- Home
- Entertainment
- అన్నయ్య అని పిలిచే తమ్ముడు రవితేజ, నా ఇంట్లో పెరిగిన శర్వా సినిమాలు కూడా హిట్ కావాలి.. మెగాస్టార్ కామెంట్స్
అన్నయ్య అని పిలిచే తమ్ముడు రవితేజ, నా ఇంట్లో పెరిగిన శర్వా సినిమాలు కూడా హిట్ కావాలి.. మెగాస్టార్ కామెంట్స్
మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి, వెంకటేష్ చేసిన సందడి.. వాళ్ళు మాట్లాడిన మాటలు అభిమానులని ఆకట్టుకున్నాయి.

మన శంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ సంక్రాంతికి జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. బుధవారం జనవరి 7న హైదరాబాద్ లో గ్రాండ్ గా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. దీనితో చిరంజీవి తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిరంజీవి, వెంకటేష్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.
ప్రభాస్ నుంచి శర్వా వరకు.. అందరి సినిమాలు హిట్ కావాలి
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ప్రసంగం ఆకట్టుకుంది. చిరు మాట్లాడుతూ.. ఏంది వెంకీ సంగతి అంటే.. అదిరిపోద్ది సంక్రాంతి, మనదే కదా సంక్రాంతి అని సాంగ్ లో ఉంది. కానీ సంక్రాంతి మాది మాత్రమే కాదు. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తానిది. మా సినిమాతో పాటు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న డార్లింగ్ ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా, అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే తమ్ముడు రవితేజ సినిమా, నా ఇంట్లో పెరిగిన శర్వానంద్ సినిమా, నన్ను గురువులా భావించే నవీన్ పోలిశెట్టి సినిమా కూడా విజయం సాధించాలి. తెలుగు చిత్ర పరిశ్రమ సుభిక్షంగా ఉండాలి. బయ్యర్లు బావుండాలి.
రాఘవేంద్ర రావు చెప్పారు
గతంలో రాఘవేంద్ర రావు నాతో మాట్లాడుతూ.. బాబాయ్ నువ్వు అనిల్ రావిపూడి సినిమాలు చూశావా అని అడిగారు. అతడి కామెడీ టైమింగ్ బావుంటుంది. అతడి దర్శకత్వంలో మీరు నటించాలి అని రాఘవేంద్ర రావు కోరుకున్నారు. ఈ చిత్రం ఆయన క్లాప్ తోనే ప్రారంభం అయింది. అనిల్ రావిపూడి కథ చెప్పినప్పుడు కామెడీ, సెంటిమెంట్ అన్ని అంశాలు బావున్నాయి. వైవిధ్యంగా చేద్దాం అని చెప్పా. కానీ అనిల్ రావిపూడి వైవిధ్యంగా వద్దు సార్.. మీ సినిమాలు దొంగ మొగుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు తరహాలో చేద్దాం అని అన్నాడు. ఈ జనరేషన్ కి మీరెంటో తెలియాలి. అప్పటి జ్ఞాపకాలు అందరికీ గుర్తుకు రావాలి అని చెప్పాడు.
వెంకీ, నేను చేసిన సీన్లు పిచ్చ పిచ్చగా వచ్చాయి
ఆల్రెడీ ఈ సినిమా సూపర్ హిట్. ఎందుకంటే బడ్జెట్ లిమిట్ లో ఉంది. వర్కింగ్ డేస్ తక్కువ. ఇక మరో సక్సెస్ జనవరి 12న రాబోతోంది నా బ్రదర్ వెంకీతో కలిసి పని చేయడం మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. వెంకటేష్ పైకి సరదాగా ఉంటాడు కానీ లోపల ఫిలాసఫికల్ గా చాలా డెప్త్. వెంకటేష్, నేను ఉండే సీన్లు పిచ్చ పిచ్చగా వచ్చాయి. నయనతారతో గతంలో కలసి పనిచేశాను. కానీ షూటింగ్ లో తన పని తాను చేసుకుని వెళ్లిపోయేది. ఈ సినిమాలో అనిల్ రావిపూడి ఏం మాయ చేశాడో ఏమో కానీ అందరితో సరదాగా కలిసిపోయింది అని చిరంజీవి అన్నారు.
అన్నయ్యతో చేశాను
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. తమ్ముళ్లు మహేష్, పవన్ తో సినిమాలు చేశాను. ఇప్పుడు అన్నయ్య తో చేస్తున్నాను.. ఈ సారి సౌండ్ ఇంకా పెరగాలి అని అన్నారు.

