- Home
- Entertainment
- తొలి రెండు సినిమాలతోనే రూ. 1500 కోట్లు కొల్లగొట్టింది.. కుంభమేళలో సందడి చేసిన ఈ బ్యూటీని గుర్తు పట్టారా.?
తొలి రెండు సినిమాలతోనే రూ. 1500 కోట్లు కొల్లగొట్టింది.. కుంభమేళలో సందడి చేసిన ఈ బ్యూటీని గుర్తు పట్టారా.?
ప్రస్తుతం సినిమా విజయానికి అర్థం మారిపోయింది. ఎంత తక్కువ సమయంలో ఎక్కువ కలెక్షన్లను రాబట్టారు అనేది సక్సెస్‌కు అర్థంగా మారిపోయింది. ఇలా కేవలం రెండు చిత్రాలతోనే ఏకంగా రూ. 1500 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన మూవీలో నటించింది పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్. ఇంతకీ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.?

Guess The actress
అప్పటి వరకు ఆ బ్యూటీ గురించి పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. అయితే 2018లో వచ్చిన ఓ సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. తొలి సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్‌లో పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత వెంటనే ఆ సినిమాకు వచ్చిన సీక్వెల్‌తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇలా కేవలం రెండు చిత్రాల్లోనే ఏకంగా రూ. 1500 కోట్ల కొల్లగొట్టిన సినిమాల్లో నటించిన హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది.
Tollywood
చేసివని కేవలం మూడు సినిమాలే అయినా నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. 11వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ప్రస్తుతం నాని సరసన నటించే లక్కీ ఛాన్స్‌ను కొట్టేసింది. తాజాగా జరుగుతోన్న మహా కుంభమేళలో ఇదిగో ఇలా మాస్క్ ధరించి ఎవరూ గుర్తు పట్టని విధంగా దర్శనమిచ్చింది. ఈ పాటికే ఈ హీరోయిన్ ఎవరో మీకు ఓ క్లారిటీ వచ్చే ఉంటుంది కదూ! అవును ఈ చిన్నది మరెవరో కాదు అందాల తార శ్రీనిధి శెట్టి.
ప్రపంచడమే ఆశ్చర్యపోయేలా జరుగుతోన్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాను వీక్షించేందుకు వచ్చింది శ్రీనిధి శెట్టి. తన తండ్రితో కలిసి ఆధ్మాతిక కార్యక్రమంలో తళుక్కుమంది. ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా ఒక మాస్క్‌ను ధరించి సామాన్య భక్తురాలిగా కనిపించింది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను నటి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
మహా కుంభమేళలో తాను దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ‘నిజంగా ప్రయాగ్ రాజ్ నన్ను పిలిచినట్లు అనిపిస్తుంది. మొదట్లో నాకున్న వర్క్ బిజీ వల్ల ఇక్కడకు రావడానికి కుదరదేమోనని అనుకున్నాను. కానీ సడెన్‌గా ఏమైందో ఏమోకానీ నా పనుల్లన్నింటిని పక్కన పెట్టి వెంటనే టికెట్ బుక్ చేసుకున్నాను. దీనికి ప్రధాన కారణం మా నాన్న. చివరి నిమిషంలో మనం కుంభమేళాకి వెళుతున్నామంటూ డాడీ నాకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇది నిజంగా మన జీవితంలో ఒకసారి జరిగేది, వచ్చేది కాబట్టి ఎలాంటి ప్రశ్నలు, సందేహాలు అడగకుండా నాన్నకు ఓకే చెప్పేశాను. ఇక్కడి ఒక్కొక్క అనుభవం, జీవితాంతం జ్ఞాపకం’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.