MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Comedian Satya: ఆ సినిమా దర్శకుడి పేరును తన కూతురికి పెట్టుకున్న కమెడియన్ సత్య

Comedian Satya: ఆ సినిమా దర్శకుడి పేరును తన కూతురికి పెట్టుకున్న కమెడియన్ సత్య

Comedian Satya: సినిమా రంగంలో ఎదగాలంటే అదృష్టం ఉండాలి. అలా తనకి మంచి రోల్ ఇచ్చి సినీ ఇండస్ట్రీలో నిలబడేలా చేసిన దర్శకుడు పేరును తన కూతురికి పెట్టుకున్నాడు కమెడియన్ సత్య. ఆ సినిమా ఏది? ఆ దర్శకుడు ఎవరు? ఆ పేరేంటో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 08 2026, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆ సినిమాలో అవకాశం
Image Credit : Clap Entertainment

ఆ సినిమాలో అవకాశం

సినీ ప్రయాణాన్ని చిన్న చిన్న పాత్రలతోనే మొదలుపెట్టాడు కమెడియన్ సత్య. సినీ రంగంలో ఎదగడానికి అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలోనే అతనికి మంచి మూవీ అవకాశం వచ్చింది. అదే ‘స్వామి రారా’ ఈ సినిమాలో హీరో నిఖిల్ ఫ్రెండ్ పాత్రలో సత్య నటించాడు. అందులో కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఆ మూవీ తర్వాత ఆయనకు వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కొద్ది కాలంలోనే కమెడియన్ గా చాలా బిజీ అయిపోయాడు. దీనంతటికీ కారణం స్వామి రారా సినిమా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆ దర్శకుడిపై గౌరవం
Image Credit : Clap Entertainment

ఆ దర్శకుడిపై గౌరవం

స్వామి రారా దర్శకుడు సుధీర్ వర్మ తనకు అవకాశం ఇవ్వడం వల్లే తన కెరీర్ ఇంత బిజీగా మారిందని, తనకంటూ గుర్తింపు వచ్చిందని సత్యా ఎప్పటికీ చెబుతూ ఉంటాడు. సినీ రంగంలో ఎదగడానికి తొలి అవకాశం ఇచ్చిన వాళ్లను కొందరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కొందరు మాటల్లో కృతజ్ఞతలు చెబితే.. మరికొందరు చేతల్లో చూపిస్తారు. ఇప్పుడు కమెడియన్ సత్య చేసిన పని కూడా అలాంటిదే. తన కెరీర్ ను మార్చిన దర్శకుడు పై తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. తన కూతురికి సుధీర్ వర్మ పేరునే పెట్టాడు.

Related Articles

Related image1
DJ sounds: డీజే శబ్దాలు వింటే జంతువులకు గుండెపోటు వస్తుందా? ఈ కోళ్లు అందుకే మరణించాయా?
Related image2
Venus Transit: శుక్రుడి సంచారం ఈ 4 రాశులకు బాగా కలిసొస్తుంది, చేతిలో డబ్బు నిలుస్తుంది
34
కమెడియన్ సత్య కూతురి పేరు
Image Credit : Clap Entertainment

కమెడియన్ సత్య కూతురి పేరు

కమెడియన్ సత్యా కొత్త సినిమా జెట్లీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్య ఈ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. యాంకర్ సుమ మీ కుటుంబం గురించి అడగమని చెప్పినప్పుడు తనకు భార్యా, ఒక కూతురు ఉందని చెప్పాడు. కూతురి పేరు సుధీర అని చెప్పాడు. ఆ పేరు ఎందుకు పెట్టాడో కూడా వివరించాడు. తనకు సినిమా చివరి వరకు సాగేలా పెద్ద పాత్రను ఇచ్చి తన జీవితాన్నే మార్చిన దర్శకుడు సుధీర్ వర్మ అని చెపపాడు. అతనిపై ఉన్న ప్రేమ, గౌరవంతోనే తన కూతురికి సుధీర అని పేరు పెట్టినట్లు వివరించాడు.

44
కొడుకు పేరు ఏమిటి?
Image Credit : Clap Entertainment

కొడుకు పేరు ఏమిటి?

ఇక సత్య కెరీర్లో మత్తు వదలరా, మత్తు వదలరా 2.. రెండు సినిమాలు కూడా స్టార్ కమెడియన్ గా మార్చాయి. అవి కూడా సత్యకు ఫుల్ లెన్త్ రోల్ ఉన్న సినిమాలే. ఈ సినిమాల దర్శకుడు రితేష్ రాణా. అదే దర్శకుడు ఇప్పుడు జెట్లీ సినిమాలో సత్యాను హీరోగా చేశాడు. ఈ సందర్భంగా రితేష్ రాణా మాట్లాడుతూ నీకు కొడుకు పుడితే నా పేరు పెడతావా అని అడిగాడు. దీనికి సత్య నవ్వుతూ కచ్చితంగా వేరే పెడతా అని సమాధానం ఇచ్చాడు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Recommended image2
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Recommended image3
CM Vijay: కోట్ సూట్ నుంచి పట్టు పంచెలోకి సీఎం విజయ్...అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఆ ఈవెంట్ కి హాజరు
Related Stories
Recommended image1
DJ sounds: డీజే శబ్దాలు వింటే జంతువులకు గుండెపోటు వస్తుందా? ఈ కోళ్లు అందుకే మరణించాయా?
Recommended image2
Venus Transit: శుక్రుడి సంచారం ఈ 4 రాశులకు బాగా కలిసొస్తుంది, చేతిలో డబ్బు నిలుస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved