MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Brahmamudi: నిజం తెలుసుకొని షాకైన సీతారామయ్య దంపతులు.. అపర్ణకి చివాట్లు పెడుతున్న చిట్టి!

Brahmamudi: నిజం తెలుసుకొని షాకైన సీతారామయ్య దంపతులు.. అపర్ణకి చివాట్లు పెడుతున్న చిట్టి!

Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి మంచి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదిస్తుంది. ఇష్టం లేకపోయినా దంపతులైన ఇద్దరు శత్రువుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : Mar 30 2023, 12:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఎపిసోడ్ ప్రారంభంలో ఏం జరిగిందో నిజం చెప్పు నువ్వు ఏం జరగలేదు అన్నా ఎక్కడ నమ్మే వాళ్ళు ఎవరు లేరు అంటుంది రుద్రాణి. నిజంగానే ఏమీ జరగలేదు అత్త అంటాడు రాజ్. నువ్వు చేసింది పాపమో,నేరమో కాదు ఇది సృష్టి ధర్మం తను నీ గదికి వచ్చినా, నువ్వు తన గదికి వెళ్లినా తను నీ భార్య కాబట్టి తప్పులేదు నిజం చెప్పు అంటుంది రుద్రాణి. ఆ పిల్ల అంటే ఇష్టం లేదు అన్నవాడివి తెల్లవారిసరికి ఆ గది నుంచి ఎందుకు బయటకు వచ్చావు అంటూ నిలదీస్తుంది అపర్ణ. అదే నాకు అర్థం కావడం లేదు అంటాడు రాజ్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అంతలోనే పూజ చేసుకొని వస్తున్న కావ్యని ఆపి రాత్రి ఏం జరిగింది అని అడుగుతుంది రుద్రాణి. తాగి నా గదిలోకి వచ్చారు అంటే తన గురించి అందరూ తప్పుగా అనుకుంటారు అనుకుని  నాకేమీ తెలియదు అంటుంది కావ్య. ఇద్దరికిద్దరూ తోడుదొంగలు ఏమీ తెలియనట్లుగా భలే నటిస్తున్నారు అంటుంది చిట్టి. ఏమి తెలియక పోవడం ఏంటి దొంగ పెళ్లి చేసుకున్న పిల్ల ఎంతకైనా తెగించగలదు అంటుంది అపర్ణ. మీరు రాత్రి నా గదికి గడియ వేసి వెళ్లారు కదా నేను బయటికి ఎలా రాగాలను అంటూ అందరి ముందు నిజం చెప్పేస్తుంది కావ్య. తనని గదిలో బంధించావా అంటూ ఆశ్చర్యపోతారు సీతారామయ్య దంపతులు.

38

ఇంత నీచమైన పని చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది అడిగేవాళ్లు లేరు అనుకుంటున్నావా అంటూ కోడల్ని మందలిస్తుంది చిట్టి. ఇంతలో అక్కడికి వచ్చిన కళ్యాణ్ ఏం జరిగిందో నాకు తెలుసు అంటాడు. ఏం జరిగింది అంటూ అందరూ కంగారుగా అడుగుతారు. రాత్రి తాగి అన్నయ్య వదిన గదికి వెళ్ళాడు. నేను ఆపబోతే  నా పెళ్ళాం నా ఇష్టం అన్నాడు అంటూ జరిగిందంతా చెప్తాడు. శోభనం చెడగొట్టరా అంటే దగ్గరుండి జరిపించుకొచ్చాడు అంటూ కొడుకుని మనసులోనే తిట్టుకుంటుంది రుద్రాణి. నిజంగానే అక్కడ ఏదో జరిగిపోయింది అనుకొని కోపంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. 

48

మన ఇంటికి వచ్చిన అమ్మాయి పట్ల అనుచితంగా ప్రవర్తించారు నువ్వు, మీ అమ్మ అందుకని తనకి క్షమాపణ చెప్పు అంటాడు సీతారామయ్య. ఈ విషయంలో మనస్ఫూర్తిగానే నీకు సారీ చెప్తున్నాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజ్. మరోవైపు రాశి ఫలాలు చూసుకుంటున్న మీనాక్షికి అనుకోని గండం ఎదురవుతుంది అని రాసి ఉండటం చూసి కంగారు పడుతుంది. అంతలోనే వచ్చిన కనకాన్ని చూసి గండం అంటే ఏంటో అనుకున్నాను  మరి ఇలాంటి గండం అనుకోలేదు అంటుంది మీనాక్షి.
 

58

పొగిడింది చాల్లేగాని గుడికి వెళ్దాం పద అంటుంది కనకం. ఎందుకు అక్కడికి నీ కూతురు వస్తుందా మళ్ళీ నా చేత ఏదైనా వేషం వేస్తావా అంటూ కంగారుపడుతుంది మీనాక్షి. అలాంటిదేమీ లేదు మనసు ప్రశాంతంగా లేదు కావ్య జీవితాన్ని నా చేతులతోనే నాశనం చేశానేమో అని  మనసు పీకుతుంది. నా జీవితం అసలు జీవితం లాగే లేదు అంటూ దిగులు పడుతుంది కనకం. దిగులు పెట్టుకోవద్దు అంటూ చెల్లెల్ని ఓదారుస్తుంది మీనాక్షి. ఇద్దరూ గుడికి బయలుదేరుతారు. మరోవైపు ముభావంగా ఉన్న తల్లి దగ్గరికి వచ్చి ఎక్స్ప్లనేషన్ ఇవ్వటానికి ప్రయత్నిస్తాడు రాజ్.

68

నాకేమీ చెప్పొద్దు నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసావు. అయినా బాధ కలిగితే మందు వైపే చూడాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది. అలా చేయటం వలన సమస్య రెట్టింపు అయింది కానీ సమస్య తీరలేదు అంటూ కొడుకుని మందలిస్తుంది అపర్ణ. రాహుల్ నా చేత బలవంతంగా తాగించాడు అని చెప్తే అమ్మ వాడిని ఇంట్లోకి కూడా రానివ్వదు నన్ను నిరూపించుకోవడం కోసం వాడిని బ్యాడ్ చేయడం పద్ధతి కాదు అనుకుంటాడు రాజ్. నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు భార్య అని ఒప్పుకోవాల్సి వస్తుంది.

78

నేను కోడలుగా అంగీకరించవలసి వస్తుంది అదే జరిగితే నాలో ఉన్న మరో కోణాన్ని చూస్తుంది ఆ అమ్మాయి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. మరోవైపు ఒంటరిగా కూర్చుని బొమ్మలు వేసుకుంటున్న కావ్య దగ్గరికి వస్తాడు రాజ్. పదిమంది మధ్యలోనూ ఏం జరిగిందో చెప్పలేదు కానీ ఒంటరిగా ఉంది కాబట్టి అడిగితే నిజం చెప్తుంది  అనుకుంటాడు.రాజ్ ని చూసిన కావ్య పెద్దగా పట్టించుకోదు. ఆ నిర్లక్ష్యాన్ని భరించలేక పోతాడు రాజ్.

88

ఈ పొగరుని ఎలాగ భరించడం అనుకుంటూ వెళ్ళిపోబోతుంటే  వచ్చిన విషయం చెప్పకుండా మీలో మీరే మాట్లాడుకుంటే నాకేం అర్థం అవుతుంది అంటుంది కావ్య. తరువాయి భాగంలో నూతన దంపతులు చేత ముడుపు కట్టించాలి అంటాడు సీతారామయ్య. అలా జరగటానికి వీల్లేదు అంటూ కోపంతో అరుస్తాడు రాజ్. పెళ్లి ఎలాగూ బలవంతం చేశారు ఈ విషయంలోనైనా వాడిని బలవంత పెట్టకండి అంటుంది అపర్ణ. ఇంక చాల్లే ఆపు అంటూ కోడలి మీద కేకలు వేస్తుంది చిట్టి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved