తూ తన రేంజ్ పెంచుకుంటూ నిర్మాతలు , దర్శకుల దృష్టిలో పడ్డారు. ఖైదీ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి స్టార్ కాకముందే చాలా మంది దిగ్గజ హీరోల కంట్లో పడ్డారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మొగుడు కావాలి మూవీ
Image Credit : Asianet News

మొగుడు కావాలి మూవీ

మొగుడు కావాలి అనే మూవీ చేస్తున్నప్పుడు ఆసక్తికర సంఘటన జరిగింది. అప్పటికే చిరంజీవి కొన్ని సినిమాలు చేశారు. హిట్లు కొట్టారు. 1980లో మొగుడు కావాలి రిలీజ్ అయింది. అప్పటికి చిరంజీవి కాస్త గుర్తింపు ఉంది. తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న చోటే అక్కినేని నాగేశ్వర రావు గారి పిల్ల జమిందార్ షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ విషయాలని తమ్మారెడ్డి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.

35
చిరంజీవిని మీరు పట్టుకోలేరు
Image Credit : Facebook/Allu Arjun

చిరంజీవిని మీరు పట్టుకోలేరు

ఓ రోజు ఏఎన్నార్ గారు మా సెట్ కి వచ్చారు. చిరంజీవిని చూసి ఈ కుర్రాడు చాలా పెద్ద హీరో అవుతాడయ్యా. ఎంత పెద్ద హీరో అవుతాడు అంటే భవిష్యత్తులో మీరెవరూ అతడిని పట్టుకోలేరు అని అన్నారు. ఆయన మాటలే తర్వాత నిజం అయ్యాయి. చిరంజీవి స్టార్ కాకముందే ఆయన స్టామినాని ఏఎన్నార్ అంచనా వేశారు అని తమ్మారెడ్డి తెలిపారు.

45
సెట్ అడిగితే ఇవ్వనని చెప్పిన ఏఎన్నార్
Image Credit : IMDB

సెట్ అడిగితే ఇవ్వనని చెప్పిన ఏఎన్నార్

ఏఎన్నార్ గారి పిల్ల జమిందార్ షూటింగ్ కోసం ఓ సెట్ వేశారు. 1980లోనే ఆ సెట్ కి 10 లక్షలు ఖర్చయింది. సెట్ చాలా బావుంది. తన మూవీ షూటింగ్ పూర్తయ్యాక ఆ సెట్ ని రెంట్ కి ఇవ్వాలని ఏఎన్నార్ భావించారు. పెద్ద సినిమా అయితే కచ్చితంగా 50 వేలు రెంట్ ఇస్తారు. తమ్మారెడ్డికి ఆ సెట్ నచ్చి వెళ్లి ఏఎన్నార్ ని అడిగారట. ఏఎన్నార్ మొహమాటం లేకుండా ముఖం మీదే ఇవ్వను అని చెప్పేశారు. ఎందుకు ఇవ్వనన్నారో కారణం కూడా చెప్పారు. నువ్వు చేస్తున్నది చిన్న సినిమా. చిన్న బడ్జెట్. నీ సినిమాకి 50 వేలు రెంట్ కట్టి సెట్ తీసుకోకూడదు. అంత ఖర్చు నువ్వు పెట్టకూడదు. అది నీ సినిమాకే నష్టం. ఒక వేళ ఇస్తే నీకు 10 వేలకు ఇవ్వాలి. ఆ తర్వాత అడిగేవాళ్ళు కూడా అదే ధరకు అడుగుతారు. కాబట్టి ఇవ్వను అని చెప్పినట్లు ఏఎన్నార్ అన్నారు. సరే ఒక పని చేద్దాం. నా సినిమాకు వాడిన సెట్ సామగ్రి ఉంది. వాటిలో నీకు కావలసింది సెలెక్ట్ చేసుకుని డిజైన్ చేసి ఇవ్వు. నీకు 10 వేల ఖర్చుతో నేను సెట్ నిర్మించి ఇస్తాను అని ఏఎన్నార్ అన్నారు. దానికి ఒకే చెప్పాను.

55
నా పుట్టిన రోజున చిరంజీవి సినిమా రిలీజ్ చేయొద్దు
Image Credit : Asianet News

నా పుట్టిన రోజున చిరంజీవి సినిమా రిలీజ్ చేయొద్దు

మరుసటి రోజు ఉదయం మా అందరికంటే ముందే ఆయన లొకేషన్ కి వచ్చి సెట్ వర్క్ చూస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను. మీరెందుకు సార్ వచ్చారు అని అడిగా. లేదు అది నా బాధ్యత అని ఏఎన్నార్ గారు దగ్గరుండి సెట్ వర్క్ కంప్లీట్ అయ్యేలా చూశారు. సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావ్ అని అడిగారు. మీ పుట్టిన రోజుకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం సార్ అని చెప్పా. నా బర్త్ డేకి అస్సలు రిలీజ్ చేయకు. నా పుట్టినరోజున రిలీజ్ అయిన సినిమాలు అనీ ఫ్లాప్ అవుతున్నాయి. ఇక నీ ఇష్టం అంటూ సరదాగా చెప్పారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో మొగుడు కావాలి చిత్రాన్ని ఏఎన్నార్ గారి బర్త్ డేకి రిలీజ్ చేయలేదు. కొన్ని వారాలు ఆలస్యంగా రిలీజ్ చేశాం. కానీ మూవీ సూపర్ డూపర్ హిట్ అయినట్లు తమ్మారెడ్డి పేర్కొన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anumana Pakshi Movie Review: అనుమాన పక్షి మూవీ రివ్యూ, రాగ్‌ మయూర్‌ ఇలా చేశాడేంటి?
Recommended image2
హాయ్ చెప్పడమే తప్పైందా? ఇంట్లో వాళ్లు చూసిన పెళ్లి వద్దని పారిపోయిన జంట కథ
Recommended image3
Rajinikanth: అతని పేరు చెప్పగానే భయంతో వణికిపోయిన రజినీకాంత్, చేతిలో సిగరెట్ పడేసి ఏం చేశాడంటే? తనికెళ్ల భరణి చెప్పిన సీక్రెట్..
Related Stories
Recommended image1
Movie Copied Scenes: బ్లాక్ బస్టర్ సినిమాల్లో అదిరిపోయే సీన్లు..మొత్తం కాపీ చేసినవే, ఎక్కడ నుంచి లేపేశారంటే
Recommended image2
Roja Selvamani: పరంజ్యోతి ఎపిసోడ్ మొత్తం ఫేకా ? నాకు బాగా ఉపయోగపడింది, నిజాలు బయటపెట్టిన రోజా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved