Devatha: చిన్మయికి నిజం చెప్పిన రాద... సొంత తల్లి కాదని తెలుసుకొని కన్నీళ్లు!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 13వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. రుక్మిణి చిన్మయితో, ఈరోజు నుంచి ఇంట్లో పనులన్నీ నువ్వే చేసుకోవాలి అమ్మ, ఇంటి బాధ్యత నీ మీద ఉన్నది అని అంటుంది.అప్పుడు చిన్మయి,ఇదంతా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు అమ్మ అని అనగా,నేను రేపు దేవితో పాటు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అమ్మ అని అంటుంది. దానికి చిన్మయి ఏడుస్తూ, ఇప్పుడు వెళ్లిపోవడం ఎందుకమ్మా? అసలు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నావు?నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని అంటుంది.
ఆ తర్వాత సీన్లో ఆదిత్య ఆలోచిస్తూ రుక్మిణి మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది.అసలు ఏమైనా అయిందా అని అనుకుంటాడు. ఇంతలో సత్య అక్కడికి వచ్చి పాలు ఇస్తుంది.ఆదిత్య పాలు తీసుకుని,పోనీలే ఏదైతే ఏమైంది దేవి ఇంటికి వస్తుంది అదే చాలు అని మనసులో అనుకోని నవ్వుతాడు. అప్పుడు సత్య, నేను ఎదురుగుండా ఉన్నానని చూడకుండా నవ్వుతున్నావు అసలు ఏమైంది అని అడగగా, నేను నవ్వినా, ఆనందపడినది దేవి వాళ్ళ మాత్రమే అని అంటాడు ఆదిత్య.
అప్పుడు సత్య కోపంగా, బయట కూడా తన గోలే,ఇంట్లో కూడా తన గోలే.నీకు పిల్లలు ఇష్టమని నాకు తెలుసు ఆదిత్య. అలాంటి అప్పుడు ఇంట్లో మా అక్క కూతురు ఉన్నది కదా తనని చూసుకో.దేవి దగ్గరికి ఎందుకు వెళ్లడం? నిజంగా అంత పిల్లలు ఇష్టమైతే నన్ను అమెరికా ఎందుకు తీసుకెళ్లడం లేదు? అసలు నీకు తీసుకెళ్లే ఉద్దేశం ఉందా లేదా అని అరుస్తుంది. అప్పుడు ఆదిత్య తీసుకెళ్లే ఉద్దేశం లేదు, నాకు పిల్లలు వద్దు నాకు దేవి యే అందరూ కన్నా ఎక్కువ అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత సీన్లో జానకమ్మ ఆలోచిస్తూ, ఇప్పుడు రాదని ఎలా ఆపాలి, ఇల్లు కూడా చూసుకున్నది అని ఆలోచిస్తూ ఉండగా చిన్మయి ఎక్కడికి వస్తుంది. అప్పుడు జానకమ్మ చిన్మయి తో ,అమ్మ ఒకవేళ నువ్వు అమ్మ లేకపోతే ఏం చేస్తావు అని అడగగా, అమ్మ లేకపోతే నేను ఉండను అని అంటుంది చిన్మయి. అప్పుడు జానకమ్మ మనసులో, చిన్మయి ఎలా ఉంటాదో రాద లేకపోతే అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో దేవి,చిన్మయి పడుకుని ఉంటారు.చిన్మయి అర్ధరాత్రి లెగుస్తుంది. ఏమైందమ్మా మంచినీళ్లు కావాలా అని రాధ వెళ్లి మంచినీళ్లు పడుతూ ఉంటుంది.
చిన్మయి అక్కడికి వచ్చి అసలు నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావమ్మా అని అడుగుతుంది. నువ్వు అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు అని రుక్మిణి అంటుంది.అప్పుడు చిన్మయి, ఆదిత్య రుక్మిణిలో పెళ్లి ఫోటో చూపించి ఆఫీసర్ సార్ ఎందుకమ్మా ఈ ఫోటోలో ఉన్నారు? అసలు నీకు ఆఫీసర్ కి సంబంధం ఏంటి? అయినా నువ్వు నన్ను వదిలేసి దేవిని మాత్రమే ఎందుకు తీసుకువెళ్తున్నావ్ అని అడగగా రుక్మిణి, ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయి, ఇంక నీతో జరిగింది చెప్పాలి అమ్మ అని జరిగిన గతమంతా చెప్పి ఆఫీసరే నా భర్త, దేవి వాళ్ళ తండ్రి కూడా.
నువ్వు మాధవ్ సార్ వాళ్ళ బిడ్డవి అని జరిగిన విషయం అంతా చెప్తుంది. నేను ఇన్ని రోజులు నీకోసమే ఇంట్లో ఉన్నాను అమ్మ, కేవలం నీకోసం మాత్రమే పరాయి వాడి భార్యగా ముద్రవేసిన సరే భరిస్తున్నాను. ఇంక నావల్ల కాదు.నేను దేవిని తీసుకొని వెళ్లాల్సిందే అని అంటుంది.అప్పుడు చిన్మయి, నువ్వు నా అమ్మది కాదా అమ్మ? నువ్వే నన్ను పెంచావు కదా అని రాదని గట్టిగా హద్దుకొని నన్ను వదిలి వెళ్ళొద్దా అమ్మ,ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నన్ను కూడా తీసుకొని పో అంటూ ఏడుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!