- Home
- Entertainment
- Guppedantha Manasu: చక్రపాణిని రిక్వెస్ట్ చేసిన విశ్వనాథం.. నరకం అనుభవిస్తున్న అంటూ వసుధార కన్నీళ్లు?
Guppedantha Manasu: చక్రపాణిని రిక్వెస్ట్ చేసిన విశ్వనాథం.. నరకం అనుభవిస్తున్న అంటూ వసుధార కన్నీళ్లు?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తను ప్రేమించిన వాడినే మరొక అమ్మాయి కూడా ప్రేమిస్తుందని తెలిసి బాధపడుతున్న ఒక ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఇంటికి వచ్చిన విశ్వనాధాన్ని చూసి షాక్ అవుతారు చక్రపాణి, వసుధార. షాక్ లోనే విశ్వనాధాన్ని లోపలికి ఆహ్వానించి ఇలా వచ్చారేంటి అని అడుగుతాడు చక్రపాణి. వసుధారతో పని ఉండి వచ్చాను. నేను పెళ్లి గురించి మాట్లాడిన దగ్గరనుంచి ఏంజెల్ ఎక్కువగా వసుధారతోనే మాట్లాడుతుంది. తన మనసులో ఎవరున్నారో వసుధారకు తెలుసు. కానీ అతను ఒప్పుకోవటం లేదు అని ఏంజెల్ వసుధారతో చెప్పటం విన్నాను. ఆ వ్యక్తి ఎవరో కనుక్కుందామని వచ్చాను అంటాడు విశ్వనాథం.
ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా తెలిస్తే చెప్పు అని చెప్తాడు చక్రపాణి. రిషి సార్ అంటుంది వసుధార. చక్రపాణి, విశ్వనాథం ఇద్దరూ షాక్ అవుతారు. రిషి చాలా మంచి అబ్బాయి, అతనిని నేను పెళ్లి గురించి అడిగితే ఇబ్బంది పడతాడేమో పెద్దమనిషిగా మా తరపున రిషి తో మాట్లాడండి అని చక్రపాణిని రిక్వెస్ట్ చేస్తాడు విశ్వనాథం. అప్పటికే ఎమోషనల్ అవుతున్న చక్రపాణి నేను మాట్లాడితే బాగోదు ఈ బాధ్యత నా మీద పెట్టకండి అని చెప్తాడు.
నిజమేలెండి మీరు మాట్లాడితే బాగోదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విశ్వనాథం. అతను వెళ్ళిపోయిన తరువాత బాధతో కుప్పకూలిపోతాడు చక్రపాణి. అతనిని ఓదారుస్తుంది వసుధార. జరిగేదంతా మన మంచికే అనుకుందాం నాన్న. మేము దగ్గర అయ్యే సమయం వచ్చింది. ఇప్పుడు రిషి సార్ మనసులో నేను ఉన్నానో, లేదో బయటపడే అవకాశం ఉంది అంటుంది వసుధార. నువ్వు అన్నది నిజమే మీ ఇద్దరూ ఇప్పటికైనా ఒకటి అవ్వాలి అంటాడు చక్రపాణి.
మరోవైపు కాన్ఫరెన్స్ కాల్ లో మీటింగ్ ఏర్పాటు చేస్తారు జగతి దంపతులు. రిషి సార్ ని చూడటం కోసమే జగతి మేడం వాళ్ళు ఈ ఏర్పాటు చేశారు అనుకుంటుంది వసుధార. విశ్వనాథం అన్నమాటల్ని తలుచుకుంటూ బాధగా రిషి వైపు చూస్తూ ఉంటుంది. అది గమనించిన రిషి ఎందుకు తను డల్ గా ఉంది అని మైండ్ ఆబ్సెంట్ తో ఉంటాడు. అది గమనించిన మహేంద్ర సర్ ఏమైంది అలా అయిపోయారు అని అడుగుతాడు. ఏమీ లేదు సార్ అని మహేంద్ర తో చెప్పి మీటింగ్ ని కూడా క్లోజ్ చేసేయమని, తర్వాత మాట్లాడదామని చెప్పే మీటింగ్ క్లోజ్ చేసేసి వసుధార ని తన దగ్గరికి రమ్మని ఫోన్ చేస్తాడు. జగతి దంపతులు రిషితో మాట్లాడటం చూస్తారు దేవయాని, శైలేంద్ర. వీళ్ళ వాలకం చూస్తే రిషి ని తీసుకువచ్చి నేరుగా ఇంట్లో పెట్టేలాగా ఉన్నారు అనుకుంటారు.
మీటింగ్ క్లోజ్ చేసేసిన తర్వాత కన్న కొడుకుని పరాయి వాడి లాగా కాన్ఫరెన్స్ కాల్ లో చూసుకోవాల్సి వస్తుంది. శైలేంద్ర మనల్ని బావగారి దగ్గర ఇరికించేసాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని టెన్షన్ తో కన్నీరు పెట్టుకుంటుంది జగతి. నువ్వేమీ టెన్షన్ పడకు, ఎప్పటికైనా నిజాయితీయే గెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా చివరికి రిషి యే గెలుస్తాడు. కచ్చితంగా ఇక్కడికి వస్తాడు అంటాడు మహేంద్ర. ఈ మాటలు దేవయాని, శైలేంద్ర వింటారు. అంతిమ విజయం రిషిది కాదు నాది అని కసిగా అనుకుంటాడు శైలేంద్ర.
మరోవైపు తన దగ్గరికి వచ్చిన వసుధారతో మీరు ఎందుకు అలా ఉన్నారు, మీరు చేస్తున్నది ఏమీ బాగోలేదు. ఏంజెల్ ని లవ్ విషయంలో మీరే ఎంకరేజ్ చేస్తున్నారు. నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా నేను ఇప్పుడు ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నరకం అనుభవిస్తున్నాను అని చెప్పి వసుధార మీద కేకలు వేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఏం చెప్పమంటారు సార్ విశ్వనాథం గారు మిమ్మల్ని ఎలాగైనా ఏంజెల్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు.
మీరే కాదు మీతో పాటు నేను కూడా నరకం అనుభవిస్తున్నాను. మీరే అర్థం చేసుకోవడం లేదు అని బాధ పడుతుంది వసుధార. మరోవైపు ఏంజెల్ గురించి ఆలోచిస్తున్న విశ్వనాథం ఎలాగైనా రిషితో మాట్లాడాలి అనుకొని రిషి ని తన గదిలోకి పిలిపించి ఏంజెల్ మనసులో ఉన్నది ఎవరో నాకు తెలిసిపోయింది. అది నువ్వే అంటాడు. ఆ మాటలకి షాక్ అవుతాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.