MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగా ఫ్యామిలీలో కోల్డ్ వార్... పెద్దన్న చిరంజీవిని టార్గెట్ చేసిన తమ్ముళ్లు, మేనల్లుడు?

మెగా ఫ్యామిలీలో కోల్డ్ వార్... పెద్దన్న చిరంజీవిని టార్గెట్ చేసిన తమ్ముళ్లు, మేనల్లుడు?

మెగా ఫ్యామిలీలో మంటలు చెలరేగాయా? చాపకింద నీరులా విద్వేషాలు వ్యాపిస్తున్నాయా? రాజకీయం కోసం, ఆధిపత్యం కోసం గ్రూప్స్ గా విడిపోయారా?... అనే సందేహాలు మొదలయ్యాయి. కొన్ని సోషల్ మీడియా పోస్ట్స్ ఆ అనుమానాలకు బీజం వేశాయి. 

3 Min read
Sambi Reddy
Published : Aug 13 2022, 09:52 AM IST| Updated : Aug 13 2022, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
chiranjeevi

chiranjeevi

మెగా ఫ్యామిలీలో మనస్పర్థలు, వివాదాలు కొత్తేమీ కాదు. ఆర్ధిక, రాజకీయ కారణాలతో మెగా బ్రదర్స్ కి చిన్న చిన్న గొడవలు జరిగాయి. అభిప్రాయ బేధాలు చోటు చేసుకున్నాయి. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని పవన్ తప్పుబట్టారు. అన్న అని కూడా చూడకుండా బహిరంగ విమర్శలు చేశాడు. తమ్ముడు ఆరోపణలను చిరంజీవి సున్నితంగా ఖండించారు. పవన్ కి ఆవేశం ఎక్కువ, అవగాహన తక్కువంటూ... నవ్వుతూ మీడియా ప్రశ్నలకు చిరు సమాధానం చెప్పారు.

210


అలాగే ఆరెంజ్ మూవీ నిర్మాతగా మొత్తం కోల్పోయిన నాగబాబుని చిరంజీవి ఆదుకోలేదనే వాదన ఉంది. అప్పుల్లో కూరుకుపోయిన నాగబాబుకు తమ్ముడు పవన్ కొంతలో కొంత సహాయం చేశాడట. పవన్ తనకు ఆర్థిక సహాయం చేసినట్లు నాగబాబు స్వయంగా ఒకటి రెండు సందర్భాల్లో తెలియజేశాడు. 
 

310
Pawan Kalyan Chiranjeevi

Pawan Kalyan Chiranjeevi

ఆలోచనా విధానంలో కూడా చిరంజీవి... తమ్ముళ్లు పవన్, నాగబాబుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. అన్న జీవితం ఇచ్చాడనే కృతజ్ఞతా భావం ఎక్కడో గుండె లోతుల్లో ఉన్నప్పటికీ... అయిష్టం అనే నెగిటివ్ ఫీలింగ్ తమ్ముళ్లలో బలంగా ఉంది. అది అప్పుడప్పుడు పరోక్షంగా బయటకు వస్తూ ఉంటుంది. రాజకీయ వేదికలపై పవన్ తనని ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా చెప్పుకోవడం దీనికి నిదర్శనం. తనకంటూ ఓ స్టార్ డమ్ వచ్చాక తాను చిరంజీవి అనే వటవృక్షం క్రింద ఎదిగినవాడిగా ఒప్పుకోవడానికి పవన్ ఇష్టపడం లేదు.

410

ఇక తన రాజకీయ ప్రత్యర్థులతో చిరంజీవి సన్నిహితంగా ఉండటం పవన్, నాగబాబులకు అసలు నచ్చడం లేదు. జనసేన పార్టీ బలం కాపు సామాజిక వర్గం. రాష్ట్రంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన ఆ సామాజిక వర్గం అండగా ఉంటుందనే ఆశల పునాదిపై కట్టిన పార్టీ. కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటి పైకి తేవడం ద్వారా ఏపీ రాజకీయాల్లో నిర్ణయాత్మకంగా ఎదగాలనేది పవన్ కల, ఆకాంక్ష.

510

ఆ క్రమంలో ఈ మధ్య చేగువేరా సిద్ధాంతాలు పక్కనపెట్టి... కుల ఫీలింగ్ గురించి ఓపెన్ అయ్యారు. కనీసం క్యాస్ట్ ఫీలింగ్ తో అయినా జనసేనకు మద్దతు ఇవ్వాలని కోరాడు. జనసేన డై హార్డ్ ఫ్యాన్స్ ని విస్మయానికి గురి చేసిన వ్యాఖ్యలు అవి. కాపు సామాజిక వర్గాన్ని జనసేన వైపు తిప్పుకోవాలని పవన్, నాగబాబు ఇన్ని తంటాలు పడుతుంటే.. అన్న చిరంజీవి జగన్ తో దోస్తీ చేస్తున్నాడు. కీలక వేదికలపై కలిసి కూర్చుంటున్నాడు.

610


ఇది జనసేన వర్గాలకు నిద్రలేకుండా చేస్తున్న పరిణామం. చిరంజీవి కారణంగా జగన్ కి కాపుల్లో మరింత మద్దతు పెరగొచ్చని వాళ్ళ భయం. జగన్ చిరంజీవి పై చూపించే సోదరభావం ఎవడికి కావాలీ... అక్కరకు రాని సోదరభావం ఎందుకని? పవన్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో అసహనం ప్రదర్శించిన విషయం తెలిసిందే. 

710


ఇదిలా ఉంటే ఓ వారం రోజులుగా నాగబాబు సోషల్ మీడియా పోస్ట్స్ కాకరేపుతున్నాయి. నేను అంత తేలిగ్గా ఎవడినీ వదులుకోను... వదులుకున్నానంటే వాడికంటే వెధవ ప్రపంచంలో ఉండడు అంటూ ఓ పోస్ట్ చేశాడు. ఇది సన్నిహితులను ఉద్దేశించి చేసిన కామెంట్ అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక తాజా పోస్ట్ లో మరింత ఘాటైన కామెంట్ చేశాడు. 

810


మంచి వాడు శత్రువులకు కూడా సాయం చేస్తాడు. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు. మంచి వాళ్ళను దూరం చేసుకుంటే ముంచే వాళ్ళు దగ్గరవుతారని.. ఓ సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. ఇక్కడ తోడబుట్టిన వాళ్ళను ముంచుతున్న ఆ అన్న ఎవరనేది పెద్ద చర్చగా మారింది. జనసేనకు దూరంగా ఉంటున్న చిరంజీవిని ఉద్దేశించే నాగబాబు ఈ కామెంట్ చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాగబాబు పోస్ట్ క్రింద కామెంట్స్ చూస్తే అర్థం అవుతుంది. 
 

910


నాగబాబు తన అన్న చిరంజీవి టార్గెట్ గా ఈ కామెంట్స్ చేశారని... అన్నదమ్ముల  మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అంటున్నారు. అదే సందర్భంలో జనసేన పార్టీలో తనకు సముచిత స్థానం ఇవ్వడం లేదని పవన్ ని విమర్శిస్తూ నాగబాబు ఈ కామెంట్ చేశారనే మరో కోణం తెరపైకి వస్తుంది. అలాగే అల్లు అర్జున్ తాత అల్లు రామలింగయ్యను తలచుకుంటూ... ఓ పోస్ట్ పెట్టారు. 'మా పునాది' అని కామెంట్ చేశాడు. 
 

1010

తన ఎదుగుదలకు, స్టార్ డమ్ కి  తాతయ్యే కారణమన్నట్లు అల్లు అర్జున్ పోస్ట్ ఉంది. దీనిపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. AA  అంటూ సపరేట్ ఇమేజ్, ఫ్యాన్ బేస్ కోరుకుంటున్న అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగానే ఈ పోస్ట్ చేశారని అంటున్నారు. అల్లు అర్జున్ మెగా హీరో ఇమేజ్ వద్దంటున్నారు. అటు నాగబాబు, ఇటు అల్లు అర్జున్ సోషల్ మీడియా పోస్ట్స్ ఆధారంగా మెగా ఫ్యామిలీలో విబేధాలు రగులుకున్నాయని కొందరు అంచనా వేస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved