రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో పేరు, ఏకంగా ఐలాండ్‌కే యజమాని, ప్రభాస్‌తో జతకట్టిన ఈ బ్యూటీ ఎవరంటే
సినిమా అంటేనే అదో రంగుల ప్రపంచం. అయితే ఈ రంగుల్లోనూ కొన్ని డార్క్ షేడ్స్ కూడా ఉంటాయి. సినిమాలతో సమానంగా వివాదాలతోనూ వార్తల్లోకి ఎక్కిన నటీమణులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

2009లో వెండి తెరకు పరిచయమైంది. అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. హిందీతో పాటు తెలుగులోనూ నటించి పాన్ ఇండియా హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. నటిగా ఓ వెలుగు వెలుగుతోన్న సమయంలోనే పలు వివాదాల్లోకి ఇరుక్కుంది. 39 ఏళ్ల వయసులోనే ఏకంగా ఓ ఐల్యాండ్‌ను కొనుగోలు చేసింది, కోట్లాది రూపాయలను ఆర్జించింది. చివరికి ఏకంగా రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో విచారణ సైతం ఎదుర్కొంది.

ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో మీకు ఈ పాటికే ఓ క్లారిటీ వచ్చే ఉంటుంది కదూ! అవును ఈ చిన్నది మరెవరో కాదు అందాలన జాక్వలిన్ ఫెర్నాండెజ్. శ్రీలంకలో జన్మించిన జాక్వలిన్ మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంబించింది. ఆ తర్వాత 2009లో వచ్చిన అల్లాదీన్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక శ్రీలంక యూనివర్స్‌గా పోటీలో గెలిచిన జాక్వలిన్‌ను బాలీవుడ్‌లో వరుస అవకాశాలు క్కూ కట్టాయి. తెలుగులో ప్రభాస్‌తో సాహో మూవీలో స్పెషల్ సాంగ్‌లో నటించిందీ బ్యూటీ.
ఇదే క్రమంలో ఆమె ఆస్తులు కూడా ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. ముంబయిలోని జుహు ప్రాంతంలో విలాసవంతమైన 5 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ ఈ బ్యూటీ కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీని విలువ సుమారు రూ. 10 కోట్ల పైమాటే. ఇక జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి శ్రీలంకలో ఏకంగా ఓ ప్రైవేట్ ద్వీపం ఉన్నట్లు సమాచారం. జాక్వెలిన్ దగ్గర రోవర్ వోగ్ ధర రూ.2.11 కోట్లు, హమ్మర్ హెచ్2 ధర రూ.75 లక్షలు.
ఇదిలా ఉంటే కేవలం ఆస్తులతోనే కాకుండా పలు వివాదాల కారణంగా కూడా జాక్వెలిన్ వార్తల్లో నిలిచింది.
సుకేశ్ చంద్రశేఖర్ కేసు విచారణలో భాగంగా జాక్వెలిన్‌ను విచారించిన విషయం తెలిసిందే. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌ను ఈడీ అధికారులు విచారిచారు. సుకేష్‌తో ఆమెకు ఉన్న సంబంధం, అతని నుంచి ఆమెకు లభించిన బహుమతుల గురించి పోలీసు అధికారులు ప్రశ్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే జాక్వెలిన్‌కు చెందిన 7 కోట్ల ఆస్తుల్ని కూడా ఈడీ అటాచ్ చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుకేశ్ తిహార్ జైల్లో ఉన్నాడు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.