MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • చిరంజీవి రిటైర్మెంట్ తరువాత ఎక్కడ ఉండబోతున్నారు? మెగాస్టార్ మెచ్చిన సిటీ ఏదో తెలుసా?

చిరంజీవి రిటైర్మెంట్ తరువాత ఎక్కడ ఉండబోతున్నారు? మెగాస్టార్ మెచ్చిన సిటీ ఏదో తెలుసా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఒక ఊరు బాగా నచ్చింది. అక్కడి జనాలు బాగా నచ్చారు.. వాతావరణం ఇంకా బాగా నచ్చింది. ఒక వేళ రిటైర్మెంట్ ప్రకటిస్తే .. అక్కడే సెటిల్ అయిపోవాలని కూడా అనుకుంటున్నారట మెగాస్టార్. ఇంతకీ ఆ ఊరేది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 17 2026, 07:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
70 ఏళ్ల వయసులో కూడా తగ్గేదేలే..
Image Credit : Asianet News

70 ఏళ్ల వయసులో కూడా తగ్గేదేలే..

మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. కుర్ర హీరోలు కూడా కుళ్లుకునే విధంగా సినిమాలు చేస్తూ.. ఫిట్ లో పోటీపడుతూ.. దూసుకుపోతున్నారు. ఈ ఏజ్ లో చాలామంది స్టార్స్ హీరోలుగాద రిటైర్ అయినవారు ఉన్నారు. లేదా క్యారెక్టర్ రోల్స్ చేసుకునేవాళ్లు ఉన్నారు. కానీ ఇప్పటికీ తన హీరో ఇమేజ్ ను అలాగే కాపాడుకుంటూ... దూసుకుపోతున్నారు చిరు. ఫిట్ నెస్ కోసం డైట్ ఫాలో అవుతూ.. ప్రత్యేకమైన వర్కౌట్స్ తో స్లిమ్ గా మెయింటేన్ చేస్తున్నారు చిరంజీవి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సంక్రాంతి హిట్ అందుకున్న మెగాస్టార్..
Image Credit : instagram

సంక్రాంతి హిట్ అందుకున్న మెగాస్టార్..

ఇక గత కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్ చూసిన చిరంజీవికి.. ఈ ఏడాది శుభారంభం దక్కింది. మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగాస్టార్. ఈ సినిమాలో చిరంజీవినిచాలా కొత్తగా చూపించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. 

కంప్లీట్ గా వెయిట్ తగ్గిపోయి, ఫిట్ గా.. యంగ్ లుక్ లో ఉన్న చిరంజీవిని అభిమానులకు చూపించాడు అనిల్. అంతే కాదు అప్పటి ఎనర్జీని మళ్లీ తిరిగి తీసుకొచ్చాడు. ఈసినిమాలో చిరంజీవి పెర్ఫామెన్స్ కూడా మామూలుగా లేదు. కామెడీ టైమింగ్, యాక్షన్, ఎమోషన్ తో అదరగొట్టాడు మోగాస్టార్. అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమాను అందించాడు.

35
మెగాస్టార్ రిటైర్మెంట్ తరువాత..?
Image Credit : youtube/@Shinescreenscinema

మెగాస్టార్ రిటైర్మెంట్ తరువాత..?

చిరంజీవి ఈ ఏజ్ లో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పట్లో ఆయన రిటైర్ అయ్యే అవకాశం లేదు. కానీ ఒక వేళ.. ముందు ముందు రిటైర్మెంట్ ఆలోచన వచ్చినా..హ్యాపీగా లైఫ్ ను పీస్ ఫుల్ గా గడపాలి అనుకుంటే చిరంజీవి ఎక్కుడ ఉండాలనుకుంటున్నారో తెలుసా? ఆయనకు బాగా ఇష్టమైన ప్రదేశం ఏది? ప్రశాంతంగా అక్కడ ఒక ఇల్లు కట్టుకుని , నేచర్ ను ఆస్వాదిస్తూ.. హ్యాపీగా గడిపేయాలి అని స్టార్ సీనియర్ హీరో అనుకుంటున్నారని తెలుసా? ఇంతకీ ఆ ఊరు ఏదో కాదు విశాఖ పట్నం. అవును ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించారు.

45
చిరంజీవికి చాలా ఇష్టమైన నగరం..
Image Credit : Youtube/@GoldBoxEnt

చిరంజీవికి చాలా ఇష్టమైన నగరం..

మెగాస్టార్ చిరంజీవి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. '' విశాఖ పట్నం అందమైన తీర ప్రాంతం చూస్తుంటే.. సాగర తీరాన అంటూ ఛాలెంజ్ లో సాంగ్ గుర్తుకు వస్తుంది. యూరేకా సాకా మికా అంటూ అభిలాషలో సాంగ్, ఘరానా మొడులు సినిమాలో బంగారు కోడి పెట్ట సాంగ్ కూడా గుర్తుకు వస్తుంది.. ఇలా ఆ టైమ్ లో ఇక్కడ షూట్ చేసిన పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. 

ఆ టైమ్ లో 80 దశకంలో.. హీరో అవ్వాలి, పెద్ద స్టార్ అవ్వాలి అని ఎంతో ఉత్సాహంగా ఈ రిషి కొండ నుంచి.. ఆర్కే బీచ్, గంగవరం పోర్ట్ వరకూ చాలా సినిమాల షూటింగ్స్ ఇక్కడ జరిగాయి. ఆరకంగా విశాఖ పట్నంతో ఎంతో అనుబందం ఉంది. '' అని చిరంజీవి అన్నారు.

55
రిటైర్మెంట్ ప్రకటిస్తే ఇక్కడే ఉంటా..
Image Credit : X/@Shine_Screens

రిటైర్మెంట్ ప్రకటిస్తే ఇక్కడే ఉంటా..

మెగాస్టార్ చిరంజీవి రిటైర్మెంట్ అంటూ ఉంటే వైజాగ్ లో ఉండాలనే కోరికను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..'' విశాఖపట్నం అందమైన తీరం ఉన్న ప్రాంతమే కాదు.. అందమైన మనసున్న మనుషులు ఉన్న ఊరు. ఇక్కడి వారు చాలా చాలా ప్రేమ చూపిస్తుంటారు. 

ఇక్కడి మనుషులు శాంతి కాముకులు, అందుకే ఎన్నో సార్లు అన్నాను.. మళ్లీ మళ్లీ అంటున్నాను...సెకండ్ హోప్ ఉంటే.. రిటైర్మెంట్ అయిన తరువాత ప్రశాంతంగా ఉండాలి అంటే.. అది విశాఖ పట్నంలోనే అని తెలియజేసుకుంటున్నాను. '' అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. గతంలో చిరంజీవి మాట్లాడిన ఈ మాటలు ఈమధ్య మరోసారి వైరల్ అవుతున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష
Recommended image2
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image3
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Related Stories
Recommended image1
మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ స్వయంగా చెప్పిన పేరు ఎవరిది?
Recommended image2
పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఫస్ట్ పెళ్లి కార్డు ఎవరికి ఇచ్చారు? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved