MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ANR: అక్కినేనిది నాగుపాము పగ, ఆ హీరోపై ప్రతీకారం.. ఏఎన్నార్‌ నిజస్వరూపం బయటపెట్టిన రైటర్‌

ANR: అక్కినేనిది నాగుపాము పగ, ఆ హీరోపై ప్రతీకారం.. ఏఎన్నార్‌ నిజస్వరూపం బయటపెట్టిన రైటర్‌

అక్కినేని నాగేశ్వరరావు ది నాగు పాము పగ అని తెలిపారు రైటర్‌ ఎస్వీ రామారావు. సూపర్‌ స్టార్‌ కృష్ణ, సారథి స్టూడియో వాళ్లు చేసిన పనికి ఆయన కక్ష పెంచుకున్నాడని వెల్లడించారు. మరి ఇంతకి ఏం జరిగిందంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 05 2026, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎన్టీఆర్‌ కి ధీటుగా ఎదిగిన ఏఎన్నార్‌
Image Credit : our own

ఎన్టీఆర్‌ కి ధీటుగా ఎదిగిన ఏఎన్నార్‌

అక్కినేని నాగేశ్వరరావు టాలీవుడ్‌ లో లెజెండరీ నటుడు. ఎన్టీఆర్‌కి ధీటుగా సినిమాలు చేసి మెప్పించారు. తనకంటూ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు. మైథలాజికల్‌ చిత్రాలతో ఎన్టీఆర్‌ దుమ్మురేపితే.. సోషల్‌ సినిమాలతో ఏఎన్నార్‌ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. అలుపెరగని బాటసారిగా రాణించారు. అయితే ఏఎన్నార్‌ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. వ్యాపారాల్లోనూ రాణించారు. ఆయన అన్నపూర్ణ స్టూడియోస్‌ని స్థాపించారు. ఇది ఇండియాలోనే పెద్ద స్టూడియోస్‌లో ఒకటిగా నిలిచింది. ఫిల్మ్ స్కూల్‌ని స్టార్ట్ చేశారు. సినిమాకి సంబంధించిన అన్ని పనులు తమ స్టూడియోలోనే కంప్లీట్‌ చేసుకునేలా ఈ స్టూడియోని తీర్చిదిద్దారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం వెనుక ఏఎన్నార్‌ పగ
Image Credit : Asianet News

అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం వెనుక ఏఎన్నార్‌ పగ

అయితే అక్కినేని నాగేశ్వరరావు ఈ స్టూడియో నిర్మాణం వెనుక పెద్ద కథే ఉంది. ఆయన ఒక విషయంలో తనకు అవమానం జరగడంతో.. పగతో ఈ స్టూడియోని నిర్మించారు. అటు హీరోపై పగ, మరోవైపు మరో స్టూడియోపై పగ. ఈ రెండు కలిపి అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి కారణమయ్యాయని చెప్పొచ్చు. మరి ఆ కథేంటో చూస్తే, ఏఎన్నార్‌ చేసిన `దేవదాస్‌` మూవీ సంచలనం విజయం సాధించింది. అది రీ రిలీజ్‌ చేసినా కూడా పెద్ద హిట్‌ అయ్యింది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ చిత్రకారుడు, రైటర్‌ ఎస్వీ రామారావు వెల్లడిస్తూ.. ఏఎన్నార్‌ ది నాగుపాము పగ అంటూ కామెంట్‌ చేశారు. అది ఎందుకో కూడా వివరించారు. మరి ఆయన ఏం చెప్పారంటే?

34
కృష్ణ దేవదాస్‌ కి పోటీగా ఏఎన్నార్‌ దేవదాస్‌ రిలీజ్‌
Image Credit : social media

కృష్ణ దేవదాస్‌ కి పోటీగా ఏఎన్నార్‌ దేవదాస్‌ రిలీజ్‌

ఏఎన్నార్‌ `దేవదాస్‌` వచ్చిన కొన్నాళ్లకి సూపర్‌ స్టార్‌ కృష్ణ అదే పేరుతో, అదే కథతో మరో `దేవదాస్‌` మూవీ రూపొందించారు. తనే నటించాడు. ఈ సినిమా రిలీజ్‌ టైమ్‌లో ఏఎన్నార్‌ అమెరికాలో ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఆయన అక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. ఆ సమయంలో కృష్ణ దేవదాస్‌ రిలీజ్‌కి పోటీగా స్థానిక నిర్మాతలు ఏఎన్నార్‌ `దేవదాస్‌`ని రిలీజ్‌ చేశారు. దీని కారణంగా .. కృష్ణ `దేవదాస్‌` కిల్‌ అయ్యింది. ఆ మూవీని ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ ఏఎన్నార్‌ `దేవదాస్‌`నే ఎక్కువగా చూశారు. అది మరోసారి పెద్ద హిట్‌ అయ్యింది. అయితే కృష్ణ దేవదాస్‌ మూవీని నవయుగ వాళ్లు, సారథి స్టూడియో వాళ్లు నిర్మించారు. `దేవదాస్‌` విషయంలో సారథి వాళ్లు హర్ట్ అయ్యారు. ఆ తర్వాత అంజలిదేవి రూపొందించాల్సిన ఏఎన్నార్‌ సినిమాకి సారథి వాళ్లు షూటింగ్‌కి ఒప్పుకోలేదు.

44
ఏఎన్నార్‌ నిజ స్వరూపం ఇదే
Image Credit : Akkineni Nageswara Rao

ఏఎన్నార్‌ నిజ స్వరూపం ఇదే

అప్పట్లో ఏఎన్నార్‌ సినిమాలన్నీ సారథి స్టూడియోలోనే షూటింగ్‌ అయ్యేవి. ఇప్పుడు వాళ్లు నో చెప్పారు. దీంతో తన సినిమాలు ఎక్కడ తీయాలో అర్థం కాలేదు. దీంతో తనకే ఒక స్టూడియో ఉంటే బాగుంటుందని చెప్పి, పెద్దలను, రాజకీయ నాయకులను పట్టుకొని స్టూడియో నిర్మాణానికి ప్లేస్‌ కెటాయించుకున్నారు. స్టూడియోకి పర్మిషన్‌ కూడా వచ్చింది. అలా కేవలం 4 నెలల్లోనే స్టూడియో నిర్మాణం పూర్తి చేశారట. ఆ తర్వాత కొత్త సినిమాని షూటింగ్‌ స్టార్ట్ చేయించారట. అటు కృష్ణపై పగ, ఇటు సారథి వాళ్లపై ప్రతీకారం ఈ స్టూడియో నిర్మాణానికి దారి తీసింది. కాకపోతే ఈ ప్రతీకారం నిర్మాణాత్మకమైన రివేంజ్‌ అని తెలిపారు ఎస్వీ రామారావు. ఇలాంటి విషయాల్లో పెద్ద వాళ్ల నుంచి మనం నేర్చుకోవాలని, అది నెగటివ్‌ వేలో కాదు, పాజిటివ్‌గా అని తెలిపారు రైటర్‌. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు ఎస్వీ రామారావు. ఇదిప్పుడు వైరల్‌గా మారింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
కృష్ణ ఘట్టమనేని
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakul Preet Singh: ఐటీ దాడుల విషయంలో నోరు విప్పిన రకుల్ ప్రీత్ సింగ్, ఇచ్చిపడేసిందిగా..
Recommended image2
Crime Thriller: 3 కోట్ల బడ్జెట్... 60 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్
Recommended image3
AK 47: ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా, అసలు కారణం ఏంటంటే?.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే, నిరాశలో వెంకీ అభిమానులు
Related Stories
Recommended image1
AK 47: ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా, అసలు కారణం ఏంటంటే?.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే, నిరాశలో వెంకీ అభిమానులు
Recommended image2
Sigma 3 Days Collections: సిగ్మా మూవీ 3 రోజుల కలెక్షన్లు.. జేసన్‌ సంజయ్‌ మూవీకి బాక్సాఫీసు వద్ద దారుణమైన పరిస్థితి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved