MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • వజ్రోత్సవాల్లో చిరంజీవికి అంత అవమానం జరిగిందా? ఆ విషయం గుర్తు చేసుకుంటూ స్టేజ్‌పైనే ఎమోషనల్‌

వజ్రోత్సవాల్లో చిరంజీవికి అంత అవమానం జరిగిందా? ఆ విషయం గుర్తు చేసుకుంటూ స్టేజ్‌పైనే ఎమోషనల్‌

మెగాస్టార్‌ చిరంజీవి ఎమోషనల్‌ అయ్యారు. వజ్రోత్సవాల వేడుకలో తనకు జరిగిన అవమానం బయటపెట్టారు. తాజాగా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు చిరు.   

3 Min read
Author : Aithagoni Raju
Published : Oct 29 2024, 12:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగాస్టార్‌ చిరంజీవి.. టాలీవుడ్‌లో టాప్‌ మోస్ట్ హీరో. ఆయన్న మించిన మెగాస్టార్‌ టాలీవుడ్‌లో లేరంటే అతిశయోక్తి లేదు. కింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా అని అమితాబ్‌ బచ్చన్‌ అన్నట్టుగానే కింగ్‌ ఆఫ్‌ తెలుగు సినిమా కూడా. సుమారు ఐదు దశాబ్దాల సినిమా కెరీర్‌లో ఆయన తెలుగు సినిమా దశ దిశ మార్చేశారు. సినిమాలను కమర్షియల్‌ బాట పట్టించారు. ఎంటర్‌టైన్‌మెంట్స్ స్కేల్‌ని పెంచారు. సినిమాల్లోకి సునామీలా వచ్చి, ఓ లెజెండ్‌గా ఎదిగారు. ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద దిక్కు అనే స్థాయికి ఎదిగారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అలాంటి మెగాస్టార్‌కి అవమానం జరిగిందట. అది సొంత ఇండస్ట్రీలోనే తనకు దారుణమైన అవమానం జరిగిందని తెలిపారు మెగాస్టార్‌. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ స్టేజ్‌పైనే ఎమోషనల్‌ అయ్యారు. ఇంతకి ఏం జరిగింది? ఇప్పుడెందుకు ఆ విషయం చిరంజీవి తెలిపారనేది చూస్తే, తెలుగు సినిమాకి రెండుకళ్లలో ఏఎన్నార్‌ని మరో కన్నుగా భావిస్తారు.

ఆయన పేరిట జాతీయ అవార్డుని స్థాపించారు అక్కినేని నాగార్జున. తాజాగా ఏఎన్నార్‌ జాతీయ పురస్కారం ఈ ఏడాదికి గానూ మెగాస్టార్ చిరంజీవికి అందిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌ చేతుల మీదుగా చిరంజీవికి ఈ ఏఎన్నార్‌ జాతీయ పురస్కారం అందించారు. 

35

ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు. ఆ రోజు తనకు `లెజెండరీ పురస్కార ప్రదానం చేశారట. అందుకు తాను చాలా సంతోషించినట్టు తెలిపారు. తన జీవితం ధన్యమైందనుకున్నారట. కానీ అది ఇవ్వడాన్ని కొందరు వ్యతిరేకించారు, అభ్యంతరం తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం కాదని భావించి, దాన్ని ఓ క్యాప్సుల్ బాక్స్ లో పడేసి నాకు అర్హత ఎప్పుడు వస్తుందోఅప్పుడే తీసుకుంటానని చెప్పారట. ఆ రోజు రచ్చ గెలిచాను, కానీ ఇంటగెలవలేదన్నారు చిరు. ఇప్పుడు ఏఎన్నార్‌ పురస్కారం అందుకుంటుంటే ఎస్‌ ఇప్పుడు ఇంట గెలిచాను, రచ్చ గెలిచాననే ఫీలింగ్‌ కలుగుతుందన్నారు. 
 

45

చిరంజీవి ఇంకా మాట్లాడుతూ, `తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది. నా విషయంలో రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచాను ఏమో అనిపిస్తోంది. నటుడిగా నేను ఎదుగుతున్న సమయంలో బయట ప్రేక్షకులు, సన్నిహితుల నుంచి ప్రశంసలు వచ్చేవి. అయితే ఇంటికి వెళ్లినప్పుడు మా నాన్న సినిమాలు చూసి పొగుడుతారేమో అని అనుకునేవాణ్ని.

ఓ రోజు ఇంటికి వెళ్లినప్పుడు నా కవర్‌ పేజీలతో కొన్ని పుస్తకాలు చూస్తున్నారు. నేను వెళ్లేసరికి తీసి పక్కన పడేశారు. ఫొటోలు బాగున్నాయిరా అని ఓ మాట అంటారేమో అని అనుకున్నా. కానీ ఆయన అలా అనలేదు. అమ్మ దగ్గరకు వెళ్లి.. ‘ఏంటమ్మా నాన్న ఎప్పుడూ నా గురించి ఓ మాట అనరు, బాగుందని కూడా చెప్పరు’ అని అడిగాను. బయట రచ్చ ఎంత గెలిచినా సరే.. ఇంట గెలవడం లేదు అనిపిస్తోంది అని అన్నాను.

దానికి అమ్మ ‘లేదురా నాన్న చాలా పొగుడుతారు. ఏం చేశాడు నా కొడుకు, అదరగొట్టేశాడు’ అని అంటుంటారు అని చెప్పింది. మరి నా దగ్గర ఆ మాటలు అనొచ్చు కదా అని అమ్మను అంటే ‘బిడ్డల్ని తల్లిదండ్రుల్ని పొగడకూడదు. అది వారికి ఆయుక్షీణం’’ అని అమ్మ చెప్పింది. 
 

55

సినిమా పరిశ్రమలో నేను తొలుత రచ్చ గెలిచాను. నా ఇల్లు అనుకునే పరిశ్రమలో నాకు ఆ అవకాశం టాలీవుడ్‌ వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. లెజండరీ పురస్కారం ప్రదానం చేశారు. ఆ సమయంలో చాలా ఆనందమేసి ధన్యుణ్ని అనుకున్నా. కానీ ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొందరు హర్షించని ఆ సమయంలో ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం అనిపించలేదు.

అందుకే ఆ రోజు ఆ అవార్డుని ఓ క్యాప్సుల్‌ బాక్స్‌లో పడేసి నాకు అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకుంటాను అని చెప్పాను. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నార్‌ అవార్డును ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారి చేతులు మీదగా అందుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తోంది.. ‘నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను’ అని. అందుకే ఈ పురస్కారం గురించి చెప్పడానికి నాగార్జున, వెంకట్ ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా ఆనందించాను.

నాకు పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌, గిన్నిస్‌ బుక్‌లో స్థానం.. ఇలాంటివి ఎన్ని వచ్చినా ఈ అవార్డు విషయంలో నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్లు నన్ను గుర్తించి నాకు అవార్డు ఇస్తుండటం నాకు గొప్ప విషయంగా అనిపించింది. అందుకే నాగార్జునతో ఇది నాకు అన్ని పురస్కారాలకు మించిన ప్రత్యేకమైన అవార్డు అని చెప్పా. ఇదే మాట ఇప్పుడు స్టేజీ మీద చెబుతున్నా` అని అన్నారు చిరంజీవి.  

read more: రాజీవ్‌ గాంధీని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవ చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? పేరెంట్స్ పెద్ద షాక్‌
also read: కథ నచ్చలేదన్న డైరెక్టర్-ప్రొడ్యూసర్, ఓకే చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి, ఆ మూవీ ఏమిటో తెలుసా?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Recommended image2
Sobhita Dhulipala: శోభిత ధూళిపాళకి తమిళ డైరెక్టర్ ఫిదా.. ఆమె చేసిన సాహసం ఏంటో తెలుసా, డూప్ లేకుండా
Recommended image3
Mahesh Babu: అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ ఎవ్వరితో కుదర్లేదు.. మహేష్ తో బాలీవుడ్ డైరెక్టర్ ప్రయత్నాలు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved