- Home
- Entertainment
- MSG Ticket: ఒక్క టికెట్ లక్షా 11 వేలు.. చిరంజీవి క్రేజ్ చూస్తే మైండ్ బ్లాకే.. పవన్ `ఓజీ`ని మించి
MSG Ticket: ఒక్క టికెట్ లక్షా 11 వేలు.. చిరంజీవి క్రేజ్ చూస్తే మైండ్ బ్లాకే.. పవన్ `ఓజీ`ని మించి
ఇటీవల ప్రీమియర్ షోస్ టికెట్ల వేలం ట్రెండ్‌గా మారింది. లక్షలు వెచ్చించి మొదటి టికెట్‌ని కొంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు చిరంజీవి సినిమా టికెట్ ధర ఏకంగా లక్షా 11 వేలు పలకడం విశేషం.

మూడేళ్ల తర్వాత వస్తోన్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి మూడేళ్ల తర్వాత ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. చివరగా ఆయన 2023లో `భోళా శంకర్` చిత్రంలో నటించారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. మధ్యలో `విశ్వంభర` రావాల్సింది. కానీ అటు వీఎఫ్‌ఎక్స్, మరోవైపు బిజినెస్ కారణంగా ఈ మూవీ డిలే అవుతుంది. దీంతో మూడేళ్ల గ్యాప్‌తో ఇప్పుడు `మన శంకరవరప్రసాద్ గారు` మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదల కాబోతుంది.
మన శంకరవరప్రసాద్ గారు మూవీ టికెట్ రికార్డు ధరకి వేలం
ఇప్పటికే సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యూ బై ఏ సర్టిఫికేట్‌ని పొందింది. టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాతలు కోర్ట్ కి వెళ్లారు. కానీ అభిమానులు మాత్రం అంతకంటే ముందే తన అభిమానం చాటుకుంటున్నారు. భారీ రేట్‌కి టికెట్‌ని కొనుగోలు చేస్తున్నారు. తాజాగా `మన శంకరవరప్రసాద్ గారు` మూవీ మొదటి టికెట్ ఏకంగా లక్షకుపైగా పలకడం విశేషం. అమలాపురంలోని వెంకటరమణ థియేటర్‌లోని ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ల వేలం నిర్వహించారు. ఇందులో వెంకట సుబ్బారావు అనే చిరంజీవి అభిమాని ఏకంగా రూ.111000 వెచ్చించి మొదటి టికెట్‌ని కొనుగోలు చేశాడు.
తమ్ముడు పవన్ సినిమాని మించి అన్న చిరంజీవి మూవీ టికెట్ కొనుగోలు
ఇదే వెంకట సుబ్బారావు.. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన `ఓజీ` సినిమా ప్రీమియర్ షో టికెట్ ని రూ.64వేలకు వేలం ద్వారా దక్కించుకున్నారు. ఇప్పుడు తమ్ముడు పవన్ మూవీని మించి అన్న చిరంజీవి సినిమా టికెట్ ని అత్యధిక రేట్‌కి దక్కించుకోవడం విశేషం. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరంజీవికి ఆ జనరేషన్‌లో ఉన్న ఫాలోయింగ్‌కి, క్రేజ్‌కిది నిదర్శనంగా చెప్పొచ్చు.
మరో అభిమాని లక్షా రెండు వేలకు `ఎంఎస్‌జీ` టికెట్ కొనుగోలు
ఇక `మన శంకరవరప్రసాద్ గారు`(ఎంఎస్‌జీ) మూవీ టికెట్ మరో చోట కూడా లక్షకుపైగా పలికింది. వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురంలోని అన్నపూర్ణ థియేటర్‌లో చిరంజీవి మూవీ టికెట్‌ని వేలం వేయగా, ఇందులో చాగంటి గణేష్ అనే అభిమాని ఏకంగా రూ.లక్షా రెండు వేలకు సొంతం చేసుకున్నాడు. ఇలా మెగాస్టార్ అభిమానులు అత్యధిక రేటుకి ప్రీమియర్స్ షో టికెట్లని సొంతం చేసుకోవడం విశేషం. ఇదిలా ఉంటే ఇటీవల `ఓజీ` మూవీ ప్రీమియర్ షో టికెట్‌ని వేలం ద్వారా లక్కారం గ్రామానికి చెందిన పవన్ అభిమాని ఆముదాల పరమేష్ చౌటుప్పల్‌లోని శ్రీనివాసా థియేటర్‌లో ఏకంగా రూ.129999 కు దక్కించుకోవడం మరో విశేషం.
సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ మూవీగా `ఎంఎస్‌జీ`
చిరంజీవి హీరోగా నటించిన `మన శంకరవరప్రసాద్ గారు` మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించింది. వెంకటేష్ మరో కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. దీంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి పండక్కి కావాల్సిన ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్లతో ఈ మూవీని రూపొందించారు దర్శకుడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. నేడు బుధవారం సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు.

