MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • DJ sounds: డీజే శబ్దాలు వింటే జంతువులకు గుండెపోటు వస్తుందా? ఈ కోళ్లు అందుకే మరణించాయా?

DJ sounds: డీజే శబ్దాలు వింటే జంతువులకు గుండెపోటు వస్తుందా? ఈ కోళ్లు అందుకే మరణించాయా?

DJ sounds: ఉత్తరప్రదేశ్లో జరిగిన విచిత్ర ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. భారీని సౌండ్ తో వచ్చే డీజే వల్ల జంతువులకు గుండెపోటు వస్తుందా? అనే సందేహం ఎంతో మందిలో కలిగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 07 2026, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డీజే శబ్ధాలతో కోళ్లు మరణం
Image Credit : Chat gpt

డీజే శబ్ధాలతో కోళ్లు మరణం

ఉత్తరప్రదేశ్లో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. భారీ సౌండ్ తో డీజే పెట్టి ఆ ఊరేగింపును తీసుకెళ్లారు. సుల్తాన్ పూర్ జిల్లాలోని స్థానిక పౌల్ట్రీ ఫారం పక్కనుంచే ఈ డీజే వెళ్ళింది. రాత్రిపూట జరిగిన ఈ ఘటనలో ఆ డీజే శబ్దాలకు కోళ్లు మరణించాయని ఆ కోళ్ల ఫారం యజమాని చెప్పాడు. ఆ సౌండ్ విన్న వెంటనే కోళ్లు ఒక్కసారిగా భయపడిపోయాయని, కొద్దిసేపటికి ఒకదాని తర్వాత ఒకటి మరణించడం మొదలైందని వివరించాడు. ఈ విషయం తెలిసి స్థానికులు కూడా చాలా షాక్ అయ్యారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తీవ్ర భయంతో షాక్
Image Credit : Getty

తీవ్ర భయంతో షాక్

ఆ పౌల్ట్రీ యజమాని చెప్పిన వివరాల ప్రకారం రాత్రి 9:30 గంటల సమయంలో డీజే వాహనం ఫారం దగ్గరికి వచ్చి ఆగింది. కనీసం ఒక పది నిమిషాలు పాటు భారీ సౌండ్స్ తో పాటలు ప్లే చేశారు. డీజే శబ్దం చాలా తీవ్రంగా ఉండడంతో కోళ్లు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యాయి. గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయి. మొదట తనకు ఏం జరిగిందో అర్థం కాలేదని కొద్ది నిమిషాల్లోనే పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడం చూసి.. వెటర్నరీ డాక్టర్ ను పిలిపించాలని చెప్పారు. ఆ డాక్టర్ తీవ్రమైన భయంతో కోళ్లకు షాక్ తగిలి ఉండొచ్చని చెప్పినట్టు వివరించాడు కోళ్ల ఫారం యజమాని.

34
జంతువులకు గుండెపోటు వస్తుందా?
Image Credit : Getty

జంతువులకు గుండెపోటు వస్తుందా?

ఈ ఘటన జరిగిన తర్వాత ఎంతోమందిలో ఒక ప్రశ్న మొదలైంది. ఇలాంటి పెద్ద శబ్దాల వల్ల జంతువులకు గుండెపోటు వచ్చి మరణించే అవకాశం ఉందా? అని. నిపుణులు చెబుతున్న ప్రకారం పక్షులు, చిన్న జంతువులు పెద్ద శబ్ధాలకు చాలా సున్నితంగా స్పందిస్తాయి. ముఖ్యంగా ఒక్కసారిగా భారీ సౌండ్ వస్తే వాటి గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, భయంతో కలిగే షాక్ వంటి సమస్యలు రావచ్చని వెటర్నరీ డాక్టర్లు వివరిస్తున్నారు. కొన్నిసార్లు తీవ్రమైన భయం వల్ల గుండె ఆగిపోవడం కూడా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా పౌల్ట్రీ ఫారాల్లో వందల సంఖ్యలో కోళ్లు ఒకే చోట ఉంటాయి. ఒక్కటి భయపడితే మిగతావి కూడా భయపడుతూ ఉంటాయి. దీనివల్ల ప్రమాదం పెద్ద స్థాయిలో జరిగే అవకాశం ఉంటుంది.

44
డీజే సౌండ్లకు ఒక హద్దు
Image Credit : Getty

డీజే సౌండ్లకు ఒక హద్దు

ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. డిజె సౌండ్ హద్దులు దాటడం వల్లే కోళ్లకు గుండెపోటు వచ్చి ఉంటుందని ఎక్కువ మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పెళ్లిళ్ల ఊరేగింపుల్లో వచ్చే అధిక శబ్దం మనుషులకే కాదు జంతువులకు గుండెపై కూడా ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. రాత్రివేళలో భారీగా డీజేలు పెట్టడంపై కఠిన నియంత్రణలో పెట్టాలని కోరుతున్నారు. అయితే ఈ ఘటనలో డీజే శబ్ధమే కోళ్ల మృతికి కారణమా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే విషయంపై అయితే పూర్తి విచారణ జరిగాకే స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image3
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Related Stories
Recommended image1
Isha Ambani: 400 ఏళ్లనాటి నిజాం నగలతో ఈషా అంబానీ బ్లవుజు తయారీ, వాటి ధర తెలిస్తే అవాక్కవుతారు
Recommended image2
Mercury Transit: ఈ 4 రాశులవారి జీవితాన్ని మార్చేయబోతున్న బుధుడు, రాహు నక్షత్రంలోకి ప్రవేశం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved