- Home
- Entertainment
- Bigg Boss Telugu 9: కామన్ మ్యాన్ సెలక్షన్ ఎలా జరుగుతుందో తెలుసా? దీనికంటే సివిల్స్ ఇంటర్వ్యూలు ఈజీ
Bigg Boss Telugu 9: కామన్ మ్యాన్ సెలక్షన్ ఎలా జరుగుతుందో తెలుసా? దీనికంటే సివిల్స్ ఇంటర్వ్యూలు ఈజీ
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుంది. అయితే కామన్ మ్యాన్ ఎంట్రీకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇందులో తెలుసుకుందాం.

`బిగ్ బాస్ తెలుగు 9` హౌజ్‌లోకి కామన్ మ్యాన్‌కి ఛాన్స్
`బిగ్ బాస్ తెలుగు 9`వ సీజన్ హడావుడి ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సీజన్ లోగోని విడుదల చేశారు. ఈ సారి రణరంగమే అంటూ షోపై హైప్ పెంచారు హోస్ట్ నాగార్జున.
అదే సమయంలో ఈ సారి కామన్ మ్యాన్‌కి కూడా ఛాన్స్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఏడో సీజన్‌లో ఇలాంటి అవకాశమే కల్పించిన విషయం తెలిసిందే. అది పెద్ద హిట్ అయ్యింది.
అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తున్నారు, అందులో భాగంగానే ఇప్పుడు మరోసారి ఆ ఛాన్స్ ఇస్తున్నారు. కామన్ మ్యాన్ కేటగిరిలోనూ కంటెస్టెంట్లని ఎంపిక చేయబోతున్నారు. దీన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
బిగ్ బాస్ తెలుగు 9 కామన్ మ్యాన్ కేటగిరికి భారీగా స్పందన
దీంతో బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి వెళ్లాలనుకునే కామన్ మ్యాన్‌కి ఆశలను రేకెత్తించారు. ఈ కామన్ మ్యాన్ కేటగిరికి భారీగా స్పందన లభిస్తున్నట్టు తెలుస్తోంది. వేల మంది పోటీ పడుతున్నట్టు సమాచారం.
ఈ కామన్ మ్యాన్ కేటగిరిలో కంటెస్టెంట్లని ఎలా ఎంపిక చేస్తారు? ఎవరిని ఎంపిక చేస్తారు? దాని ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు సస్పెన్స్ తో కూడిన ఆసక్తిగా మారింది.
బిగ్ బాస్ తెలుగు 9 కామన్ మ్యాన్ ఎంపిక ప్రక్రియ
`బిగ్ బాస్ తెలుగు 9` కామన్ మ్యాన్ కేటగిరికి సంబంధించిన ప్రాసెస్ ఏంటనేది బయటకు వచ్చింది. ఈ షోలోకి రావడానికి అప్లై చేసుకున్న వారిలో సుమారు రెండు వందల మందిని మొదటి స్టేజ్‌లో ఎంపిక చేస్తారట.
వారు పంపిన వీడియోలను ఫిల్టర్ చేసి, లుక్ వైజ్‌గా, కాన్ఫిడెన్స్ వైజ్‌గా బాగున్నవారిని ఎంపిక చేస్తారట. రెండో స్టేజ్‌లో అందులోనుంచి వంద మందిని ఫోన్ కాల్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు.
మూడో స్టేజ్‌లో ఈ వంద మందితో గ్రూప్ డిస్కషన్ ఉంటుందట. ఇందులో 40 మందిని సెలెక్ట్ చేస్తారట. నాల్గో స్టేజ్‌లో ఈ 40 మందిని జడ్జ్ లు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా కొందరు చూసి ఇంటర్వ్యూస్ చేసి అందులో 15 మందిని ఎంపిక చేస్తారట.
ఇక ఐదో స్టేజ్‌లో ఈ 15 మందిని పబ్లిక్ ఓటింగ్ పద్ధతిలో ఫిల్టర్ చేసి, వీరిలో ముగ్గురుని ఫైనల్ చేస్తారట. వారినే కంటెస్టెంట్లుగా హౌజ్‌లోకి పంపిస్తారని సమాచారం.
`బిగ్ బాస్ తెలుగు 9` కామన్ మ్యాన్ కేటగిరిలో ఈసారి ముగ్గురికి ఛాన్స్ ఇస్తారా?
ఇలా ఐదు స్టేజ్‌లు దాటుకుని నిలబడ్డ వారికి మాత్రమే బిగ్ బాస్ హౌజ్‌లో ఛాన్స్ లభిస్తుందని చెప్పొచ్చు. ఈ రేంజ్‌లో ఫిల్టర్ సివిల్స్ జాబ్స్ లో కూడా ఉండదేమో. అక్కడ మూడు స్టేజ్‌లోనే ఎంపిక జరుగుతుంది.
ఇది దాన్ని మించి ఉండటం గమనార్హం. అయితే సాధారణంగా ఒక్కరికే కామన్ మ్యాన్ కేటగిరిలో కంటెంస్టెంట్లుగా ఎంపిక చేస్తారు. కానీ ఈ సారి ఎక్కువ మందికి అవకాశాలు కల్పించాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఇది బిగ్ బాస్ లవర్స్ కి మంచి శుభ పరిణామంగా చెప్పొచ్చు. మరి ఈ సారి ఎవరికి బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తుందనేది చూడాలి.
`బిగ్ బాస్ తెలుగు 9`కి కంటెస్టెంట్లుగా వినిపిస్తున్న పేర్లు
ప్రస్తుతానికి బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌కి సెలబ్రిటీ కంటెస్టెంట్ల ఎంపిక ప్రాసెస్ కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కొందరు ఆర్టిస్టుల పేర్లు కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి.
వారిలో సోషల్ మీడియా సెన్సేషన్ రీతూ చౌదరీ, టీవీ నటులు కావ్య, దీపికా, తేజస్విని, శివ కుమార్, దేబ్‌జానీ, సినిమా నటులు సాయికిరణ్, సుమంత్ అశ్విన్, కల్పిక గణేష్, ఛత్రపతి శేఖర్, కాంట్రవర్సీ సెన్సేషన్ అలేఖ్య చిట్టి పికిల్స్ గర్ల్ రమ్య కంచర్ల వంటి పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి.
వివాదాస్పద ఆర్టిస్టులకు ప్రయారిటీ
అలాగే రాజ్ తరుణ్, ఒకప్పటి హీరో రోహిత్ పేర్లు కూడా వినిపించాయి. మరి వీరిలో ఎందరు హౌజ్‌లోకి వస్తారనేది చూడాలి. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 7న ప్రారంభం కానుందని తెలుస్తుంది.
ఈ సారి `నవరత్నాలు` కాన్సెప్ట్ హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. అదే సమయంలో ఈ సారి వివాదాస్పద కంటెస్టెంట్లకి ప్రయారిటీ ఇస్తున్నట్టు సమాచారం.