MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ సీరియల్ హీరోయిన్ ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ సీరియల్ హీరోయిన్ ఎవరో తెలుసా?

రీసెంట్ గా సంక్రాంతి సీజన్ కు భారీ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాలో ఆయన బాగా అభిమానించే ఫేవరెట్ సీరియల్ నటి కూడా ఉంది. ఇంతకీ ఆమె ఎవరు? గతంలో ఏమైనా సినిమాలు చేసిందా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 14 2026, 09:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మెగాస్టార్ కు మరిచిపోలేని హిట్..
Image Credit : Chiranjeevikonidela/Instagram

మెగాస్టార్ కు మరిచిపోలేని హిట్..

చాలా కాలంగా ఫెయిల్యూర్స్ చూస్తూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ సంక్రాంతి సందర్భంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం.. థియేటర్లలో మంచి వసూళ్లు సాధించి.. తాజాగా ఓటీటీ ప్లాట్ ఫామ్ కూడా ఎక్కేసింది. ప్రస్తుతం ఈ సినిమా ZEE5 ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవిని కొత్తగా చూపించిన అనిల్ రావిపూడి..
Image Credit : Chiranjeevikonidela, Anilravipudi/Instagram

చిరంజీవిని కొత్తగా చూపించిన అనిల్ రావిపూడి..

మెగాస్టార్ చిరంజీవిలోని ఫుల్ ఎనర్జీని మరోసారి బయటపెట్టాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. గతంలో చిరంజీవి పెర్ఫామెన్స్ ఎలా ఉండేది అనేది మరోసారి అభిమానులకు చూపించాడు. కామెడీ, ఎమెషన్స్, యాక్షన్, డ్యాన్స్.. ఎక్కడా ఏమీ తగ్గకుండా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. యూత్ కు కావల్సిన ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యేలా సినిమాను నడిపించారు. 

మరీ ముఖ్యంగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చూపించిన సీరియల్ ట్రాక్ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి చాలా పెద్ద సెక్యురిటీ ఆఫీసర్ అయినా.. సాధారణ కుటుంబికుడిగా చూపించడం..మరీ ముఖ్యంగా ఒక సీరియల్‌ను రెగ్యులర్‌గా చూస్తూ ఉండడం, ఆ సీరియల్ కథను తన జీవితంతో పోల్చుకోవడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

35
మెగాస్టార్ మెచ్చిన సీరియల్ హీరోయిన్..
Image Credit : instagram.com/_charishma530

మెగాస్టార్ మెచ్చిన సీరియల్ హీరోయిన్..

ఈ సినిమాలో పదే పదే కనిపించిన ఆ సీరియల్‌ పాత్ర పేరు సౌమ్య. ఈ సౌమ్య పాత్రలో కనిపించిన నటి అసలు పేరు సాయి ప్రియా రెడ్డి. ఈ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ స్టార్ గతంలో కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు ఫేవరెట్‌గా నిలిచిన సౌమ్య పాత్ర చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూనే... ఆడియన్స్ ను నవ్విస్తుంది. 

45
సాయి ప్రియా రెడ్డి సినిమాలు
Image Credit : instagram.com/_charishma530

సాయి ప్రియా రెడ్డి సినిమాలు

సౌమ్య పాత్రలో కనిపించిన సాయి ప్రియా రెడ్డి తెలుగమ్మాయి. ఆమె చాలా కాలంగా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా క్షేత్రం, నందీశ్వరుడు, పూలరంగడు, రెబెల్, మిర్చి, తడాఖా, జీనియస్ వంటి పలు సినిమాల్లో. అంతే కాదు కొన్ని యూట్యూబ్‌ సిరీస్‌లలో కూడా సందడి చేసింది సాయి ప్రియా రెడ్డి.

55
వరుస అవకాశాలు సాధిస్తోన్న సాయి ప్రియా రెడ్డి
Image Credit : instagram.com/_charishma530

వరుస అవకాశాలు సాధిస్తోన్న సాయి ప్రియా రెడ్డి

ఇటీవల సందీప్ కిషన్ నటించిన మజాకా, అలాగే విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమాల్లో కూడా సాయి ప్రియా తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలతో బిజీ అవుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా పుణ్యమా అని ఆమెకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. 

ఈ సినిమాలో చిరంజీవికి బాగా నచ్చిన సౌమ్య పాత్రలో నటించడం, స్టేజ్‌పై షీల్డ్ అందుకోవడం ద్వారా సాయి ప్రియా రెడ్డి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. అంతే కాదు తన ఆనందాన్ని ఓ సందర్భంలో సోషల్ మీడియాలో పంచుకుంది సాయి ప్రియా. మెగాస్టార్ తో దిగిన ఫోటోలను, షూటింగ్ విశేషాలను ఇన్ స్టాలో షేర్ చేసుకుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల కెరీర్ లో 800 సినిమాలు.. కైకాల సత్యనారాయణ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా?
Recommended image2
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image3
Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?
Related Stories
Recommended image1
మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ స్వయంగా చెప్పిన పేరు ఎవరిది?
Recommended image2
పెళ్లి పెటాకులు లేవంటూ.. ప్రభాస్ ముఖం మీదే అన్న స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎందుకలా అన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved