కన్నీళ్ళు పెట్టుకున్న అవినాష్.. బిగ్‌బాస్‌లో రాజకీయాలు.. ఆద్యంతం ఉత్కంఠభరితం
First Published Nov 24, 2020, 10:40 PM IST
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 79వ రోజు ఆద్యంతం రసవత్తరంగా సాగింది. నామినేషన్ నుంచి బయట పడటానికి మరో అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. ఈ ఉత్కంఠభరిత పోరులో బిగ్‌బాస్ అడిక్షన్ ఫ్రీ పాస్ ని అవినాష్ గెలుచుకున్నారు.

ఇక మొదటగా సోమవారం నామినేషన్ ప్రక్రియ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనతో నామినేట్ అయిన సభ్యులు ఎమోషనల్‌గా, ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. ఇందులో అవినాష్, అఖిల్, అరియానా, మోనాల్ నామినేట్ అయ్యారు. అయితే ఈ నామినేషన్‌కి సంబంధించిన ఫ్రస్టేషన్‌ని వెల్లగక్కుతున్నారు ఇంటిసభ్యులు. ముఖ్యంగా అవినాష్, అఖిల్ చాలా ఫీల్ అవుతున్నారు. అరియానా నామినేషన్ అయినందుకు ఏడుస్తుంటే అవినాష్ తన ఫ్రస్టేషన్‌ని వెల్లడించారు. గేమ్ చూసి నామినేషన్ జరగడం లేదని చెప్పాడు. ఇక కష్టపడి టాస్క్ లు ఆడాల్సిన అవసరం లేదని మండిపడ్డాడు.

మరోవైపు `మా నాన్నకు నువ్వు నచ్చావు.. ఏందో ఏమో` అని అభిజిత్ అన్నాడు. అంతేకాదు నేను మీ అమ్మకి కూడా నచ్చాను.. ఆ విషయం ఎందుకు అర్థం కావడంలేదో `అని అభిజిత్ తెలిపారు. దీంతో మోనాల్ బాగా ఇంప్రెస్ అయ్యింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?