- Home
- Entertainment
- యుఎస్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్, మన శంకర వరప్రసాద్ గారు జోరు మాములుగా లేదుగా.. అది మాత్రం పక్కా
యుఎస్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్, మన శంకర వరప్రసాద్ గారు జోరు మాములుగా లేదుగా.. అది మాత్రం పక్కా
Mana Shankara Varaprasad Garu: యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో మన శంకర వరప్రసాద్ గారు చిత్రం దూసుకుపోతోంది. జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీ
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం హంగామా మొదలైంది. జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనితో ఏపీ, తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. యుఎస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో మెగాస్టార్ మూవీ జోరు చూపిస్తోంది. ఆ జోరు మాములుగా లేదు అనే చెప్పాలి.
టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి
జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ కానుండగా 11వ తేదీ రాత్రి నుంచే ప్రీమియర్ షోల హంగామా మొదలవుతుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఈ చిత్రానికి అనుమతి ఇచ్చాయి.
యుఎస్ అడ్వాన్స్ కలెక్షన్స్
ఇక యుఎస్ లో మన శంకర వరప్రసాద్ గారు చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రచ్చ చేస్తోంది. యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ చిత్రం ఇప్పటి వరకు 570977 డాలర్లు వసూలు చేసింది. టోటల్ నార్త్ అమెరికా మొత్తం కలుపుకుంటే అడ్వాన్స్ సేల్స్ 6 లక్షల డాలర్లకు పైగా ఉన్నాయి.
అది మాత్రం పక్కా
ఈ ట్రెండ్ చూస్తుంటే మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రీమియర్ షోలతోనే 1 మిలియన్ డాలర్లు రాబట్టడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఖైదీ నెంబర్ 150 తర్వాత ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబడుతున్న చిరంజీవి చిత్రం ఇదే.
నిర్మాతగా చిరు కుమార్తె
అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా,భీమ్స్ సంగీతం అందించారు. నయనతార హీరోయిన్. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని కలిసి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

