కమెడీయన్ పక్కన చేయనని తెగేసి చెప్పిన సౌందర్య, చివరికి ఐటెమ్ సాంగ్ చేయాల్సిన పరిస్థితి
సౌందర్య.. ఓ కమెడియన్‌ని అవమానించింది. ఆయనతో సినిమా చేసేందుకు నో చెప్పింది. కట్ చేస్తే మరో కమెడియన్‌తో ఐటెమ్ సాంగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
సౌందర్య ఎవర్ గ్రీన్ హీరోయిన్. దశాబ్దన్నర పాటు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన నటి. ఎంతో మంది తన తోటి హీరోయిన్లకి చెమటలు పట్టించిన నటి. గ్లామర్ పాత్రలకు పోకుండా ట్రెడిషనల్ లుక్‌లోనే ఆద్యంతం కనువిందు చేసిన నటి. తెలుగు సినిమాల్లో తిరుగులేని స్టార్‌గా ఎదిగి, అంతలోనే మాయమైపోయిన తార. ఆమె నటన గురించి, గొప్పతనం గురించి అంతా చెబుతుంటారు. కానీ ఆమె ఓ కమెడియన్‌ని అవమానించిందట. ఆయనతో సినిమా చేసేందుకు నో చెప్పిందట. మరి ఆ కథేంటో చూస్తే. .
సౌందర్య అప్పట్లో చాలా బిజీయెస్ట్ హీరోయిన్. సూపర్ స్టార్స్ అందరితోనూ నటించింది. చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకీ, రాజశేఖర్, జగపతిబాబు, అర్జున్, జేడీ చక్రవర్తి, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ వంటి హీరోలతోనూ సినిమాలు చేసింది. అందరితోనూ సూపర్ హిట్స్ అందుకుంది. సౌందర్య ఉంటే సినిమా హిట్టే అనేట్టుగా అప్పట్లో పరిస్థితి ఉండేది.
అంతటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సౌందర్య.. కమెడియన్ సరసన సినిమా చేసేందుకు నో చెప్పింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసే తాను, కమెడియన సరసన హీరోయిన్‌గా చేస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించింది. దీంతో ఆయనకు నో చెప్పింది. కానీ ఆ తర్వాత తప్పు తెలుసుకుని మరో కమెడియన్ సరసన ఐటెమ్ సాంగ్ చేయడం గమనార్హం.
Yamaleela
మరి ఇంతకి ఆ కామెడీ హీరో ఎవరంటే, ఆయన ఎవరో కాదు అలీ. కమెడియన్ స్టార్ స్టేటస్‌ని అనుభవించిన అలీ చాలా సినిమాలు హీరోగా చేశారు. దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి ఆయన్ని హీరోగానూ నిలబెట్టాడు. అయితే అలీ హీరోగా `యమలీల` సినిమా చేశాడు దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి. ఇందులో హీరోయిన్‌గా సౌందర్యని తీసుకున్నారు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా అయ్యింది.
కానీ షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయంలోనే ఆమె నో చెప్పిందట. చాలా మంది ప్రముఖులు.. అలీతో చేస్తున్నావా? పెద్ద హీరోలతో చేసే టైమ్‌లో ఇలా చేస్తే కెరీర్ దెబ్బతింటుందని, అవకాశాలు రాకుండా పోతాయని ఏవేవో చెప్పారట. వాళ్ల మాటలు విని అలీ సరసన హీరోయిన్‌గా చేసేందుకు తిరస్కరించిందట సౌందర్య. మీరు నటిస్తే చేస్తా అన్నదట. తాను చేయను, అలీనే హీరో అని తెగేసి చెప్పాడు దర్శకుడు.
`యమలీల` సినిమాలో అలీ సరసన ఇంద్రజని తీసుకున్నారు దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి. అప్పటికీ ఆమె చిన్నగా ఉన్నా, ఫేస్ బాగుండటంతో మరో ఆలోచన లేకుండా హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుంది సౌందర్య. తాను నో చెప్పుకుండా ఉండాల్సిందని బాధపడింది.
ఎవరో మాటలు విని తాను రిజెక్ట్ చేయడం సరికాదని భావించి మళ్లీ దర్శకుడికి ఫోన్ చేసిందట. సర్ ఇలా మిస్టేక్ అయ్యింది. నేను అలా చేయకుండా ఉండాల్సింది, మరో అవకాశం ఇస్తే తప్పు సరి చేసుకుంటాను అని చెప్పిందట సౌందర్య.
ఆ తర్వాత `మాయలోడు` సినిమాలో బాబుమోహన్‌పై సాంగ్ ఉంది. అందులో చేస్తావా అని అడిగాడట దర్శకుడు. సర్ మీరు ఏం చేయమన్నా చేస్తానని చెప్పిందట. హీరో ఎవరనేది చూడనని చెప్పిందట. అలా `మాయలోడు` సినిమాలో `చినుకు చినుకు అందెలతో` సాంగ్ చేసింది సౌందర్య. బాబుమోహన్‌తో వర్షంలో వచ్చే ఈ పాటలో ఆమె అద్భుతంగా డాన్స్ చేసి మెప్పించింది.
మొదట్లో సౌందర్యని ఏదో అనుకున్నారు, కానీ పాట, సినిమా పెద్ద హిట్ కావడంతో సౌందర్యకి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత `శుభలగ్నం` సినిమాలో మరోసారి అలీతో అదే పాటని రీమిక్స్ చేశారు. అందులో సౌందర్య నర్తించింది. అందులోనూ ఈ పాట పెద్ద హిట్ అయ్యింది.
Read more: సిల్క్ స్మిత చనిపోయినప్పుడు హాజరైన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆయన రాక వెనుక అసలు కథ ఇదే!