- Home
- Entertainment
- Ennenno Janamala Bandam: నీకు ప్రేమలేఖలు రాస్తానని జన్మలో అనుకోకు అంటూ వేదకు క్లాస్ పీకిన యష్!
Ennenno Janamala Bandam: నీకు ప్రేమలేఖలు రాస్తానని జన్మలో అనుకోకు అంటూ వేదకు క్లాస్ పీకిన యష్!
Ennenno Janamala Bandam: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janamala Bandam) సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈరోజు మే 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే యష్ (Yash) అన్నం తినుకుంటూ ఖుషి కి హాయ్ చెబుతాడు. ఇక అటుగా ఉన్న వేద యష్ నాకే హాయ్ చెబుతున్నాడా అని ఆలోచిస్తుంది. ఇక టిఫిన్ చేసావా అని అడుగుతున్నాడు నన్నేనా అని కన్ఫ్యూజ్ అవుతుంది. అదే క్రమంలో యష్ ఖుషి (Khushi) కి ఒక ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తాడు.
దాంతో వేద (Vedha) ఆ కిస్ తనకే ఇస్తున్నట్టు ఫీల్ అయ్యి.. ఈరోజు ఇతనకు ఎదో అయ్యింది అని భయపడుతుంది. ఇక వేద మనం స్ట్రిట్ గా ఉండాలి అని అనుకుంటుంది. ఇక యష్ (Yash) బయటకి వెళుతూ పైన మేడ పైన ఉన్న నిధి కి బై చెబుతాడు. ఇక వేద అదికూడా తనకే చెబుతున్నాడు అని అనుకుంటుంది.
ఆ తర్వాత నిధి (Nidhi) వసంత్ దగ్గరకి వచ్చి పదా మనం సరదాగా సిటీ అంతా ఒక రౌండ్ వేసి వద్దాం అని అని తీసుకువెళుతుంది. అది చూసిన చిత్ర ఎంతో జలసీ గా ఫీల్ అవుతుంది. ఈ చిత్ర అంటే ఏమిటో నీకు చూపిస్తాను అని అనుకుంటుంది. మరోవైపు వేద (Vedha) యష్ గురించి ఆలోచించుకుంటూ నా వరకు నేను స్ట్రాంగ్ గానే ఉండాలి అని అనుకుంటుంది.
ఆ తరువాత వసంత్ (Vasanth) రాసిన లెటర్ వేద యష్ కి చూపిస్తుంది. వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోండి అని వేద అడుగుతుంది. యష్ (Yash) ప్రేమ లేదు దోమ లేదు అని అంటాడు. ఇక ఇప్పుడే ఈ మేటర్ తెల్చేస్తాను అని అంటాడు.
ఇక తరువాయి భాగం లో యష్ (Yash) ఖుషి ఇస్ మై డాటర్ అని అంటాడు. అంతేకాకుండా ఖుషి లేకుండా నువ్వు నా భార్య కూడా కాదు అన్నట్లుగా యష్ వేదను అంటాడు. వేద (Vedha) కూడా కేవలం నేను ఖుషి కోసమే నేను భార్యగా ఉన్నాను అని అంటుంది.