రష్మిక రాజసం.. ‘ఛావా’కు ప్లస్ పాయింటేనా?.. మహారాణిగా అదరగొట్టిందిగా
అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ చిత్రం ‘ఛావా’. ఇందులో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజుగా, రష్మిక మందన్న మహారాణి యేసుబాయిగా నటించారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. అద్భుతమైన యాక్షన్, అద్వితీయ నటన, విజువల్స్ తో ప్రేక్షకులను అలరించనుంది.

ఈ చారిత్రాత్మక చిత్రాన్ని మ్యాడాక్ ఫిలిమ్స్ నిర్మిస్తుండగా.. లక్క్ష్్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు వీరపుత్రుడు ఛత్రపతి శంభాజీ మహారాజు కథను ఇది తెరపైకి తెస్తుంది. విక్కీ కౌశల్ శంభాజీ మహారాజుగా, రష్మిక మందన్న మహారాణి యేసుబాయిగా నటిస్తున్నారు.
శివాజీ మహారాజు మరణానంతరం ఏర్పడిన రాజకీయ అల్లకల్లోలంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. మరాఠా సామ్రాజ్యానికి నాయకుడిగా శంభాజీ మహారాజు ఎదుగుదల, ఆయన బలం, దృఢ సంకల్పాన్ని చూపిస్తుంది.
మహారాణి యేసుబాయిగా రష్మిక మందన్న అందం, ధైర్యం ఉట్టిపడేలా నటించింది. విక్కీతో ఆమె కెమిస్ట్రీ బాగుంది. వారిద్దరి మధ్య సంభాషణలు కథకు భావోద్వేగాలను రెట్టింపు చేశాయి.
ఇందులో గొప్ప యుద్ధ సన్నివేశాలు, సెట్ డిజైన్లు, సంభాషణలు మరాఠా సామ్రాజ్య వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా పులితో పోరాడే సన్నివేశంలో విక్కీ నటన అద్భుతం.
అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా లాంటి సీనియర్ తారాగణం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ‘ఛావా’ శంభాజీ మహారాజు వీరగాథను తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.