- Home
- Entertainment
- రవితేజ చేతిలో చిత్తైపోయిన బాలకృష్ణ సంక్రాంతి సినిమాలు.. అభిమానులకు పీడకల, అవేం సినిమాలు బాబోయ్
రవితేజ చేతిలో చిత్తైపోయిన బాలకృష్ణ సంక్రాంతి సినిమాలు.. అభిమానులకు పీడకల, అవేం సినిమాలు బాబోయ్
సంక్రాంతి సీజన్ అంటే బాలయ్య పేరు ప్రధానంగా వినిపిస్తుంది. సంక్రాంతికి విడుదలైన బాలయ్య చాలా చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ రెండు సినిమాలు మాత్రం బాలయ్యకి మాత్రమే కాదు అభిమానులకు కూడా పీడకలగా నిలిచాయి.

సంక్రాంతి సందడి షురూ
రాజాసాబ్ మూవీ రిలీజ్ కావడంతో టాలీవడ్ లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇక వరుసగా సంక్రాంతి సినిమాలు రిలీజ్ అవుతాయి. చిరంజీవి, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో సంక్రాంతికి విడుదలైన సినిమాలని సినీ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. సంక్రాంతి అనగానే బాలయ్య గుర్తుకు వస్తాడు. సంక్రాంతి సీజన్ లో బాలయ్యకి ఎక్కువ విజయాలు ఉన్నాయి.
ఒక్క మగాడు
అదే సమయంలో డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. 2 సంక్రాంతి పండుగలు మాత్రం బాలకృష్ణకి పీడకల అనే చెప్పాలి. అందులో మొదటిది 2008. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన బాలయ్య చిత్రం ఒక్క మగాడు. బాలయ్య కెరీర్ లోనే అప్పటికి అత్యంత భారీ అంచనాలతో విడుదలైన చిత్రం ఇది.
కృష్ణ మూవీ
వరుస విజయాల దర్శకుడు, పైగా నందమూరి అభిమాని వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన సినిమా కావడంతో బాక్సాఫీస్ రికార్డులు ఖాయం అనుకున్నారు. అభిమానుల అంచనాలని పూర్తిగా తలక్రిందులు చేసిన చిత్రం ఇది. శంకర్ భారతీయుడు రేంజ్ లో తీయాలనుకుని వైవిఎస్ చౌదరి ఈ చిత్రాన్ని కిచిడీ చేసి పెట్టారు. తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఒక్క మగాడుతో పాటు సంక్రాంతికి విడుదలైన రవితేజ కృష్ణ చిత్రం సూపర్ హిట్ అయింది.
పరమవీర చక్ర
వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకుడు. 2011లో మరోసారి బాలకృష్ణ, రవితేజ సంక్రాంతికి పోటీ పడ్డారు. బాలకృష్ణ, దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన పరమవీరచక్ర చిత్రం దారుణమైన ఫ్లాప్ గా నిలిచింది. ఒక్క మగాడు, పరమవీర చక్ర చిత్రాలు నందమూరి అభిమానులకు పీడకల లాంటివి అనే చెప్పాలి.
మిరపకాయ్
ఈ చిత్రానికి పోటీగా విడుదలైన రవితేజ మిరపకాయ్ చిత్రం సూపర్ హిట్ అయింది. హరీష్ శంకర్ దర్శకుడు. జనవరి 13న విడుదలైన ఈ చిత్రం మాస్ ప్రియులని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు జనవరి 13 సెంటిమెంట్ తోనే రవితేజ తాను నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

