- Home
- Entertainment
- Chiranjeevi-Balakrishna కాంబో సెట్టింగ్.. బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించేలా బడా నిర్మాత భారీ స్కెచ్
Chiranjeevi-Balakrishna కాంబో సెట్టింగ్.. బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించేలా బడా నిర్మాత భారీ స్కెచ్
చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. కానీ మొదటిసారి ఓ భారీ మూవీకి ప్లాన్ జరుగుతుంది. కనీవినీ ఎరుగని రీతిలో ఇండస్ట్రీకి పూనకాలు తెప్పించే ప్రాజెక్ట్ సెట్ అవుతుందని సమాచారం.

చిరంజీవి, బాలయ్య మధ్య బాక్సాఫీసు వార్
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ తరచూ బాక్సాఫీసు వద్ద పోటీ పడుతుంటారు. చాలా సార్లు సంక్రాంతి టైమ్‌లో పోటీ పడ్డారు. ఆ టైమ్ అభిమానుల మధ్య అసలైన పోటీ ఉంటుంది. ఎంత మంది పాన్ ఇండియా స్టార్లు పుట్టుకొచ్చినా, బాలయ్య, చిరంజీవి సినిమాల మధ్య పోటీ సమయంలో ఉండే సందడి ఉండదు. ఆ వార్ ఉండదు, ఆ కిక్క్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. అసలు సిసలైన సినిమా పోటీకి ఈ ఇద్దరు హీరోలు నిదర్శనంగా నిలుస్తున్నారు. అయితే బాక్సాఫీసు వద్ద పోటీ పడే ఈ ఇద్దరు ఒకే తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది. అలాంటిదే జరగబోతుంది.
బాలయ్య, చిరంజీవి కాంబినేషన్‌లో మూవీకి ప్లాన్
మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. దాదాపు 38ఏళ్ల క్రితం `త్రిమూర్తులు` చిత్రంలో గెస్ట్ గా మెరిశారు. వెంకటేష్ హీరోగా వచ్చిన ఆ చిత్రంలో టాలీవుడ్ బిగ్ స్టార్స్ అంతా కలిసి నటించారు. ఆ మూవీలోనే చిరు, బాలయ్య కూడా ఓ పాటలో కాసేపు సందడి చేశారు. కానీ నటులుగా ఇద్దరు కలిసి నటించింది లేదు. దాదాపు యాభై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమాకి ప్లాన్ జరుగుతుందట. ఈ ఇద్దరు హీరోలుగా సినిమా చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.
అల్లు అరవింద్ గట్టి ప్రయత్నాలు
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ క్రేజీ కాంబినేషన్‌కి ప్లాన్ చేస్తున్నారట. ఇద్దరితోనూ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. భారీ స్థాయిలో ఈ మూవీని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన డిస్కషన్ జరుగుతుందట. అల్లు అరవింద్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇద్దరు ముగ్గురు స్టార్ డైరెక్టర్లతోనూ ఈ చర్చలు నడుస్తున్నట్టు సమాచారం. ఆ మధ్య దర్శకుడు అనిల్ రావిపూడి వీరి కాంబినేషన్‌లో మూవీ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. అయితే వాళ్ల రేంజ్ కథ దొరకాలి అన్నారు. అలాగే బోయపాటి శ్రీను పేరు కూడా వినిపిస్తోంది. ఇంకా కొందరు యంగ్ డైరెక్టర్లతోనూ చర్చలు జరుగుతున్నాయట. కాకపోతే ఇదంతా ప్రాథమికంగా దశలోనే ఉంది.
చిరంజీవి, బాలయ్య కలిసి నటించేందుకు ఒప్పుకుంటారా?
ముందు చిరంజీవి, బాలయ్య కలిసి చేసేందుకు ఒప్పుకుంటారా? అనేది పెద్ద ప్రశ్న. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే దానికంటే పెద్ద సినిమా మరోటి ఉండదు. ప్రభాస్, పవన్, అల్లు అర్జున్ చిత్రాలు కూడా పక్కకి వెళ్లిపోతాయని చెప్పొచ్చు. ఆ రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. అభిమానులు ఊగిపోతారని చెప్పొచ్చు. థియేటర్లలో అసలైన పండగ వాతావరణం చోటు చేసుకుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే సమయంలో ఇద్దరు హీరోల ఇమేజ్‌ని బ్యాలెన్స్ చేయాలి. అలాంటి దమ్మున్న డైరెక్టర్ రావాలి. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? ఈ ఇద్దరు ఎంత వరకు ఓకేచెబుతారు అనేది ప్రశ్న. వర్కౌట్ అయితే మాత్రం అది వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఇలాంటి అరుదైన కాంబినేషన్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
సంక్రాంతికి రాబోతున్న చిరంజీవి
ఇక ప్రస్తుతం చిరంజీవి `మన శంకరవరప్రసాద్ గారు` మూవీలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. వింటేజ్ చిరంజీవి ఆవిష్కరించేలా ఆద్యంతం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో వెంకటేష్ గెస్ట్ రోల్ సినిమాకి హైలైట్‌గా నిలవబోతుంది. ఈచిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. దీంతోపాటు చిరంజీవి `విశ్వంభర` చేస్తున్నారు. అలాగే బాబీ దర్శకత్వంలో ఓమూవీ, శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది.
అఖండ 2తో నిరాశ పరిచిన బాలయ్య
మరోవైపు బాలకృష్ణ ఇటీవలే `అఖండ 2` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ చిత్రం నాలుగేళ్ల క్రితం వచ్చిన `అఖండ`కి సీక్వెల్. భారీ అంచనాల మధ్య ఈ నెల 12న విడుదలన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది. ఇప్పటి వరకు దాదాపు రూ.65కోట్ల వరకు కలెక్షన్ల షేర్ వచ్చింది. ఇంకా యాభై కోట్లకుపైగా వసూలు చేయాల్సి ఉంది. ఈ వారంతోనే ఈ మూవీ ఆల్మోస్ట్ క్లోజ్ కాబోతుందని, ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం `అఖండ 2` దాదాపు రూ.40-45కోట్ల వరకు నష్టాలను చవిచూడబోతుందని సమాచారం. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో `ఎన్బీకే111` మూవీ చేస్తున్నారు బాలయ్య. భారీ హిస్టారికల్ యాక్షన్ మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే.

