- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: కాశీని రెచ్చగొట్టిన వైరా- శ్రీధర్ అరెస్ట్- రక్తం కక్కుకున్న సుమిత్ర
Karthika Deepam 2 Today Episode: కాశీని రెచ్చగొట్టిన వైరా- శ్రీధర్ అరెస్ట్- రక్తం కక్కుకున్న సుమిత్ర
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 19వ తేదీ)లో శ్రీధర్ పై రివేంజ్ తీసుకోవాలని కాశీని రెచ్చగొడుతాడు వైరా. కాశీని తనవైపు తిప్పుకుంటుంది జ్యో. శ్రీధర్ ని అరెస్ట్ చేస్తారు పోలీసులు. రక్త వాంతి చేసుకుంటుంది సుమిత్ర. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో కాశీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు వైరా. ఇంతలో కాశీ వస్తాడు. రండి సార్.. అంటూ చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుతాడు వైరా. మీరు నన్ను సార్ అనడం ఏంటని షాక్ అవుతాడు కాశీ. మీరు వయసులో నాకన్న చిన్నవారే కావచ్చు. కానీ మీలాంటి టాలెండ్ పర్సన్స్ కి తగిన మర్యాద ఇవ్వాలి కదా అంటాడు వైరా.
తనకు మంచి గుర్తింపు దక్కిందని లోలోపల సంతోషపడతాడు కాశీ. మీ గురించి జ్యోత్స్న గారు చెప్పారు. మీకు నా కంపెనీలో జీఎం పోస్టు ఆఫర్ చేస్తున్నాను అంటాడు వైరా. ఇంత క్వాలిఫికేషన్ ఉన్న నిన్ను పీఏగా పెట్టుకోవడం అన్యాయం. నిన్ను చీప్ చేయడానికే నీకు ఆ జాబ్ ఇచ్చారు. మీ బాస్ ఎప్పుడైనా నాలాగా మీకు మర్యాద ఇచ్చాడా? వాళ్లపై కచ్చితంగా రివేంజ్ తీర్చుకోవాలి అని కాశీని రెచ్చగొడుతాడు వైరా. సైలెంట్ గా ఉంటాడు కాశీ.
కారులో తిరిగే రోజులు ఎప్పుడు వస్తాయో?
మరోవైపు స్కూటీపై వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు దీప, కార్తీక్. ఏం ఆలోచిస్తున్నావు మరదలా అంటాడు కార్తీక్. మా బావ మళ్లీ కారులో తిరిగే రోజులు ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నాను అంటుంది దీప. వస్తాయిలే అటువైపు చూడు అని స్కూటీ ఆపుతాడు కార్తీక్. అక్కడ ఫుడ్ ట్రక్ బిజినెస్ బాగా నడిచే సీన్ చూసి సంతోషపడుతుంది దీప.
మిగిలిన ఫుడ్ ని ఇలా పేదవాళ్లకు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉందని కార్తీక్ తో చెప్తుంది. ఐడియా నీదే కాబట్టి వారిచ్చే దీవెనలు కూడా నీకే సొంతం అంటాడు కార్తీక్. ఐడియా నాదే అయినా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మామయ్యగారు ఎంత కష్టపడ్డారో అంటుంది దీప. ఇక్కడ కాశీ కనపడట్లేదే అంటాడు కార్తీక్. వేరే ట్రక్ దగ్గర ఉండొచ్చు అంటుంది దీప.
వైరాతో చేయికలిపిన కాశీ
ఇంకా సైలెంట్ గా ఉన్నావేంటి.. నువ్వు చేయాల్సిందే రెండే పనులు. నా కంపెనీలో జాబ్ చేయడం. నిన్ను అవమానించిన వారిపై రివేంజ్ తీసుకోవడం. మొదటిది నువ్వు చేయి. రెండోది ఎప్పుడు చేయాలో నేను చెప్తా అని జ్యోత్స్నకు ఫోన్ చేస్తాడు వైరా.
జ్యోత్స్న గారు కాశీ వచ్చాడు. తను ఇంకా ఏదో డౌట్ లో ఉన్నాడు. మీరు మాట్లాడండి అని కాశీతో మాట్లాడిస్తాడు. నా చేతిలో లేకపోయినా.. వేరే కంపెనీలో నీకు మంచి ఉద్యోగం ఇప్పించాను. సంతోషంగా ఓకే చెప్పు అంటుంది జ్యోత్స్న. సరే అంటాడు కాశీ.
శ్రీధర్ అరెస్ట్
ఫుడ్ ట్రక్ బిజినెస్ సక్సెస్ పై మీడియా ముందు మాట్లాడుతుంటాడు శ్రీధర్. ప్రతిరోజు కొంతమంది పేదవాళ్లకు ఫుడ్ పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రమోషన్ కోసం కాదు. సేవభావంతోనే మేము ఇలా చేస్తున్నాము అని చెప్తూ ఉంటాడు.
ఇంతలో కాశీ పోలీసులను తీసుకొని వస్తాడు. శ్రీధర్ అంటే మీరే కదా.. మీ ఫుడ్ ట్రక్స్ దగ్గర ఫుడ్ తిని కొంతమంది స్పృహతప్పి పడిపోయారు. మీ పీఏని అడిగితే మీ పేరు చెప్పాడు. మీరు స్టేషన్ కి రావాల్సి ఉంటుంది అంటారు పోలీసులు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అయినా సరే నేను మీకు సహకరిస్తాను అని వాళ్లతో వెళ్తాడు శ్రీధర్.
దీపకు జాగ్రత్తలు చెప్పిన సుమిత్ర
మరోవైపు ఇళ్లు ఊడుస్తూ ఉంటుంది దీప. సుమిత్ర వచ్చి ఆ చీపురు తీసుకొని నేను ఊడుస్తాను. నువ్వు అలా కూర్చో. కడుపుతో ఉన్న మనిషి ఇలాంటి పనులు చేయకూడదు అని తల్లి బిడ్డకు చెప్పే జాగ్రత్తలన్నీ చెప్తుంది. మా అమ్మవి నువ్వే అని మనసులో మురిసిపోతుంది దీప. ఊడుస్తూ ఊడుస్తూ బాగా దగ్గు వచ్చి పడబోతుంది సుమిత్ర.
రక్తం కక్కుకున్న సుమిత్ర
దీప సుమిత్రను వాష్ బేసిన్ దగ్గరికి తీసుకెళ్తుంది. రక్త వాంతి చేసుకుంటుంది సుమిత్ర. వెంటనే నీళ్లు పట్టేస్తాడు దశరథ. రక్తం చూసి షాక్ అవుతుంది దీప. అమ్మకు ఎందుకలా అయ్యింది అని దశరథను అడుగుతుంది. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు దీప. నేను నీతో తర్వాత మాట్లాడుతాను అంటూ లోపలికి వెళ్తాడు దశరథ. రక్తం వాంతు చేసుకుంది అంటే.. అమ్మకు ఏదో అయ్యింది అని టెన్షన్ పడుతుంది దీప. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

