- Home
- Entertainment
- మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ రివ్యూ.. సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవల్ అంతే, మెగా బ్లాక్ బస్టర్ పక్కా ?
మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ రివ్యూ.. సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవల్ అంతే, మెగా బ్లాక్ బస్టర్ పక్కా ?
Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు చిత్ర ప్రీమియర్ షోలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు బయటకి వచ్చాయి.

మన శంకర వరప్రసాద్ గారు మూవీ
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం మరికొన్ని గంటల్లోనే థియేటర్స్ లో సందడి చేయనుంది. ఆదివారం రాత్రి నుంచే మన శంకర వరప్రసాద్ గారు చిత్ర ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. దీనితో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రిలీజ్ కి ముందే మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఎలా ఉంది అనే సమాచారం బయటకి వచ్చింది.
మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ రివ్యూ
సంక్రాంతికి సరైన సినిమాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి ముందు నుంచి హైప్ ఉంది. అనిల్ రావిపూడి సింపుల్ కథలు తీసుకుని తన మార్క్ కామెడీ, వినోదం జోడించి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షిస్తారు. అనిల్ రావిపూడి సినిమాలో భార్య భర్తల గొడవలు ఫన్నీగా చూపించడం అనేది కామన్ గా ఉంటూ వస్తోంది. ఈ మూవీలో కూడా అనిల్ రావిపూడి అదే ఫార్ములా ఉపయోగించారు. చిరంజీవి, నయనతార భార్య భర్తలుగా నటిస్తున్నారు.
అనిల్ రావిపూడి మార్క్ కామెడీ
అందుతున్న సమాచారం, సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈసారి అనిల్ రావిపూడి ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం అనిల్ రావిపూడి స్టైల్ లో, మెగాస్టార్ చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్ తో సాగిపోతుంది. కానీ అసలైన కథ మొదలయ్యేది ఇంటర్వెల్ నుంచే అని చెబుతున్నారు. చిరంజీవి ఈ చిత్రంలో రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా నటిస్తున్నారు.
ఫస్ట్ హాఫ్ యావరేజ్
ఇంటర్వెల్ సీన్ నుంచి అసలు కథ మొదలవుతుంది. చిరంజీవి ఒక మిషన్ కోసం రంగంలోకి దిగుతారు. అక్కడి నుంచి మెగాస్టార్ స్టైల్ లో యాక్షన్ కూడా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతూ యావరేజ్ అన్నట్లుగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో చిరంజీవి యాక్షన్, కామెడీ అన్నీ పీక్స్ కి చేరుతాయి. చివరి 20 నిమిషాలలో విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇస్తారు. అక్కడి నుంచి అభిమానులు ఈ చిత్రం ఐఫీస్ట్ అన్నట్లుగా ఉంటుంది అని అంటున్నారు.
సంక్రాంతి విన్నర్
భీమ్స్ సంగీతం ఈ చిత్రాన్ని పెద్ద ప్లస్ పాయింట్ అని అంటున్నారు. నయనతార గ్లామర్ గా కనిపిస్తూ హోమ్లీ లుక్ లో అదరగొట్టారట. నయన్, చిరు మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి విపరీతంగా నాచేస్తాయి. సెకండ్ హాఫ్ ఒక రేంజ్ లో ఉంటుంది అని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా బావుంది అని, సంక్రాంతి విన్నర్ కావడం ఖాయం అని అంటున్నారు.

