MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కథ నచ్చలేదన్న డైరెక్టర్-ప్రొడ్యూసర్, ఓకే చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి, ఆ మూవీ ఏమిటో తెలుసా?

కథ నచ్చలేదన్న డైరెక్టర్-ప్రొడ్యూసర్, ఓకే చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి, ఆ మూవీ ఏమిటో తెలుసా?

రచయిత తన వద్ద ఉన్న కథను దర్శకుడికి, నిర్మాతకు వినిపించాడట. వీరిద్దరికీ నచ్చలేదట. చిరంజీవికి చెబితే బాగుంది అన్నాడట. దర్శక నిర్మాతలను ఒప్పించి మూవీ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడట. ఇంతకీ ఆ మూవీ ఏమిటంటే?  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 28 2024, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Chiranjeevi

Chiranjeevi

పరిశ్రమలో టాలెంట్ కి మించి అదృష్టం ఉండాలి. అదే సమయంలో స్క్రిప్ట్ సెలక్షన్ చాలా ముఖ్యం. కథలను సరిగా జడ్జి చేయగలిగే విజయాలు దక్కుతున్నాయి. అయితే ప్రతిసారి అంచనాలు కరెక్ట్ కావు. పేపర్ మీద అద్భుతంగా ఉన్న కథ సిల్వర్ స్క్రీన్ పై తేలిపోవచ్చు. సాదాసీదాగా ఉన్న కథ వెండితెర పై అద్భుతం చేయవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చిరంజీవికి ఓ సినిమా విషయంలో అదే జరిగిందట. ఆయనకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఓ మూవీ కథ దర్శకుడికి, నిర్మాతకు నచ్చలేదట. బీ. గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా అశ్వినీదత్ ఓ మూవీ చేయాలనుకున్నారట. బీ.గోపాల్, అశ్వినీదత్ కథలు వింటున్నారు. నరసింహనాయుడు మూవీకి కథ, స్క్రీన్ ప్లే అందించిన చిన్ని కృష్ణకు ఆఫర్ ఇచ్చారు. 

బీ. గోపాల్, బాలకృష్ణ, చిన్ని కృష్ణ కాంబోలో వచ్చిన నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ సినిమాకు డైలాగ్స్ మాత్రం పరుచూరి బ్రదర్స్ అందించారు. అందుకే బీ. గోపాల్ మరోసారి చిన్ని కృష్ణతో పని చేసేందుకు ఆసక్తి చూపారు. చిన్ని కృష్ణ దాదాపు ఆరు నెలలు పని చేసి ఓ కథను సిద్ధం చేశారట. బీ. గోపాల్, అశ్వినీ దత్ లకు ఆ కథ వినిపించాడట. వారికి కథ నచ్చలేదట. 

36
Chiranjeevi

Chiranjeevi

చివరి ప్రయత్నంగా చిరంజీవికి కూడా వినిపించండని పరుచూరి బ్రదర్స్... చిన్ని కృష్ణకు సలహా ఇచ్చాడట. చిరంజీవికి కూడా నచ్చకపోవచ్చని చిన్ని కృష్ణ ఫిక్స్ అయ్యాడట. రెండు గంటలు కథ విన్న చిరంజీవి చాలా బాగుంది. మూవీ చేద్దామని అన్నారట. మీరు నమ్మండి ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి కాసుల వర్షం కురిపిస్తుంది. భారీ విజయం అందుకుంటుందని బీ. గోపాల్, అశ్వినీదత్ లకు చిరంజీవి చెప్పారట. 

చిరంజీవి మాటకు తిరుగేముంది. బీ.గోపాల్, అశ్వినీదత్ పచ్చజెండా ఊపారట. చిరంజీవి నమ్మకాన్ని నిజం చేస్తూ ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ రికార్డ్స్ తుడిచిపెట్టింది. అదే ఇంద్ర చిత్రం. 2002లో విడుదలైన ఇంద్ర చిరంజీవి కెరీర్లో అతిపెద్ద హిట్ గా రికార్డులకు ఎక్కింది. 

46
Chiranjeevi

Chiranjeevi

చిరంజీవి నటించిన ఫస్ట్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇంద్ర. సోనాలీ బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ మ్యూజిక్ సినిమాకు మరో హైలెట్. వారణాసిలో టూరిస్ట్ గైడ్ గా, రాయలసీమలో ఇంద్రసేనారెడ్డిగా రెండు విభిన్నమైన పాత్రలు చిరంజీవి చేశారు. ఇంద్ర విడుదలయ్యే సమయానికి చిరంజీవి ప్లాప్స్ లో ఉన్నారు. అందుకే ఇంద్ర విజయం చిరంజీవి చాలా స్పెషల్. 

 

56

ఇంద్ర సక్సెస్ నేపథ్యంలో భారీ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పెద్ద మొత్తంలో అభిమానులు హాజరయ్యారు. ఆ విధంగా చిరంజీవి ముందు చూపు అశ్వినీదత్ కి లాభాలు తెచ్చిపెట్టింది. బీ. గోపాల్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ చేరింది. ఈ చిత్రం తర్వాత చిన్ని కృష్ణకు స్టార్ రైటర్ హోదా దక్కింది. 

 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి

66


ఇంద్ర అనంతరం ఠాగూర్ మూవీతో చిరంజీవి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఠాగూర్ సైతం అనేక రికార్డ్స్ బ్రేక్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో చిరంజీవి ఎవరికీ అందని ఎత్తుకు చేరుకున్నాడు. ఇంద్ర మూవీ సక్సెస్ వెనుక ఇంత తతంగం నడిచింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohith Naidu: టాప్ 2 లో ఉండాల్సినోడు ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు..స్వయంగా చేసిన తప్పులా, బిగ్ బాస్ ప్లానింగా ?
Recommended image2
Soundarya: ఇండస్ట్రీలో సౌందర్య అన్నయ్య అని పిలిచే ఏకైక హీరో ఎవరో తెలుసా? అంతనంటే ఎందుకంత అభిమానం..
Recommended image3
AK 47 3 Days Collections: ఆదివారం ఆదర్శ కుటుంబం ఊహించని జంప్‌.. వెంకటేష్‌ మూవీ 3 రోజుల కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved