- Home
- Entertainment
- Nagarjuna: కోడలు శోభితా ప్రెగ్నెన్సీపై నాగార్జున రియాక్షన్ ఇదే, తాత కావడంపై హింట్.. రూ.2కోట్ల విరాళం
Nagarjuna: కోడలు శోభితా ప్రెగ్నెన్సీపై నాగార్జున రియాక్షన్ ఇదే, తాత కావడంపై హింట్.. రూ.2కోట్ల విరాళం
అక్కినేని కోడలు, హీరోయిన్, నాగ చైతన్య భార్య శోభిత ప్రెగ్నెంట్ అయ్యిందని, త్వరలోనే అక్కినేని వారసులు రాబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాగార్జున స్పందించారు.

శోభితా ప్రెగ్నెంట్ వార్తలు వైరల్
నాగార్జున త్వరలో తాత కాబోతున్నాడని, శోభిత ప్రెగ్నెంట్ అయ్యిందని, త్వరలో నాగచైతన్య తండ్రి కాబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య శోభిత ధరించిన దుస్తులను చూసి నెటిజన్లు ఈ అభిప్రాయానికి వచ్చారు. సాధారణంగా ట్రెండీ దుస్తుల్లో కనిపించే శోభితా ట్రెడిషనల్ డ్రెసెస్‌లో కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అని భావించారు. త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుందనే ప్రచారం జరిగింది. దీనిపై నాగార్జున స్పందించారు.
కోడలు శోభితా ప్రెగ్నెంట్‌పై నాగార్జున రియాక్షన్ ఇదే
నాగార్జున ఇటీవల గుడివాడ ఏఎన్నార్ కాలేజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా నుంచి ఆయనకు ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. త్వరలో మీరు తాత కాబోతున్నారని తెలుస్తోంది, దీనిపై మీ రియాక్షన్ ఏంటని మీడియా ప్రశ్నించగా, మొదట దాటవేశారు నాగార్జున. మళ్లీ అదే ప్రశ్న ఎదురు కావడంతో ఇక తప్పలేదు. ఎట్టకేలకు రియాక్ట్ అయ్యారు. ఆ వార్తలను ఆయన ఖండించలేదు. సమయం వచ్చినప్పుడు తానే ఆ విషయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు నాగార్జున.
నాగ చైతన్య, శోభిత పేరెంట్స్ కాబోతున్నట్టు హింట్ ఇచ్చిన నాగ్
సాధారణంగా రూమర్లని ఖండిస్తారు. అలాంటి వార్తల్లో నిజం లేదని చెబుతారు. కానీ ఆ సమాధానం దాటవేయడం, సమయం వచ్చినప్పుడు తానే ప్రకటిస్తానని చెప్పడంలోనే అసలు నిజం దాగుంది. ఇప్పుడు శోభితా ప్రెగ్నెంట్‌గానే ఉందనే విషయాన్ని నాగార్జున చెప్పకనే చెప్పారు. త్వరలో తాను తాత కాబోతున్నానే విషయాన్ని ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ లెక్కన నాగ చైతన్య త్వరలో తండ్రి కాబోతున్నారని, శోభితా పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుందని, మొత్తంగా అక్కినేని ఫ్యామిలీలోకి వారసులు రాబోతున్నారని చెప్పొచ్చు.
గతేడాది శోభిత, చైతూ పెళ్లి
ఇదిలా ఉంటే నాగ చైతన్య, శోభిత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 4న వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందు సమంతతో చైతూకి మ్యారేజ్ జరిగిన విషయం తెలిసిందే. అది కూడా ప్రేమ పెళ్లినే. కానీ నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత శోభిత ప్రేమలో పడ్డాడు నాగచైతన్య. గతేడాది మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత శోభితా సినిమాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు నాగచైతన్య ప్రస్తుతం `వృషకర్మ` అనే చిత్రంలో నటిస్తున్నాడు. భారీ స్థాయిలో ఈ మూవీ రూపొందుతుంది.
ఏఎన్నార్ కాలేజీకి రెండు కోట్ల విరాళం
ఇక నాగార్జున బుధవారం ఏఎన్‌ఆర్ కాలేజీకి భారీ విరాళం ప్రకటించారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్నార్ కాలేజీ వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున కాలేజీకి రెండు కోట్ల విరాళం ప్రకటించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ, తమ తల్లిదండ్రులైన అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ అక్కినేని జ్ఞాపకార్థం అక్కినేని కుటుంబం ఏఎన్ఆర్ కళాశాలలో 2 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ నిర్ణయం తాను, తన సోదరి సుశీల, సోదరుడు వెంకట్, మొత్తం ఏఎన్ఆర్ కుటుంబం కలిసి తీసుకున్నట్లు తెలిపారు. `ఈ నిధిని సరైన పద్ధతిలో అమలు చేయడానికి మేము ఏఎన్ఆర్ కళాశాల యాజమాన్యంతో కలిసి పని చేస్తాము. సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఈ సంస్థకు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు, ఆయన వారసత్వాన్ని కొనసాగించడం మా బాధ్యత` అని తెలిపారు నాగ్.

