- Home
- Entertainment
- Sreemukhi: అక్కా తనూజ, కళ్యాణ్‌ని కలపండి.. శ్రీముఖికి నెటిజన్ల క్రేజీ రిక్వెస్ట్ లు.. డోస్ తగ్గించడంపై ఆందోళన
Sreemukhi: అక్కా తనూజ, కళ్యాణ్‌ని కలపండి.. శ్రీముఖికి నెటిజన్ల క్రేజీ రిక్వెస్ట్ లు.. డోస్ తగ్గించడంపై ఆందోళన
శ్రీముఖి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలో ఆమెకి నెటిజన్లు క్రేజీ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. తనూజ, కళ్యాణ్‌లను కలపాలి అంటున్నారు.

బుల్లితెర స్టార్, టాప్ యాంకర్‌గా రాణిస్తోన్న శ్రీముఖి
స్టార్ యాంకర్ శ్రీముఖి ఇప్పుడు తెలుగు టీవీకి సంబంధించి టాప్ యాంకర్‌గా రాణిస్తుంది. యాంకర్ సుమ స్థానాన్ని భర్తీ చేస్తోంది. గతంలో సుమ నెంబర్ 1గా ఉండేది. కానీ ఆమె ఇప్పుడు అన్ని షోస్ వదిలేసింది. ప్రస్తుతం ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉంటుంది. దీంతో ఆ స్థానాన్ని శ్రీముఖి భర్తీ చేస్తోంది. ప్రస్తుతం ఎక్కువ టీవీ షోస్ చేస్తున్న యాంకర్ శ్రీముఖినే కావడం విశేషం. ఆమె చేతిలో నాలుగైదు షోస్ ఉన్నాయి. అంతేకాదు స్పెషల్ ఈవెంట్లకి కూడా శ్రీముఖినే బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
నయా ఫోటోలతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న శ్రీముఖి
దీంతో ఎక్కువగా షోస్ ఉన్న నేపథ్యంలో యాంకర్ శ్రీముఖి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ అలరిస్తోంది. నయా దుస్తులు ధరించి కనువిందు చేస్తోంది. ఆమె గ్లామర్ విందుకు నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. తాజాగా ట్రెండీ గౌన్‌లో మెరిసింది శ్రీముఖి. ఫ్యాషన్‌కి అద్దం పట్టే ఈ డ్రెస్‌లో శ్రీముఖి హోయలు పోతూ ఫోటోలకు పోజులిచ్చింది.
శ్రీముఖి గ్లామర్‌పై నెటిజన్ల ఆందోళన
ప్రస్తుతం శ్రీముఖి నయా ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. కుర్రాళ్లని కట్టిపడేస్తున్నాయి. దీంతో నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్నాయి. అయితే ఓ విషయంలో ఆందోళన చెందుతున్నారు. గతంలో చాలా గ్లామరస్‌గా కనిపించేది శ్రీముఖి. అందాల విందు చేసేది. కానీ ఇప్పుడు తగ్గించింది. డోస్ తగ్గించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాను రాను మరీ ఇలా డోస్ తగ్గిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
తనూజ, కళ్యాణ్‌లను కలపండి శ్రీముఖి
అందులో భాగంగానే కొందరు నెటిజన్లు శ్రీముఖిని విచిత్రమైన కోరికలు కోరుతున్నారు. తనూజ, కళ్యాణ్‌ని కలపండి అంటూ రిక్వెస్ట్ లు పెట్టడం విశేషం. కళ్యాణ్, తనూజలను తమ షోకి తీసుకురావాలని అడుతున్నారు. ఎందుకంటే శ్రీముఖి నిర్వహిస్తున్న షోస్‌లో ప్రముఖంగా ఉన్నది `ఆదివారం స్టార్ మా పరివారం`. ఈ షోకి తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు వచ్చారు. ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్, శ్రీజ, భరణి, రాము రాథోడ్, డీమాన్ పవన్, రీతూ చౌదరీ, దివ్య వంటి వారు పాల్గొన్నారు. కానీ తనూజ రాలేదు.
బిగ్ బాస్ షోలో రచ్చ చేసిన కళ్యాణ్, తనూజ
ఈ నేపథ్యంలో ఆ షోని ఉద్దేశిస్తూ, ఇక్కడ శ్రీముఖికి రిక్వెస్ట్ పెడుతున్నారు. తనూజ, కళ్యాణ్ బిగ్ బాస్ షోలో క్లోజ్‌గా మూవ్ అయిన విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు తమ అభిమానాన్ని చాటుకున్నారు. కళ్యాణ్ కూడా తనూజపై తన ఇష్టాన్ని వెల్లడించాడు. గ్రాండ్ ఫినాలే రోజు కప్ గెలిచిన తర్వాత కూడా తనూజ గురించి ప్రస్తావించాడు. ఇద్దరి మధ్య బయటకు రాని కెమిస్ట్రీ రన్ అయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఇద్దరిని ఒకే షోలో కలిసి చూడాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. అదే రిక్వెస్ట్ ని శ్రీముఖికి తెలియజేస్తున్నారు. మరి శ్రీముఖి వారి కోరికని నెరవేరుస్తుందా అనేది చూడాలి.

