- Home
- Entertainment
- రీతూ అతడితో రాత్రి అంటి కూర్చుంటుంది..గొంతు పట్టుకున్న పవన్, కుర్చీ విసిరి కొట్టిన కళ్యాణ్
రీతూ అతడితో రాత్రి అంటి కూర్చుంటుంది..గొంతు పట్టుకున్న పవన్, కుర్చీ విసిరి కొట్టిన కళ్యాణ్
బిగ్ బాస్ తెలుగు 9లో సోమవారం హౌస్ రణరంగంగా మారింది. నామినేషన్స్ లో భాగంగా ఇంటి సభ్యులు హద్దులు దాటి ప్రవర్తించారు. సంజన.. రీతూతో గొడవ పడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

బిగ్ బాస్ తెలుగు 9
బిగ్ బాస్ తెలుగు 9లో భాగంగా సోమవారం నామినేషన్స్ జరిగాయి. నామినేషన్స్ లో భాగంగా హౌస్ అసలైన రణరంగంగా మారింది. బిగ్ బాస్ రెండు రౌండ్లలో నామినేషన్స్ నిర్వహించారు. మొదటి రౌండ్ లో భరణికి 2, పవన్ 2, సుమన్, తనూజ, కళ్యాణ్, సంజన లకు ఒక్కో ఓటు వచ్చారు. రెండవ రౌండ్ లో అసలు కథ మొదలైంది.
నోరు కంట్రోల్ లో లేదు
ఇంటి సభ్యులు ఒక్కొకరుగా వచ్చి తొలి రౌండ్ లో నామినేట్ చేసిన వారిని కాకుండా ఇంకొకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. కారణం చెప్పి వాళ్ళ ఫోటో ఫైర్ లో వేయాలి. ముందుగా భరణి.. దివ్యని నామినేట్ చేశారు. ఆమె మంచిది అయినప్పటికీ నోరు కంట్రోల్ లో ఉండడం లేదని భరణి ఆమెని నామినేట్ చేశారు. దీనితో దివ్య అతడికి కౌంటర్ ఇచ్చింది మీలాగా నేను అన్నీ సాఫ్ట్ గా డీల్ చేయను. అవసరమైనప్పుడు వాయిస్ రైజ్ చేస్తాను అని తెలిపింది.
తనూజని నామినేట్ చేసిన ఇమ్మాన్యుయేల్
ఇమ్మాన్యుయేల్.. తనూజని నామినేట్ చేశారు. ఇద్దరి మధ్య పెద్ద రచ్చ జరిగింది. ఇమ్మాన్యుయేల్ కి కెప్టెన్సీ వాల్యూ తెలియదు అందుకే త్యాగం చేశాడు అని తనూజ అనడం తనకి నచ్చలేదని ఇమ్మాన్యుయేల్ తెలిపాడు. తనూజ తనని నామినేట్ చేసిన వారిలో కొందరిని మాత్రమే టార్గెట్ చేస్తుంది. మరికొందరితో సేఫ్ గేమ్ ఆడుతుంది అని ఇమ్ము అన్నాడు. నీ దగ్గర కరెక్ట్ పాయింట్ ఉంటేనే నామినేట్ చేయి. నీ ఇష్టం వచ్చినట్లు చేయకు అని తనూజ ఫైర్ అయింది.
రీతూ కోసమే ఆడుతున్నాడు
పవన్.. ఇమ్మాన్యుయేల్ ని నామినేట్ చేయడంతో హౌస్ రణరంగంగా మారింది. హౌస్ లో రీతూ తర్వాత తాను ఇష్టపడేది ఇమ్మా అన్ననే. రెబల్ టాస్క్ లో కంటెండర్ గా తప్పించడానికి ఇమ్మ అన్న నా పేరు చెప్పడంతో భరించలేకపోయా అని పవన్ అన్నాడు. వీరి మధ్యలో కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది. దీనితో కళ్యాణ్ పవన్ తో వాగ్వాదానికి దిగాడు. వీరి గొడవలోకి రీతూ కూడా దూరింది. దీనితో కళ్యాణ్.. పవన్ తన గేమ్ తాను ఆడడం లేదు, రీతూ కోసమే ఆడుతున్నాడు అని ఆరోపించాడు. దీనితో రీతూ, కళ్యాణ్ ఒకరిపై ఒకరు వేలు చూపించుకుంటూ పైకి దూకారు.
రీతూ అతడితో రాత్రి అంటి కూర్చుంటుంది
పవన్.. కళ్యాణ్ ని అడ్డుకునే క్రమంలో అతడి గొంతు పట్టుకున్నాడు. కానీ కళ్యాణ్ పవన్ పై సీరియస్ కాలేదు. తన మీదికి వస్తున్న రీతూను చూసి భరించలేక కుర్చీ విసిరికొట్టాడు. ఆ తర్వాత రీతూ, సంజన మధ్య పెద్ద రచ్చ జరిగింది. ఈ క్రమంలో సంజన రీతూపై నోరు జారింది. రీతూ రాత్రిపూట పవన్ తో అంటి కూర్చుంటుంది అని సంజన స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇది వినగానే అంతా షాక్ అయ్యారు. రీతూ కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే ఇమ్మాన్యుయేల్, తనూజ ఇతరులు వచ్చి.. సంజనగారు అలా మాట్లాడవద్దు.. ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడకండి కరెక్ట్ కాదు అని వారించారు. వివాదం ముగిసిన తర్వాత బిగ్ బాస్ ఈవారం నామినేషన్స్ లో నిలిచిన వారిని ప్రకటించారు. దివ్య, పవన్, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన, భరణి, సుమన్, తనూజ ఈవారం నామినేషన్స్ లో ఉన్నారు.

