Poonam Pandey : సంచలనంగా పూనమ్ పాండే వివాదాలు.. కాంట్రవర్సీలకు కేరాఫ్ గా బాలీవుడ్ నటి!
బాలీవుడ్ నటి పూనమ్ పాండే (Poonam Pandey) జీవితంలో ఐదు ప్రధాన కాంట్రవర్సీలను ఎదుర్కొంది. ఆమె తీరుతో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆమెను వార్తల్లో నిలిపిన ఐదు వివాదాలను తెలుసుకుందాం..
బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఈరోజు కన్నుమూసింది. క్యాన్సర్ కారణంగా ఆమె మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. చిత్ర పరిశ్రమలో, ఇంటర్నెట్ లో సంచలనంగా మారిన ఆమె మరణించడం షాక్ కు కూడా గురిచేసింది.
పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్టు ఆమె పీఆర్ టీమ్ తెలియజేసింది.... దీంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సినీలోకం కోరుకుంటోంది. గతంలో ఆమె క్రియేట్ చేసిన సంచనాలకు ప్రస్తుతం నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.
బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే తన బోల్డ్ లుక్స్‌తో తరచుగా వార్తల్లో నిలిచేది. చివరిగా కంగనా రనౌత్ ‘లాక్ అప్’ రియాలిటీ షోతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తొలుత ఈ బ్యూటీ 2011 క్రికెట్ ప్రపంచకప్ సందర్భంగా భారత్ గెలిస్తే తాను బట్టలు విప్పేస్తానని బీసీసీఐకి లేఖ రాసింది.
అయితే బీసీసీఐ మాత్రం ఆమెకు అనుమతి ఇవ్వలేదు. అలా చేయడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ తర్వాత తన బోల్డ్, సిజ్లింగ్ చిత్రాల కారణంగా పూనమ్ వార్తల్లో నిలిచారు. ఓసారి బాత్ రూమ్ లో న్యూడ్ గా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఏకంగా వీడియోను విడుదల చేసి ఇంటర్నెట్ లో చర్చగా మారింది.
ఇక కరోనా లాక్ డౌన్ లోనూ పూనమ్ పాండే వివాదంలో చిక్కుకుంది. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి తన భర్త సామ్‌తో కలిసి బయట వాకింగ్ కి వెళ్లడంతో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ విధంగా సోషల్ మీడియాలో ఈమె పేరు బాగా వినిపించింది.
రీసెంట్ గా తన భర్త సామ్ దాడికి పాల్పడ్డాడని పూనమ్ పాండే ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. సామ్‌ను అరెస్టు చేశారు. సామ్ తనను కొట్టేవాడని పూనమ్ పాండే లాక్ అప్ షోలో వెల్లడించింది. అలా జనాల్లోకు గుర్తుండిపోయింది. 2017లో పూనమ్ పాండే రిలీజ్ చేసిన లాంచ్ చేసిన యాప్ కారణంగానూ వివాదంలో చిక్కుకుంది. బోల్డ్ కంటెంట్ ఇవ్వడంతో యాప్‌ను గూగుల్ ఒక గంటలో ప్లే స్టోర్ నుంచి తొలగించింది.