చిలుక తెచ్చిన వివాదం, బిగ్ బాస్ గంగవ్వపై కేసు నమోదు చేసిన అటవి అధికారులు, ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ తెలుగు 8 ఫేమ్ గంగవ్వ వివాదంలో ఇరుక్కుంది. చిలుక తెచ్చిన తంట ఆమెపై కేసు నమోదైంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
Bigg boss telugu 8
బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యింది గంగవ్వ. ఆమె గతంలో బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో మధ్యలోనే వెళ్లిపోయిన గంగవ్వ, ఆ షోతో విశేషమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ షో కారణంగానే, నాగార్జున చేసిన సహాయం కారణంగా ఆమె సొంతంగా ఇళ్లు కూడా కట్టుకుంది. ఇన్నాళ్లు యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ రాణించిన గంగవ్వ మరోసారి బిగ్ బాస్ షోలో అడుగుపెట్టింది. బిగ్ బాస్ తెలుగు 8లో ఆమె వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సారి రెట్టింపు ఎనర్జీతో షోలో రచ్చ చేస్తుంది. ఓ వైపు ఎంటర్‌టైన్‌మెంట్‌ని, మరోవైపు థ్రిల్ ని ఇస్తూ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
గత ఎపిసోడ్‌లో హార్ట్ ఎటాక్ అంటూ అందరిని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇక ఇప్పుడు దెయ్యం పట్టిందని భయపెట్టింది. ఈ రోజు(అక్టోబర్ 23) ఎపిసోడ్‌లో ఆమె అర్థరాత్రి దెయ్యం పట్టినట్టుగా వ్యవహరించి అందరికి వణుకు పుట్టించింది. ఆమె దెయ్యం పట్టినట్టుగా అరవడంతో అంతా భయబ్రాంతులకు గురయ్యారు.
ఈ క్రమంలో ఇదంతా ఫ్రాంక్ అని తేలిపోయింది. గంగవ్వ, అవినాష్, టేస్టీ తేజ కలిసి ఈ డ్రామా ఆడినట్టు లేటెస్ట్ ప్రోమోలో చూపించారు బిగ్ బాస్. ఇలా ఆరుపదుల వయసులోనూ ఇలా ఎనర్జీతో అలరిస్తున్న గంగవ్వ రియల్ లైఫ్‌లో వివాదంలో ఇరుక్కుంది.
గంగవ్వపై తాజాగా కేసు నమోదైంది. వన్యప్రాణులను హింసించారని ఆరోపిస్తూ జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ ఫిర్యాదు చేశారు. చిలుకని హింసించారని చెబుతూ ఆయన జగిత్యాల అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. గంగవ్వ `మై విలేజ్ షో` ద్వారా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ 4 అవకాశం రావడానికి కూడా అదే కారణం.
తెలంగాణ బామ్మలా తయారై, తెలంగాణ యాసలో మాట్లాడుతూ, వంటలు చేస్తూ కనిపించింది. తనదైన యాస్‌తో ఆకట్టుకుంది గంగవ్వ. ఈ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. చాలా మంది వాటిని తిలకించారు. అదే సమయంలో తెలంగాణ కల్చర్‌ని ప్రతిబింబించేలా ఆమె అనేక వీడియోలు చేశారు. అవన్నీ వైరల్ అయ్యాయి. దీంతో గంగవ్వకి గుర్తింపు వచ్చింది. ఇది బిగ్ బాస్ 4 అవకాశం తెచ్చిపెట్టింది.
అయితే ఇలా వీడియోలు చేస్తున్న క్రమంలో ఆమె 2022లో చిలుక పంచాంగం వీడియో చేశారు. మే 20న తన యూట్యూబ్‌లో ఈ వీడియోని అప్‌లోడ్ చేశారు. ఇందులో నిజమైన చిలుకని ఉపయోగించారు. ఇలా యూట్యూబ్ వీడియోలో చిలుకని ఉపయోగించడంపై గంగవ్వ, యూట్యూబర్ రాజులపై ఆదులాపురం గౌతమ్ అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
చిలుకని ఉపయోగించి దాన్ని హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టం ఉల్లంఘించారని ఫిర్యాదులోగౌతమ్‌త ఎలిపారు. వినోదం కోసం చిలుకని ఉపయోగించడం చట్టం ఉల్లంఘన క్రిందకు వస్తుందని ఫిర్యాదు దారుడు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు అటవీశాఖ అధికారులు గంగవ్వపై, యూట్యూబర్ గంగవ్వపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లో ఉంది గంగవ్వ. ఈ మేరకు ఆమెని ఎలా విచారిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఓ వైపు బిగ్ బాస్ షోలో రచ్చ చేస్తున్న గంగవ్వపై ఇలా కేసు నమోదు కావడం ఆశ్చర్యపరుస్తుంది. అయితే సినిమాల్లో ఇలాంటి సీన్లు వాడినప్పుడు డిస్‌క్లెయిమర్ ఇస్తారు. పక్షులకు, జంతువులకు ఎలాంటి హాని చేయలేదని చెబుతారు.
దానికి సెన్సార్ ఉంటుంది కాబట్టి, ఆ జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ యూట్యూబ్ కి ఎలాంటి సెన్సార్ లేదు. దీంతో డిస్‌క్లెయిమర్ ఉపయోగించే అవగాహన లేదు. ఈ క్రమంలో ఇప్పుడు గంగవ్వపై సదరు వన్యప్రాణుల సంరక్షణ కార్యకర్త ఇలా కేసు పెట్టడం గమనార్హం. దీన్ని గంగవ్వ ఎలా ఎదుర్కొంటారు, ఏం జరుగుతుందనేది చూడాలి.
read more: కమెడీయన్ పక్కన చేయనని తెగేసి చెప్పిన సౌందర్య, చివరికి ఐటెమ్ సాంగ్ చేయాల్సిన పరిస్థితి